Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
జుట్టు వత్తుగా బాగా పెరగడానికి మనం రకరకాలు నూనెలు, ష్యాంపూలు, డైలు వాడతాము. కొన్ని సందర్భాల్లో కెమికల్స్‌ను ఉపయోగిస్తాము. అవి మన జుట్టుకు హానికరమని తెలిసినా అలాగే చేస్తుంటాం. దీని వల్ల జుట్టు పలచబడిపోవడమో, ఊడిపోవడమో జరుగుతుంది. వత్తైన జుట్టుకోసం ప్రయోగాలు చేస్తే ఉన్నది కాస్తా ఊడింది అన్నట్లు జుట్టు ఊడిపోతుంది. తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటే జట్టు వత్తుగా వస్తుంది. మార్కెట్లు దొరకినదల్లా తలకు పెట్టుకోకుండా యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఆ ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయ్. మార్కెట్లో వీటి ప్యాకింగ్ కూడా సురక్షితంగా ఉంటుంది. ఇందులో వైటమిన్ సితో పాటు జుట్టు నిగనిగ మెరవడానికి కారణమయ్యే సిలికా అనే పోషకం ఉంటుంది.
గుడ్లు
గుడ్లలో బయోటిన్, ప్రొటీన్, కోలిన్, ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ బి12, లుటెయిన్, జిాయక్సన్‌తిన్, యాంటియాక్సిడెంట్లు ఉంటాయ్. ఈ పోషకాలే జుట్టును బలంగా చేస్తుంది. రోజుకు కనీసం ఓ గుడ్డు తినేట్లుగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి.
క్యారెట్లు
క్యారెట్లలో వైటమిన్ ఏ మాత్రమే కాకుండా జుట్టు ఊడిపోకుండా సిబమ్ ను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు వైద్యులు చెబుతున్నారు.

డ్రైఫ్రూట్స్
పల్లీలు, కాజూ, బాదాం, అవిస గింజెలు కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే వైటమిన్ ఏ జుట్టుకు మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయ్.
ఆకుకూరలు
ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయ్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఫొలేట్, ఐరన్, వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఉండడం వల్ల జుట్టు ధృడంగా మారుతుంది.
డార్క్ చాక్లెట్లు
డార్క్ చాక్లెట్లలో 70 శాతం కాకావో జుట్టు ఎదుగుదలకు బాగా దోహదపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీటితోపాటు పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం కూడా ఉండడం వల్ల జుట్టు వత్తుగా బలంగా మారుతుంది.
బ్లూబెర్రీలు
బ్లూబెర్రీస్‌లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును చుండ్రు వల్ల వచ్చే నష్టాన్ని నివారిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
చిలగడదుంపలు
చిలగడదుంపల్లో ఉండే వైటమిన్ కె, బీటా కెరోటిన్ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు ఇతర ఇన్‌ఫెక్షన్లు రాకుండా కూడా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
