Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సాయిచంద్ కూడా ఆయనలాగే చనిపోయాడా.. అసలు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
ప్రముఖ సింగర్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ హఠాత్తుగా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి అందిరికీ తెలిసిందే. అతి చిన్న వయసులోనే ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోవడం బీఆర్ఎస్ శ్రేణులందరితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా తీవ్ర విస్మయానికి గురి చేసింది. 39 ఏళ్ల వసయులోనే సాయి చంద్ గుండెపోటుతో చనిపోవడంపై పలువురు వైద్యులు స్పందిస్తున్నారు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా అలాగే చనిపోయారు. అయితే వీరిద్దరి మరణం ఒకేలా ఉందని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మడివాడ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ కు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓ మెడికల్ సెంటర్ లో నిర్ధారించాక.. మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆయన చనిపోయాడని.. అదే రీతిలో సాయిచంద్ కూడా చనిపోయాడని గుర్తించారు. గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిని తప్పించడానికి ఏం చేయొచ్చనే విషయాలను కూడా ఆయన తెలిపారు.
సీపీఆర్‌పై అందరికీ శిక్షణ ఇవ్వాలి:
ప్రతీ ఒక్కరికీ సీపీఆర్ ఎలా చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వాలని.. ఆటోమెటెడ్ ఎక్స్ టర్నర్ డిఫిబ్రిలేటర్స్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని పౌర సంఘాల దగ్గర ఉంచాలని సూచించారు. హార్ట్ అటాక్ బారిన పడిన రోగులను ఆస్పత్రికి తరలించే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని అంబులెన్సులో మాత్రమే ఆస్పత్రికి తరలించాలని... ప్రైవేటు వాహనాల్లో సీపీఆర్ చేయడం కష్టమని వివరించారు.
అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్సీషియన్:
సీపీఆర్ చేయడం, డిఫిబ్రిలేటర్ వాడకం, ఇన్ ట్యూబేషన్ విషయంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలి. ప్రతీ అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్సీషియన్ ఉంచేలా చట్టాలను తీసుకురావాలి. వీరికి 15 రోజుల్లోగా శిక్షణ ఇవ్వచ్చు. పశ్చిమ దేశాల తరహాలో ప్రజలు పెద్ద సంఖ్యలు గుమిగూడే ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్ టర్నర్ డిఫిబ్రిలేటర్స్, శిక్షణ పొందిన వ్యక్తులను ఉంచే జీవీ తీసుకురావాలని ముఖర్జీ మడివాడ మంత్రి కేటీఆర్ కు సూచించారు.
కరోనానే కారణమని చెప్పలేం:
గుండె సంబంధిత రోగులను శిక్షణ పొందిన ఈఎంటీలు, రీససిటేషన్ పరికరాలు ఉన్న అంబులెన్సుల్లో తరలించేలా మరో జీవో తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. కరోనా తర్వాత వచ్చిన జీవన శైలి మార్పుల వల్లే గుండెపోట్లు పెరిగాయని చెబుతున్నారు. గుండె పోటుకు కరోనా, వ్యాక్సిన్లు కారణమని భావించలేమని తెలిపారు. గుండె జబ్బులు చాలా కారణాలు ఉంటాయన్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications