Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తిన్న వెంటనే టాయిలెట్‌కు పరిగెడుతున్నారా?.. అయితే ఇలా చేయండి!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీర్ణక్రియ తప్పనిసరి. జీర్ణక్రియ సరిగ్గా జరిగితేనే శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. మనిషి కూడా రోజంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా పని చేస్తారు. అయితే చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. వాటిలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నాయి.
వీటితో పాటు కొంతమంది తిన్న వెంటనే టాయిలెట్‌లకు పరిగెడుతూ ఉంటారు. తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో ఉండే వేస్ట్‌ని బయటికి పంపించేయాలని అనిపించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది ఒక వ్యాధి అని పేర్కొంటున్నారు. ఆ సమస్యను చిన్న చిన్న టిప్స్‌తో ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సోంపుపొడి:
చాలా మంది తిన్న ఆహరం జీర్ణం అవడానికి సోంపు పొడి తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక సుగంధ ద్రవ్యం. ఇందులో ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని తక్షణమే అందిస్తుంది. ఎవరైతే తిన్న వెంటనే టాయిలెట్‌కు పరిగెడతారో వారు సోంపుపొడి తినడం వల్ల ఆ సమస్యను చెక్ పెట్టొచ్చు.
ఎండిన అల్లం, తెల్ల జీలకర్ర
అల్లంతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో ఒకటి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఎండిన అల్లం లేదా పొడి అల్లంతో కలిపి తెల్ల జీలకర్ర తీసుకుంటే శరీరానికి కావాల్సిన వేడి ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి, తిన్న ఆహారాన్ని తక్షణమే జీర్ణం చేస్తుంది. అలాగే తిన్న వెంటనే టాయిలెట్‌కు పరిగెత్తే సమస్యను దూరం చేస్తుంది. 25 గ్రాముల ఎండిన అల్లం, 25 గ్రాముల తెల్ల జీలకర్రను పొడి చేసి, తాగితే ఫలితాలు పొందొచ్చు.
బేల్ పొడి:
ఉత్తమమైన జీర్ణక్రియకు బేల్ పొడి చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉంటాయి. ఇది పొట్టకు తక్షణ చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు, తిన్న వెంటనే టాయిలెట్‌కు పరిగెత్తే సమస్యను దూరం చేస్తుంది. దీంతో పాటు వుడ్ ఆపిల్ పొడి కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.
కొత్తిమీర:
ప్రతి కూరలో పైన టాపింగ్ కోసం వేసుకునే కొత్తిమీరలో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి. కొత్తిమీర తినడం వల్ల పొట్టలో చల్లని వాతావరణం క్రియేట్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడంతో పాటు జీర్ణ సమస్యను దూరం చేస్తుంది.
మైరోబాలన్ పొడి:
కడుపులో పేరుకుపోయే మురికిని ఈ మైరోబాలన్ పొడి శుభ్రం చేస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మరీ ముఖ్యం పేగులు నిండాక పేగుల కదలికలను నియంత్రిస్తుంది.
తిన్నవెంటనే టాయిలెట్‌కు పరిగెడుతున్నారంటే అది ఒక వ్యాధి అని అర్ధం చేసుకోవాలి. పేగు కదలికల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీనిని అరికట్టేందుకు, సోంపు, ఎండిన అల్లం, తెల్ల జీలకర్ర, కొత్తిమీర, మైరోబాలన్ పొడి, బేల్ పొడిని అన్నిటినీ కలుపుకొని తాగితే మంచి ఫలితాలు పొందొచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ పొడిని తాగితే ప్రేగు కదలికలు నియంత్రణలోకి వస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ కేవలం ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. దయచేసి వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications