Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
మిరియాలతో పొందే పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్..
ఘాటైన సువాసన, ఘాటైన రుచి కలిగిన మిరియాలు.. మనుషుల ఆరోగ్యానికి చాలా అవసరం. ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా అవసరం. అంతేకాదు మిరియాలు.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
మిరియాలలో ఉండే పెపర్ లైన్ వల్ల మిరియాలు ఆ రుచిని కలిగి ఉంటాయి. పెపర్ లైన్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, ఇరిటేషన్ వంటి రకరకాల వ్యాధులతో పోరాడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇందులో ఉండే ఎమినో యాసిడ్స్.. ఇంటెస్టైన్ లోకి ప్రవేశించి.. దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మిరియాలు టేస్ట్ బడ్స్ ని పెంచి.. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పొట్టలో పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ పెరగడం వల్ల.. కోలిక్, బ్లోటింగ్, హార్ట్ బర్న్, ఫ్లాట్లెన్స్, కాన్ట్సిపేషన్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. అలాగే మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. ఇంటెస్టైన్ డిసీజ్ లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఆహారంలో మిరియాలు ఉపయోగించడం వల్ల రుచికరంగానే కాదు.. త్వరగా, తేలికగా జీర్ణమవుతుంది. అలాగే ఆకలిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఎవరైతే.. ఎక్కువగా ఆకలికి లోనై.. అన్ హెల్తీ ఫుడ్ తింటారో వాళ్లకు మిరియాలు చక్కటి పరిష్కారం. ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం తినమని ఆయుర్వేదం సూచిస్తుంది. ఈ మిశ్రమం రెగ్యులర్ గా తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని చెబతోంది ఆయుర్వేదం.

ఆకలిని తగ్గించడమే కాదు.. బరువు తగ్గడానికి కూడా మిరియాలు సహాయపడతాయి. 2010 వ సంవత్సరంలో జరిగిన అధ్యయనం.. పైపరైన్ మెటబాలిక్ ప్రాసెస్ పై ప్రభావం చూపి.. శరీరంలో ఫ్యాట్ పేరుకోకుండా అరికడుతుందని సూచిస్తుంది. మెటబాలిక్ ప్రక్రియ మెరుగు పడటం వల్ల.. ఫ్యాట్ ఫ్రీ ఫుడ్.. క్యాలరీలను కరిగించడంలో సహాయపడతాయి.

మిరియాలు.. గ్యాస్ ఏర్పడకుండా కూడా నివారిస్తాయి. మీరు ఎక్కువ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటే.. ఎండు కారం పొడికి బదులుగా..మిరియాల పొడిని ఆహారాల్లో ఉపయోగించడం మంచిది. పొట్టలో ఎసిడ్ రిఫ్లక్స్ నివారించడానికి ఒక గ్లాసు బట్టర్ మిల్క్ లో కొద్దిగా మిరియాలు, జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరీ ఎక్కువగా మిరియాలను తీసుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి లిమిటెడ్ గా తీసుకోవాలి. ఇవి శరీరంలో ఎక్కువైతే.. పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగి, చర్మ సమస్యలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు.. మిరియాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
