Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఇవి తింటే గెండెపోటుకు చెక్.. మీరు తింటున్నారా..?
గుండెపోటు ఇప్పుడు అందరికీ సాధారణ జ్వరంలా మారిపోయింది. గతంలో కంటే ఇప్పుడు గుండెపోట్లు అధికంగా వస్తున్నాయ్. తినే ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా గుండె పోటు కేసులు భారీగా పెరిగిపోతున్నాయ్. బరువు ఎక్కువగా ఉండడం వల్ల కూడు గుండె పోటు అవకాశాలు పెరిగిపోతాయ్. తినే ఆహారంలో అలవాట్లను మార్చుకోగలిగితే గుండెపోటును సులభంగా నివారించవచ్చని అంటున్నారు.
కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ను చేయించుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవాలి. గుండెకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యం రావొద్దని, గుండెపోటును నివారించే ఆహారానికి సంబంధించిన విషయాలను మీకు అందిస్తున్నాము.

ఓట్స్
ఓట్ మీల్ గిన్నెతో మీ రోజును ప్రారంభించండి. ఓట్స్ మీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగల కరిగే ఫైబర్. ఇది ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్ ఎంపికగా చేస్తుంది. అప్పుడు మేము అవోకాడోలను కలిగి ఉన్నాము, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు గుండెకు మేలు చేసే పొటాషియంను సమతుల్యం చేయడంలో సహాయపడటానికి మంచి కొవ్వులతో నిండిన గుండె ఆరోగ్య శక్తి కేంద్రంగా ఉంటుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
సాల్మన్, మాకేరెల్ మరియు సార్డినెస్ వంటి కొవ్వు చేపలు కూడా అద్భుతమైనవి, ఎందుకంటే వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి గుండెకు ప్రయోజనాలను నిరూపించాయి. మంచి కొవ్వులు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండిన కొన్ని గింజలను మీ రోజువారీ ఆహారంలో కూడా వేయండి. వారు మీ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతారు.
బెర్రీలు
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బెర్రీలు తినడం వల్ల్ కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. బెర్రీలు రొజూ కొన్ని తినడం అలవాటు చేసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధుల గురించి భయపడాల్సిన అవసరం లేదు.
ఆలివ్ నూనె
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించాలంటే ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ నూనెను వాడాల్సిందే. గుండె వ్యాధి వస్తుందని కొంచెం అనుమానం వచ్చినా ఈ ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాల్సిందే. క్రమం తప్పకుండా ఈ ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయ్.
ఆకుకూరలు
ఆకుకూరల్లో ఉండే లుటిన్, పొటాషియం గుండెకు చాలా మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించే శక్తి కూడా ఈ ఆకుకూరల్లో ఉంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయ్. ఫ్లేవనాయిడ్స్ కూడా సంమృద్దిగా ఉండడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తాయ్. కొలెస్ట్రాల్ స్థాయి కూడా తక్కువగా ఉండడం వల్ల గుండెరోగులు నిర్భయంగా ఉండవచ్చు.
ఫ్లాక్స్ సీడ్స్
ఫ్లాక్స్ సీడ్స్‌లో ఫైబర్‌తో పాటు ఫోటో కెమికల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయ్. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది.
యోగర్ట్
పెరుగుకు బదులుగా యోగర్ట్‌ను భోజనంలో తీసుకోవాలి. పెరుగులో కొవ్వు పదార్ధం వుంటుంది. యోగర్ట్‌లో ఇవి వుండవు. కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియాల ద్వారా పాలతో తయారు చేస్తారు. ఈ యోగర్ట్ ద్వారా క్యాల్షియం కూడా సంమృద్దిగా అందుతుంది.
చెర్రీస్
కేక్ పేస్ట్రీలపైన, పాన్ షాపుల్లో, కొన్ని స్వీట్స్ పైన మనం చెర్రీలను చూస్తుంటాం. చెర్రీలను ప్రత్యేకంగా కొని తినేవారు చాలా తక్కువ. చెర్రీలను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసయానిన్స్ రక్తనాళాలను శుద్ధి చేస్తాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications