Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మెడ, వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇదొక్కటి మార్చాల్సిన సమయం వచ్చినట్టే!
ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. శరీరానికి మంచి విశ్రాంతి దొరికేది నిద్రపోయే సమయంలోనే. సరైన నిద్ర వల్ల చాలా రకాల మానసిక, శారీరక సమస్యలు దూరం అవుతాయని వైద్యనిపుణులు చెబుతుంటారు. మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం.
మంచి నాణ్యమైన నిద్రకు పడుకునే ప్లేస్ కూడా ముఖ్యమే. పడుకునే మంచం బాలేకపోతే నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. మంచం సరిగ్గా లేకపోతే నిద్ర పట్టదు. పరుపు సరిగ్గా లేకపోతే మెడ, వెన్ను నొప్పులు ఇబ్బంది పెడతాయి. అసలు పరుపును ఎప్పుడు మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కుంగిపోతుంది:
రోజులు గడిచేకొద్దీ మ్యాట్రెస్ కుంగిపోతుంది. ఒకవైపు కుంగిపోతుంది. ఇన్నర్‌స్ప్రింగ్ పరుపుల్లో, దూది పరుపుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా మారిపోతే నిద్రపోయినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అసౌకర్యంగా ఉండటం వల్ల నిద్రపట్టదు. అలాగే మెడ, వెన్ను నొప్పి ఇబ్బంది పెడతాయి.
2. దుమ్ముతో అలెర్జీ, ఆస్తమా:
ఎక్కువ రోజులు మ్యాట్రెస్ వాడటం వల్ల దుమ్ము పేరుకుపోతుంది. దీంతో క్రమంగా పురుగులు, బ్యాక్టీరియా చేరి వివిధ రకాల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దుమ్ము పేరుకుపోవడం వల్ల జలుబు, దగ్గు ఇబ్బంది పెడతాయి. అలెర్జీ, ఆస్తమా వస్తాయి.
3. నొప్పులు:
మెడ, వెన్ను నొప్పులు ఇబ్బందులు పెడతాయి. పరుపు ఒకవైపుకు కుంగిపోవడం వల్ల శారీరక నొప్పులు సతమతం చేస్తాయి. పాత మ్యాట్రెస్ వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. శరీరంపై వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన ఒత్తిడి పెరిగి నొప్పుతో పాటు రక్తప్రసరణ ఇబ్బంది పెడుతుంది.

4. నిద్రనాణ్యత దెబ్బతింటుంది:
పరుపు సరిగ్గా లేకపోతే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రపోవడం కష్టంగా అనిపిస్తుంది. అసౌకర్యం వల్ల నిద్ర పట్టదు. పేలవమైన నిద్ర నాణ్యత వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రతతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కూలింగ్ జెల్, బ్రీతబుల్ మెటీరియల్స్ వంటి ఫీచర్లతో కూడిన కొత్త పరుపు మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. 8 ఏళ్లకంటే పాతబడిపోతే:
ఎంత మంతి మ్యాట్రెస్ అయినా ఎనిమిదేళ్ల కంటే పాతబడిపోతే దాని నాణ్యత దెబ్బతింటుంది. రోజులు గడిచే కొద్దీ పరువు కుంగిపోయి రకరకాల సమస్యలు వస్తాయి. ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ అవుతుంటే ఇక మార్చాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలి.
6. దుర్వాసన వస్తుంటే:
పాతబడిన పరుపు మంచం దుర్వాసన వస్తుంది. బెడ్ పై దుమ్ము, ధూళి చేరి, బ్యాక్టీరియా వల్ల చెడు వాసన వస్తుంది. చెమట అంతా పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
