Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ రోగంలో హైదరాబాదీలు టాప్.. మరణానికి అతి దగ్గరలో..!
ఈ మధ్య కాలంలో చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం, మారుతున్న జీవన విధానం, తింటున్న ఆహార పదార్థాల కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దానికి అద్దం పట్టేలా కేంద్రం ఈరోజు విడుదల చేసిన జాబితా కూడా ఉంది. ఈ జాబితాలో దేశంలో షుగర్ పేషెంట్లు అధికమయ్యారని కేంద్రం పేర్కొంది. షుగర్ పేషెంట్లలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో వెల్లడించింది కూడా. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నంబర్ వన్ స్థానంలో తమిళనాడు
దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రంలో 80.90 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. అటు రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 39.81 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నాయని తెలిపింది. మూడో స్థానంలో కర్ణాటక ఉండగా.. ఆ రాష్టంలో 28.74 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నట్లు పేర్కొంది.

తెలంగాణ ఎన్నో స్థానమంటే
అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. తెలంగాణాలో 24.52 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. ఇది కొంత కలవర పెట్టె అంశంమని చెప్పుకోవచ్చు. ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉండగా.. అత్యల్పంగా ఢిల్లీలో కేవలం 1,108 మంది మాత్రమే ఉన్నారు. అటు దేశ వ్యాప్తంగా 3.13 కోట్ల మంది షుగర్ బాధితులున్నారని కేంద్రం పేర్కొంది.
షుగర్ ఎందుకొస్తుందంటే?
మన శరీరంలో క్లోమ గ్రంథి అని ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించే షుగర్‌ను శరీరంలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోయినా, ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్ శక్తిగా మారడం ఆగిపోతుంది. దీంతో షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. దానినే డయాబెటిక్ లేదా మధుమేహం అని అంటుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications