Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
యువతవలే ఉత్సాహంగా వుండాలంటే!

1. అవకాడో పండ్లు - అవకాడో పండ్లలో విటమిన్ ఇ పుష్కలంగా వుంటుంది. ఈ పండు ఎంతో శ్రేష్టమైనది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు, మీ చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం ఎంతో మెరుపు కలిగివుంటుంది. చర్మకణాలు, ఈ పండు తింటే ఎప్పటికపుడు పునరుజ్జీవనం పొందుతూంటాయి. కనుక అధికమైన రంగును చర్మానికి కలిగి వుంచే సహజగుణం ఈ పండులో వుంది. ఈ కారణంగా ఈ పండు తినేవారంతా మంచి చర్మ తేజస్సు కలిగి వుంటారు.
2. కిడ్నీ బీన్స్ - బీన్స్ గింజలు సాధారణంగా ప్రతి ఇంటిలోనూ వంటకాలలో వేసి ఉపయోగిస్తూనే వుంటారు. కిడ్నీ బీన్స్ ఏ ప్రదేశంలో అయినా సరే విరివిగా దొరుకుతూనే వుంటాయి. ఈ గింజలలో పీచు, పొటాషియం అధికంగా వుంటాయి. పీచు, పొటాషియం, రెండూ కూడా శరీరంలో కొల్లెస్టరాల్ స్ధాయిలను తగ్గుముఖంలో వుంచుతాయి. కొల్లెస్టరాల్ ఎపుడైతే తక్కువగా వుంటుందో వారికి గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా వుంటాయి. కిడ్నీ బీన్స్ లో ఈ రెండూ మాత్రమే కాక, ప్రొటీన్లు కూడా అధికంగానే వుంటాయి. ఇన్ని ప్రయోజనాలుకల కిడ్నీ బీన్స్ ప్రతివారూ అతి చవకలో తినదగిన ఆహారంగా పరిగణించవచ్చు.
3. డార్క్ చాక్లెట్ - సాధారణంగా చాక్లెట్లు తినటం అందరికి ఇష్టమైనదే. పిల్లల మొదలుకొని పెద్దల వరకు అందరూ చాక్లెట్ రుచిని ఇష్టపడతారు. చాక్లెట్లన్నింటిలోకి డార్క్ చాక్లెట్ ఎంతో శ్రేష్టమైనది. చాక్లెట్ ఏదైనా సరే దానిలో కనీసం 70 శాతం కోకో కలిగి వుంటుంది. దీనిలో బలాన్ని అందించే ప్రొటీన్లు, విటమిన్ బి అధికంగా వుంటాయి. తరచుగా కనుక ఈ చాక్లెట్ తింటూ వుంటే అది మీ కొవ్వును కరిగించేందుకు, మీ చర్మ రంగును, జుట్టును మంచి ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడుతుంది.
4. బ్రక్కోలి - బ్రక్కోలి కూడా సాధారణంగా అన్ని చోట్లా దొరికే ఆహారమే. ఇందులో పీచు, మరియు విటమిన్ సి అధికంగా వుంటాయి. బ్రక్కోలి ఆరోగ్యమే కాదు, బరువును కూడా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఈ ఆహారాన్ని సాధారణంగా వైద్యులు గుండె జబ్బులున్నవారికి సూచిస్తారు. తరచుగా తింటూ వుంటే బ్రక్కోలి మంచి ఫలితాలనిస్తుంది.
5. బ్లూ బెర్రీలు - బ్లూ బెర్రీ పండులో విటమిన్ సి అధికంగా వుంటుంది. ఈ పండు మీ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లూ బెర్రీ పండులో మినరల్స్ కూడా అధికమే. ఈ మినరల్స్ మీరు త్వరగా వయసు పైబడకుండా చేస్తాయి. పొటాషియం ఈపండులో అధికంగా వుంటుంది.
ఈ రకమైన ఆహారాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చి శారీరక ఆరోగ్యం సంరక్షించుకోండి. సహజ ఆహారాల ద్వారా వచ్చే ఆరోగ్యం మిమ్మల్ని ఎప్పటికి ఏ రకమైన సైడ్ ఎఫెక్టులు లేకుండా రక్షించి ఆరోగ్యాన్ని శాశ్వతంగా కలిగిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications