Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
తీపి పెరుగు vs ఉప్పు పెరుగు..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
మనలో చాలామందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. భోజనంలో పెరుగు లేకుంటే చాలమందికి ఏదో కోల్పోనట్లు ఫీల్ ఉంటుంది. మన భారతీయ భోజనంలో పెరుగుకు ఉన్న స్థానం ప్రత్యేకం. అయితే సాధారణంగా పెరుగును ఉప్పుతో లేదా చక్కెరతో కలిపి తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలో ఎలా తినడనం ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడైనా ఆలోచించారా? తీపి పెరుగా లేక ఉప్పు పెరుగా ఏది తినాలని నిపుణులు సూచిస్తున్నారో ఇక్కడ చూడండి.
చక్కెర కలిపిన పెరుగు
కొంతమందికి పెరుగులో చక్కెర కలపుకొని తినే అలవాటు ఉంటుంది. ఇలా తింటే ఆ మజానే వేరు. కానీ ఈ తియ్యటి అలవాటు మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పంచదారలో ఉండే అధిక క్యాలరీలు సులభంగా బరువు పెరిగేలా చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ప్రమాదకరం. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. చక్కెర దంతాల పాలిట శత్రువు. ఇది పళ్లు పుచ్చిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర తిన్న వెంటనే శక్తి వచ్చినట్లు అనిపించినా, అది తాత్కాలికమే. కొద్దిసేపటికే శక్తి స్థాయిలు పడిపోయి నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది.

ఉప్పు పెరుగు
రుచిలో కొంచెం వెనకబడినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఉప్పు కలిపిన పెరుగుదే పైచేయి. ముఖ్యంగా చిటికెడు ఉప్పు, జీలకర్ర పొడి, తరిగిన కూరగాయలు జోడిస్తే ఇది ఒక సూపర్ ఫుడ్‌గా మారుతుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనికి ఉప్పు, జీలకర్ర పొడి వంటివి జోడిస్తే జీర్ణక్రియ మరింత మెరుగుపడుతుంది.
ముఖ్యంగా వేసవిలో చెమట ద్వారా శరీరం లవణాలను కోల్పోతుంది. ఉప్పు కలిపిన పెరుగు శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. పెరుగులో దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయ, బీట్‌రూట్ వంటివి కలిపితే అది విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండిన ఒక సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది.
తీపి పెరుగుతో పోలిస్తే ఇందులో క్యాలరీలు తక్కువ. ఇది కడుపు నిండిన భావనను ఎక్కువసేపు అందించి, బరువును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. పెరుగులో నీటిశాతం అధికంగా ఉండటం వల్ల, ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి రుచి కోసం అప్పుడప్పుడు తీపి పెరుగు తిన్నా ఫర్వాలేదు కానీ రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ఉప్పు కలిపిన పెరుగే ఉత్తమమైన, ఆరోగ్యకరమైన ఎంపిక అని ముఖ్యంగా కూరగాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర పొడి జోడించి తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications