Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
హెల్తీ లైఫ్ కు వాటర్ వర్సెస్ ఫ్రూట్స్ జ్యూస్ లు ఏది బెటర్
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్సియస్ నెస్ పెరిగింది. అందుకే సరైన సమయానికి ఆహారం తీసుకోకపోయినా, జ్యూస్ , ఫ్రూట్ తినడం వంటివి చేస్తున్నారు. కాలీ పొట్టతో ఉండటం కంటే ఇలా శరీరానికి ఏదో ఒక విధంగా ప్రయోజనం అందించడానికి ఫ్రూట్ జ్యూసులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇవి దాహార్తిని తీర్చడంతో పాటు, శరీరానికి అవసరం అయ్యే విటమిన్స్, న్యూట్రీషియన్స్ అందిస్తాయి . ఒక రకంగా ఇది ఒక మంచి అలవాటే అని చెప్పవచ్చు . అయితే ఈ జ్యూసులకు షుగర్ జోడించకపోతే ఏం జరుగుతుంది. మీ టేస్ట్ బడ్స్ స్వీట్ నెస్ లేకుండా ఇష్టపడవా?
ఎర్లీ మార్నింగ్ కాపర్ (రాగి) పాత్రలోని నీళ్ళ త్రాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
మరి నిత్యం మనం తీసుకొనే నీటి సంగతేంటి? నీటి వల్ల మనకు ప్రయోజనాలున్నాయా? అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఎందుకంటే ఫ్రూట్ జ్యూసులు త్రాగడం కంటే వాటర్ తాగడం వల్లే ఎక్కువ యోజనాలుంటున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఒక నిముషం ఆగండి..!వాటర్ తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నాము. షుగర్ ఫ్రూట్ జ్యూస్ లకు గుడ్ బై చెప్పడానికి ముందు ముఖ్యంగా ఈ డైట్ లో విటమిన్స్, మినిరల్స్, ప్రోటీన్స, మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే సలాడ్స్, మరియు ఫుడ్స్ .
ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల పొందే 15 గొప్పు ఆరోగ్య ప్రయోజనాలు
ఫ్రూట్ జ్యూసుల ద్వారా మన శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అందిస్తుంటే, అప్పుడు వాటర్ కు బదులు జ్యూస్ లను స్కిప్ చేయవచ్చు . కానీ వాటర్ కంటెంట్ శరీరానికి తగిన హైడ్రేషన్ అందివ్వడంతో పాటు టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఇక షుగర్ ఫ్రూట్స్ తినడం కంటే అప్పుడప్పుడు పచ్చి పండ్లను తీసుకోవడం మంచిది. మరి ఇక వాటర్ వర్సెస్ ఫ్రూట్ జ్యూస్ లలో ఏది బెటరో తెలుసుకుందాం...

క్యాలరీలు:
నీళ్లలో క్యాలరీలు తక్కువ, బరువు పెరుగుతారనే భయం అవసరం లేదు. చాలా వరకూ ఫ్రూట్ జ్యూసులు ఎక్కువ క్యాలరీలను అందిస్తుంది. కానీ, ఫ్రూట్ జ్యూసులు కూడా షుగర్ జోడించకుండా ...ఫైబర్ కంటెంట్ ను ఫిల్టర్ చేయకుండా తీసుకోవడం మరింత ఆరోగ్యకరం.

నో షుగర్:
నీటిలో షుగర్స్ ఉండవు. కానీ ఫ్రూట్ జ్యూసులలో షుగర్స్ ఉండటం లేదా షుగర్స్ జోడించడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచడానికి కారణం అవుతుంది . ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి , మీరు ఫ్రూట్స్ లేదా జ్యూస్ లు తీసుకోవాలనుకొన్నప్పుడు, షుగర్ జోడించకుండా తీసుకోవాలి.

తేమను అందిస్తాయి:
శరీరానికి కావల్సిన తేమను ఫ్రూట్ జ్యూసుల కంటే నీరు ఎక్కువ హైడ్రేషన్ ను అందిస్తుంది. ఫ్రూట్ జ్యూసు అందించినా కూడా...వీటి కంటే నీరు ముందు వరసలో ఉంటుంది.

టాక్సిన్స్:
ఫ్రూట్ జ్యూసులు ఇదివరకూ శరీరంలో చేరిన టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతాయి, నీళ్ళు మొత్తం బాడీ సిస్టమ్ ను శుభ్రపరిచి టాక్సిన్స్ ను శరీరం నుండి నెట్టివేయడానికి సహాయపడుతుంది.

ప్రధాన ఎంపిక :
ఫ్రూట్ జ్యూసుల కంటే వాటర్ ఎక్కువగా సూచిస్తున్న హెల్తీ డ్రింక్ . కానీ ఫ్రూట్ జ్యూసులు స్కిప్ చేయాలనుకున్నప్పుడు, వాటర్ తో పాటు మీ శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను ఆహార రూపంలో అందివ్వడం మర్చిపోకూడదు .

తయారుచేసే శ్రమ ఉండదు :
ఫ్రూట్ జ్యూసులు తయారుచేయడానికి శ్రమ మరియు సమయం కేటాయించాలి . కానీ నీరు చాలా సింపుల్ గా ప్లెయిన్ వాటర్ ను ఒక గ్లాసుతో తాగేయవచ్చు.

వాటర్ క్లీన్ చేస్తుంది :
స్వచ్చ మైన నీరు బాడీ సిస్టమ్ ను శుభ్రపరుస్తుంది . మిమ్మల్ని ఫ్రెష్ గా మరియు స్టెబుల్ గా చేస్తుంది. అలాగే ఫ్రూట్ జ్యూసులు కూడా అదేపనిచేసినా, వీటి కంటే వాటర్ మరింత బెటర్ గా పనిచేస్తాయి.



Click it and Unblock the Notifications
