Latest Updates
-
ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం త్వరగా అయిపోయే మసాలా కొబ్బరి అన్నం...పిల్లల లంచ్ బాక్స్ కు బెస్ట్ -
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!
అలర్ట్: బీట్ రూట్ తో 8 సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ..!!
ప్రకాశవంతమైన రంగులో మార్కెట్లో లభ్యమవుతున్న ఈ కూరగాయ తో చాలా లాభాలున్నాయి.బీట్ రూట్ అనగానే మనం మొదట దాని రంగే చూస్తాము, కానీ ఈ ప్రకాశవంతమైన రంగే కాకుండా దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
బీట్ రూట్ ని అనేక రకాలుగా అనేక ప్రయోజనాలకోసం వాడవచ్చు. బీట్ రూట్ జూస్ ని శక్తి స్థాయిలు పెంచి క్రీడా సామర్ధ్యం మెరుగుపడటానికి వాడతారు. చక్కటి కంటి చూపు కోసం కూడా దీనిని వాడతారు.బీట్ రూట్స్ లో విటమిన్లు,మెగ్నీషియుం మరియు బయో ఫ్లేవనాయిడ్లుంటాయి.
శరీరం లో ట్రై గ్లిజరాయిడ్ల శాతం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రై గ్లిజరాయిడ్లు తగ్గటం వల్ల రక్తం లోని కొవ్వు కూడా తగ్గుతుంది.శరీరం లో సహజం గా హార్మోనులు ఉత్పత్తి కావడానికి బీట్ రూట్ సహకరిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే అనేక రకాల వ్యాధుల నివారణ లో బీట్ రూట్ ని వాడతారు.ఇన్ని సుగుణాలున్నా ఇది కొంచెం ప్రమాదకరం కూడా. బీట్రూట్ లోని దుష్ప్రభావాలు :
"మెరిసేదంతా బంగారం కాదు".బీట్ రూట్ అధ్భుతం గా ఉన్నా మన ఆరోగ్యానికి మెలే చెయ్యాలన్న నియమం లేదు.దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బీట్ రూట్ దుష్ప్రభావాలు కింద ఇచ్చాము చూడండి.

కిడ్నీ సమస్యలు
కిడ్నీ వ్యాధి తో బాధ పడేవారు బీట్ రూట్ వాడకాన్ని పూర్తిగా మానెయ్యాలి,బీట్ రూట్ లో ఉన్న బీటైన్ శరీరం లోని కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది.కిడ్నీ వ్యాధి గ్రస్తులు బీటైన్ ని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం వల్ల బీటైన్ వల్ల కలిగే ఉపద్రవాలని నివారించవచ్చు.

రక్తపోటు స్థాయిలని తగ్గిస్తుంది
రక్తపోటు స్థాయిలని తగ్గించడం అనే గుణం బీట్ రూట్ యొక్క సహజ లక్షణం. అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది వరమే కానీ ఇది అధిక రక్త పోటు ని నియంత్రించే మందులతో కలిసి శరీరం లో రక్తపోటు స్థ్యాయిలని ప్రమాద కర స్థాయికి తగ్గించెస్తుంది.ఒక వేళ మీరు కనుక అధిక రక్త పోటు మందులు వాడుతుంటే కనుక బీట్ రూట్ ని జాగ్రత్తగా తీసుకోండి.

కాల్షియం స్థాయిలు
బీట్ రూట్ రసం శరీరం లో కాల్షియం స్థాయిలని తగ్గిస్తుంది.ఇది అనేక రకాల వ్యాధులకి దారితీస్తుంది.బీట్ రూట్ రసం అధికం గా తాగడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది.కాల్షియం స్థాయిలు తగ్గడం వల్ల అనేక రకాల ఎముకకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.అందువల్ల ప్రతీసారి నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలి.

వోకల్ కార్డ్ సమస్యలు:
బీట్ రూట్ రసం తాగడం వల్ల గొంతులో ఒక రకమిన బిగువు గా అనిపించి మాట్లాడటం కష్టమవ్వచ్చు.బీట్ రూట్ ని అధికం గా తీసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.స్వర తంత్రి సమస్య ని నివారించాలంటే బీట్ రూట్ ని ఇతర కూరగాయ ల రసాలతో కలిపి తీసుకోవాలి.

కిడ్నీ లో రాళ్ళు
బీట్ రూట్ లో ఉన్న అధిక ఆక్సలేట్ కిడ్నీ లో రాళ్ళు ఏర్పడటానికి ఆస్కారమిస్తుంది.మీకు కనుక ఇంతకుమునుపు కిడ్నీ లో రాళ్ళు ఏర్పడిన చరిత్ర ఉన్నట్లయితే కనుక బీట్ రూట్ ని అధికం గా తీసుకోవద్దు.ఇది మీ ఆరోగ్యానికి హానికరం.

ప్రెగ్నెన్సీ
గర్భవతులు బీటైన్ ని తీసుకునె ముందు జాగ్రత్తలు పాటించాలి. ఇది తల్లీ మరియు బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది."మయో క్లినిక్" ప్రకారం ప్రెగ్నెన్సీ సమయం లో గర్భవతులు దీని తీసుకోవడానికి "సీ"(C) రేటింగ్ ఇచ్చారు.అనగా జంతువుల మీద జరిపిన పరిశోధన ప్రకారం ఎదిగే పిండం మీద బీటైన్ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.అనవసర అనర్ధాలు వద్దనుకుంటే ప్రెగ్నెన్సీ సమయం లో బీట్ రూట్ ని పరిమితం గా వాడండి.

వికారం మరియు డయేరియా
బీట్ రూట్ వల్ల కొంతమందిలో వికారం మరియు డయేరియా కూడా కలగవచ్చు. బీట్ రూట్ యొక్క గాఢ సారాన్ని బీటైన్ అంటారు.ఇది చాలా సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కలగచేస్తుంది.

ఇతర సమస్యలు
బీట్రూట్ రసం తాగిన తరువాత కొంతమందిలో జ్వరం, వణుకు మరియు దద్దుర్లి వస్తాయి.
ఈ దుష్ప్రభావాలు చూస్తే భయానకం గా అనిపించవచ్చు కానీ బీట్ రూట్ వల్ల కలిగే లాభాలముందు ఇవన్నీ సముద్రం లో నీటి చుక్క లాంటివి.
అందువల్ల బీట్ రూట్ ని మనసారా ఆస్వాదించండీ.ఒకవేళ మీకు కనుక పైన చెప్పిన దుష్ప్రభావాల్లాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం కంగారు పడకుండా వైద్యుడిని సంప్రదిస్తే అంతా సర్దుకుంటుంది.
మీకెప్పుడైనా బీట్రూట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగాయా?? మీ అనుభవాలని కింద కామెంట్స్ రూపం లో పంచుకోండి.



Click it and Unblock the Notifications
