Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ సమస్యలు ఉన్న వారు జామ పండును తినొద్దు.. మీరూ తింటున్నారా? ఐతే ఇక అంతే!
ఈ సీజన్లో ఎక్కువగా జామపండును దొరుకుతూ ఉంటుంది. పేదోడి యాపిల్ అని పిలవబడే ఈ పండును చిన్న పిల్లల నుంచి ముసలి వ్యక్తుల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ జామ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో విటమిన్ సీ, విటమిన్-A పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు కంటి చూపు మెరుగ్గా కనిపించేందుకు ఎంతగానో సహాయపడతాయి.
ఈ జామపండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా మనం తిన్న ఆహరం తొందరగానే జీర్ణం అవుతుంది. దీంతో పాటు జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు కూడా అది చాలా సహాయపడుతుంది. ఈ పండును తినడం వల్ల.. మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈ జామ పండును తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి వారు ఈ పండును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

అలర్జీ సమస్యలు ఉన్న వారు..
మార్కెట్‌లో దొరికే జామపండుపై కొన్ని రసాయనాలను కోటింగ్ చేస్తారు. దాని కారణంగా అలర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అలర్జీ సమస్యలు ఉన్న వారు జామ పండును ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులతో బాధపడే వ్యక్తులు అస్సలు జామపండును తినొద్దట. తింటే చర్మంపై దుద్దుర్లు, చర్మం మంట మందడం, చర్మ వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అలర్జీ సమస్యలు ఉన్న వారు ఈ జామపండును తినకూడదట.
గ్యాస్ సమస్యలు ఉన్న వ్యక్తులు..
గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ జామపండును తినకూడదని చెబుతున్నారు. ఒక మోతాదులో తింటే పర్వాలేదు కానీ, మోతాదుకు మించి తింటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. అలా తినడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఈ జామపండు జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే జీర్ణ క్రియ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ జామ పండును తినకపోతేనే మంచిదని సూచిస్తున్నారు.

మధుమేహం వ్యాధి గ్రస్తులు..
డయాబెటిక్, ప్రీ-డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ జామపండును తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే ఈ జామ పండులో 9 గ్రాముల నేచురల్ షుగర్ ఉంటుంది. ఇది తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా షుగర్ వ్యాధి గ్రస్తులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ జామపండును తింటే డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు తప్పనిసరిగా షుగర్ లెవెల్స్‌ని మానిటర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులు..
ఈ శీతాకాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు దగ్గు. ఈ జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులు జామ పండును రాత్రి పూట తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో జామపండును రాత్రి పూట తినడం వల్ల జలుబు, దగ్గు ఉన్న వ్యక్తులకు ఆ సమస్య మరింత ఎక్కువగా మారే అవకాశం ఉంటుందట. దీంతో జలుబు దగ్గుతో బాధపడే వారు ఈ జామపండును తినకపోతేనే మంచిది.
గర్భిణీలు కూడా..
గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు సైతం ఈ జామపండును తినకూడదట. ఎందుకంటే జామ పండు తింటే చర్మంపై మంట, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తులు జామ పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినేముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications