Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే..ఇది దంతాలకు సంజీవని!
పాత రోజుల్లో దంత సంరక్షణ కోసం చాలామంది వేప పుల్ల, తుమ్మ పుల్ల వాడేటోళ్లు. నేటికీ మనదేశంలోని పల్లెటూర్లలో చాలామంది పళ్లు తోముకోడానికి వేప పుల్లలనే ఉపయోగిస్తుంటారు. కానీ పసుపు పచ్చగా మారిన మీ పళ్లను తెల్లగా మెరిపించి, పయోరియా, పంటినొప్పి వంటి తీవ్రమైన సమస్యలను కూడా దూరం చేసే ఒక అద్భుతమైన మొక్క గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
అలాంటి ఒక సంజీవని లాంటి మొక్కే ఉత్తరేణి. మన దంత ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన సంజీవని ఉత్తరేణి మొక్క. ఇది మన పెరట్లో, పొలాల గట్లపై, అడవులలో చాలా విరివిగా కనిపిస్తుంది. అయితే దీని అద్భుత ఔషధ గుణాల గురించి తెలియక చాలామంది దీనిని ఒక పనికిరాని కలుపు మొక్కగా భావించి పీకిపారేస్తుంటారు.

కానీ ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దంత సంబంధిత వ్యాధుల నివారణలో ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు రకాలు - అపారమైన ప్రయోజనాలు
నిపుణుల ప్రకారం ఉత్తరేణిలో ప్రధానంగా రెండు జాతులు ఉంటాయి - తెల్ల ఉత్తరేణి, ఎరుపు ఉత్తరేణి. ఈ రెండూ కూడా వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. వీటి వేర్లతో చేసిన పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు పళ్లకు వీడ్కోలు: ఈ మొక్క వేరుతో చేసిన పుల్లతో కేవలం 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పళ్ళు తోముకుంటే చాలు ఎంతటి గార పట్టిన పసుపు పళ్లయినా ముత్యాల్లా తెల్లగా మెరవడం ఖాయం.
పయోరియా, చిగుళ్ల నొప్పికి చెక్: పయోరియా, చిగుళ్ల వాపు, నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం. దీని పుల్లతో రోజూ బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు గట్టిపడి, పయోరియా సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
తక్షణ పంటినొప్పి నివారణ: తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు 2-3 ఉత్తరేణి ఆకులను నలిపి రసం తీయాలి. ఆ రసంలో దూదిని ముంచి నొప్పి ఉన్న పంటిపై లేదా పుచ్చిపోయిన పంటిపై ఉంచితే నొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
సంపూర్ణ నోటి ఆరోగ్యం: ఉత్తరేణి పుల్లతో రోజూ పళ్లు తోముకోవడం వల్ల దంతాలు శుభ్రపడటమే కాకుండా కదిలే పళ్లను గట్టిపరచడం, బలహీనమైన చిగుళ్లకు బలాన్నివ్వడం, నోటి దుర్వాసనను తరిమికొట్టడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి నోటి పూతలు, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications