Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
తినేటప్పుడు జస్ట్ అలా చేస్తే చాలు..షుగర్ పేషెంట్లు ట్యాబ్లెట్లు,ఇంజెక్షన్స్ తో పనే ఉండదు..
షుగర్ పేషెంట్లు తీసుకునే ఆహారం మీదనే వారి షుగర్ లెవల్స్ ఆధారపడి ఉంటాయి. సాధారణంగా దక్షిణ భారతదేశంలో అయితే మన ప్లేట్ లో 80శాతం వరకు రైస్ ఉంటుంది, నార్త్ ఇండియాలో అయితే 80శాతం చపాతీ లేదా రోటీతో ఫుడ్ ఫ్లేట్ నిండి ఉంటుంది. కేవలం 20 శాతం మాత్రమే ప్రొటీన్, కూరగాయలు తీసుకుంటారు. దీనివల్ల షుగర్ పేషంట్లలో ప్రొటీన్ కొరత వచ్చేస్తుంది. షుగర్ పేషెంట్లలో విటమిన్, మినరల్స్ కొరత వల్ల వారికి అరికాళ్లలో మంటలు, కంటిచూపు కూడా తగ్గిపోయే అవకశాం ఉంటుంది. కాబట్టి భోజనం ప్లేట్ లో 50శాతం కూరగాయలు ఉండేలా చూసుకోవాలని హైదరాబాద్ లోని ఇమెన్స్ డయాబెటీస్, థైరాయిడ్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ దీప్తి తెలిపారు.
ఫుడ్ ఫ్లేట్ లో ఇలా ఉంటే చాలు
-షుగర్ పెషెంట్లు వారి ప్రతి మీల్ లో అంటే పొద్దున్న బ్రేక్ పాస్ట్ లోకి దోసకాయ సలాడ్ లేదా టమాటో పీస్ లను యాడ్ చేసుకోవచ్చు.
-మధ్యాహ్నా భోజనంలో ఫ్లేట్ మొత్తం రైస్ తో నింపకుండా ఒక బౌల్ లో రైస్, ఇంకో బౌల్ లో ఆకుకూర పప్పు, మరో బౌల్ లో వెజిటేబుల్ కర్రీ ఏదైనా(డీప్ ఫ్రై చేసినది కాదు,తక్కువ ఆయిల్ వేసి చేసిన పులసు కర్రీ లాంటిది)తీసుకోవాలి.

క్యారెట్,బీట్ రూట్, బంగాళదుంపలో ఏది తినాలి
దుంపజాతి కూరగాయల విషయానికొస్తే..ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది బంగాళదుంపనే. బంగాళదుంప హై గ్లైసెమిక్ ఇండెక్స్(GI) ఫుడ్. ఇది సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ అయినా కూడా తర్వగా జీర్ణమైపోయి షుగర్ లెవల్స్ ని పెంచేస్తుంది. బంగాళదుంపుకి 70కి పైనే గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉంటుంది. మనం ఆల్రెడీ రైస్ తీసుకుంటాం కాబట్టి దాంతోపాటే బంగాళదుంప కూడా తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి కాబట్టి బంగాళదుంప తినకపోతేనే మేలు.
దుంపజాతికి చెందిన మరో కూరగాయ బీట్ రూట్..మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్ ని పెంచదు కానీ పరిమిత పరిమాణంలో దీన్ని తీసుకుంటే ఇందులోని విటమిన్స్, మినరల్స్ వల్ల బీపీ తగ్గే అవకాశం ఉంటుంది, కొన్ని రకాల క్యాన్సర్లను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా బీట్ రూట్ లో లభిస్తుంది.
క్యారెట్ విషయానికొస్తే..ఇందులో బీటా కెరోటిన్ అనే విటమిన్ A కూడా ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ పెషెంట్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే క్యారెట్ ను ఫ్రై చేసి తినకుండా పచ్చి క్యారెట్ ను శుభ్రంగా కడిగి తినడం వల్ల ఇందులోని పోషకాల వల్ల డయాబెటిస్ పేషెంట్ల హెల్త్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇలా చేస్తే ట్యాబ్లెట్లు,ఇంజెక్షన్లు అక్కర్లేదు
డయాబెటిస్ పేషెంట్లు ప్రతి మీల్..బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో కూడా వెజిటేబుల్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫుడ్ గ్లైసెమిక్స్ ఇండెక్స్ తగ్గిపోయి షుగర్ లెవల్స్ త్వరగా పెరగకుండా ఉంటాయి. ఆకుకూరల్లో ఉంటే ఫైబర్, కాల్షియం, మినరల్స్ వల్ల డయాబెటిక్ పేషెంట్లలో ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడి ఫ్రాక్చర్స్ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. కాబట్టి షుగర్ పేషెంట్లు వారి ఫుడ్ ఫ్లేట్ లో 50 శాతం కూరగాయలు, 25 శాతం కార్బోహైడ్రేట్స్, 25 శాతం ప్రొటీన్ అంటే ఫ్లాంట్ ప్రొటీన్ అయితే మంచిది. దీంతో షుగర్ వ్యాధిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications