Latest Updates
-
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.! -
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి! -
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్‌లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇక ఆ సమస్యే ఉండదు.! -
మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.? -
కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే.. -
కిడ్నీల పనితీరు బాగాలేదని తెలిపే ఐదు హెచ్చరిక సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
కొందరికి ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! -
వర్షాకాలంలో వీటిని మాత్రమే తింటే సరిపోదు.. బీపీ, డయాబెటిస్ రోగులకు మేలు చేసే సూపర్ ఫుడ్స్.! -
కండరాల పుష్టికి, బరువు తగ్గడానికి బెస్ట్..హై ప్రోటీన్ సోయా పోహా చేసుకోండిలా.. -
జులై 29న ‘గురు పౌర్ణమి’.. మీ గురువులను పూజించడమే కాదు.. వీటిని దానం చేస్తే ఎనలేని పుణ్యం.!
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి
శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో థైరాయిడ్ పాత్ర చాలా కీలకం. అయితే ఈ ప్రాసెస్ విఫలమైతే థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎక్కువగా థైరాయిడ్‌తో బాధపడుతుంటారు. ఈ కారణంగా పీరియడ్స్ కూడా ఆలస్యమవుతుంటాయి. హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం ప్రభావం కారణంగా అకారణంగా బరువు పెరగడం, నీరసంగా ఉండటం, మలబద్ధకం, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, చలిని సైతం తట్టుకోలేకపోవడం, నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొంది థైరాయిడ్ నుంచి త్వరగా కోలుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోకూడదు.
వైట్ బ్రెడ్
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు వైట్ బ్రెడ్‌ను తీసుకోవడం తగ్గించాలి. వైట్ బ్రెడ్ త్వరగా అరిగిపోతుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో పెరిగి రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. అదే విధంగా థైరాయిడ్ గ్రంథి దగ్గర వాపునకు దారి తీస్తుంది. ఫలితంగా థైరాయిడ్ హారోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది.
ఆలూ చిప్స్
ఆలూ చిప్స్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని అవాయిడ్ చేయాలి. ఇందులోని హానికరమైన కొవ్వులు, అధిక ఉప్పు కారణంగా థైరాయిడ్ గ్రంథి పనితీరును నియంత్రిస్తుంది.
వేరుశనగ
వేరుశనగలో గాయిట్రోజెన్స్ అధికంగా ఉంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన అయోడిన్‌ను బ్లాక్ చేస్తుంది. ఇంకా వాపునకు దారి తీస్తుంది. ఇది థైరాయిడ్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తమ భోజనంలో క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్‌ను అవాయిడ్ చేయాలి. ఇందులో గ్లూకోసైనోలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా శరీరం అయోడిన్‌ను స్వీకరించడంలో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో టీఎస్‌హెచ్ లెవెల్స్ పడిపోతాయి.
కాఫీ
థైరాయిడ్ సమస్యకు మందులు వాడుతున్నవారు కాఫీ తీసుకోవడం మానేయాలి. లేదంటే ఆ మందుల ఫలితంపై ప్రభావం చూపిస్తుంది. దీంతో కార్టిసాల్ స్థాయిలు పెరిగి ఒత్తిడి, నిద్ర లేమికి దారితీస్తుంది.
టోఫు
థైరాయిడ్ సమస్య అధికంగా ఉన్నవారు టోఫును ఆహారంలో తీసుకోవడం మానేయాలి. ఇందులోని ఐసోఫ్లేవోన్స్ కారణంగా టీఎస్‌హెచ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యే అయోడిన్‌ను బ్లాక్ చేస్తుంది. దీంతో థైరాయిడ్ స్థాయిలు పెరుగుతాయి.
ఈ సమస్య ఉన్నవారు గైనకాలజిస్టును సంప్రదించి సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వారి పర్యవేక్షణలో హార్మోన్ల స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తరచూ తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications