Latest Updates
-
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.!
బంధువులు, ఫ్రెండ్స్ కానీ తెలిసిన వారెవరైనా సరే అనారోగ్యంతో ఉన్నారని తెలిసినా, ఆపరేషన్ చేయించుకుని బెడ్ రెస్ట్‌లో ఉన్నారంటే వారిని పరామర్శించడానికి ఖచ్చితంగా వెళ్తాం. ఉట్టి చేతులతో వెళ్లకుండా బ్రెడ్ ఇంకా పండ్లు తీసుకెళ్తాం. అయితే పండ్లు అనేవి సాధారణ రోజుల్లో కూడా తీసుకెళ్తాం. కానీ పరామర్శకి మాత్రం తప్పనిసరిగా బ్రెడ్ తీసుకెళ్లడం పక్కా. కానీ బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారు. అన్నం, కూరలు ఎందుకు తీసుకెళ్లరు. దీని వెనుక కారణాలు ఏంటి తెలుసుకుందాం..

జ్వరం వచ్చినా, ఆపరేషన్ అయినా ఆకలి అనేది తగ్గిపోతుంది. ఏమీ తినాలనిపించదు. దేనిపైనా సహించదు. అలా అని కడుపు మాడ్చుకుని ఉండలేరు. ఈ క్రమంలో పొట్టలో ఇంత పడేయడానికి ఇంట్లో వండే అన్నం, కూరలు వడ్డిస్తే వాటిలోని మసాలాలు, నూనె కారణంగా జీర్ణం కావడానికి ఇబ్బంది పడతారు. ఈ సమయంలో వారికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. అందుకే ఇలాంటి వారికి పాలు, బ్రెడ్ తరచుగా ఇస్తారు. ఇది జీర్ణవ్యవస్థపై భారం పడకుండా త్వరగా అరిగిపోతుంది. నమలడానికి ఎక్కువ టైం పట్టదు. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే వారు బ్రెడ్ తీసుకుంటారు.
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
ఫీవర్‌తో ఉన్నప్పుడు శరీరంలో శక్తి తగ్గిపోతుంది. డీహైడ్రేడెట్ అవుతుంది. ఫలితంగా నాలుక రుచి తగ్గిపోతుంది. ఆకలి ఎక్కువగా అనిపించదు. దీంతో కడుపు నిండా భోజనం చేయాలనిపించదు. హెవీ మీల్స్ తినడానికి ఇష్టపడరు. అందుకే ఈ సమయంలో వారికి కొద్దికొద్దిగా భోజనం ఇస్తారు. బ్రెడ్‌లోని కార్బొహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తారు. పాలు, టీ లేదా తేనెతో తీసుకుంటారు. వీటితో పాటు పండ్లు కూడా ఇవ్వడం ద్వారా ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్, నీరు పుష్కలంగా అందుతాయి.
ఆపరేషన్ అయిన వెంటనే ఇవ్వలేం..
ఆపరేషన్ అయిన వెంటనే రోగుల్లో జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. సాధారణ స్థితికి రావడానికి టైం తీసుకుంటుంది. అందుకే సర్జరీ తర్వాత రోగులకు ముందుగా టీ లేదా కాఫీ ఇస్తారు. తర్వాత వారు సులభంగా మూత్ర విసర్జన చేయగలిగినట్లయితే వైద్యుల సలహా మేరకు తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ఇందులో బ్రెడ్ తీసుకోమని డాక్టర్లు ఎక్కువగా సలహా ఇస్తారు.

ఎక్కువ రోజులు నిల్వ
బ్రెడ్ ప్యాకెట్ల రూపంలో లభించడం వల్ల దీనిని నిల్వ చేయడం ఈజీగా ఉంటుంది. నిర్దిష్ట తేదీ వరకు పాడైపోకుండా ఉంటుంది. కనీసం మూడు నుంచి ఐదు రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. అందుకే వండుకునే అవసరం లేకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా తినవచ్చు. వైద్యులు ఇంట్లో వండిన ఆహారం తినవచ్చని సూచించే వరకు వారి సలహా మేరకు బ్రెడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే రోగులను పరామర్శించేటప్పుడు వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆత్మీయులు బ్రెడ్ ప్యాకెట్లను తీసుకెళ్తారు.

అయితే ఇది ఒక సామాజిక అలవాటు మాత్రమే. బ్రెడ్ కేవలం కార్బొహైడ్రేట్లను మాత్రమే అందిస్తుంది. ఇందులో ఎలాంటి మినరల్స్, విటమిన్స్ ఉండవు. జ్వరం నుంచి కోలుకోవడానికి, కండరాల పునరుద్ధరణకు ప్రొటీన్ చాలా అవసరం. డాక్టర్ల సలహా మేరకు గుడ్లు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, మాంసం, పుష్కలంగా నీరు, హెల్తీ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు ఇవ్వడం ద్వారా సులభంగా అరగడంతో పాటు త్వరగా కోలుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
