Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
రోజంతా ఉత్సాహాన్ని నింపే 6 హెల్తీ ఎగ్ బ్రేక్ ఫాస్ట్
బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో తీసుకొనే ప్రధానమైనటువంటి ఆహారం. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఉదయం అల్పాహారం తీసుకోవడం తప్పని సరి. ఏవో సాకులతో బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండిపోతారు. కానీ అలా చేయడం వల్ల ఆలోచనా శక్తి మందగించే ప్రమాదముంది, దానికి తోడు శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకి దారి తీస్తుంది. అందుకని బ్రేక్ ఫాస్ట్ కంపల్సరిగా తినాలి. బ్రేక్ ఫాస్ట్ ను తినడం కూడా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. అయితే అల్పాహారంగా తీసుకొనే ఆహారపదార్థాలు శరీరానికి కావల్సిన శక్తినిచ్చేటివిగా ఉండాలి. అటువంటి వాటిలో గుడ్లు కు మొదటి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, అతి త్వరగా... సులభంగా తయారయ్యేటటువంటి ఆహారం కాబట్టి.
అలాంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ గుడ్డుతో తయారు చేసుకొనేవి కొన్ని మీ కోసం వీటిని మీరు వీక్ ఎడ్స్ లో ఇంట్లో ప్రయత్నించవచ్చు.....

స్ర్కాబుల్డ్ ఎగ్ ను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. ఇది తయారు చేయడం చాలా సులభం. మరియు సూపర్ డూపర్ టేస్ట్ కలిగి ఉంటుంది. చాలా సులభంగ తయారు చేసే వంటకం స్ర్కాబుల్డ్ ఎగ్ అందుకు వేరే ఇతర పదార్థాలు ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక చెంచా సూన్ ను ఫ్రైయింగ్ పాన్ కు రాసి దాని మీద ఎగ్ పగుగొట్టి చిటికెడ్ ఉప్పు చల్లడం అంతే...దీన్నీ బ్రెడ్ ముక్కమీద వేసి తినడమే. ఇలా చేసి తినడం వల్ల డైయట్ కు బాగా సహకరిస్తుంది. లోఫ్యాట్ బ్రేక్ ఫాస్ట్ కూడా....

మీరు కనుక ఆరోగ్యానికి అధిక ప్రధాన్యత ఇచ్చేవారైతే ఫ్రైయిడ్ ఎగ్ తినడం కంటే వైట్ ఎగ్ ఆరోగ్యకరం. ఫ్రైడ్ ఎగ్ లో పచ్చసొన కలవడం వల్ల అందులో అధిక కొవ్వు ఉంటుంది. కాబట్టి పచ్చసొన తీసేసి వైట్ మాత్రమే ఆమ్లేట్ మాత్రం వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్యాట్ లేకుండా అధిక ప్రోటీన్స్ తో డైయట్ కు బాగా ఉపయోగపడతుంది.

ఎగ్ ను ఆమ్లెట్ లేదా ఫ్రై చేసి తినడం కంటే ఉడికించి తినడం కూడా ఆరోగ్యకరమే. ఉడికించడం వల్ల ఇందులోని ప్రోటీన్స్ చాలా వరకూ అలాగే ఉంటాయి. కాబట్టి గుడ్లను ఉడికించే టప్పుడు ఎక్కువగా ఉడికించకుండా జాగ్రత్తపడాలి. గుడ్లను ఐదునిముషాల్లో ఉడికించి తీసేయాలి.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో అధిక ప్రోటీనులు, కార్బోహైడ్రేట్స్ ఉన్న గుడ్లను తీసుకోవడం వల్ల, రోజంతా శరీరానికి కావలసిన శక్తిని అంధిస్తుంది. అందువల్ల ఎగ్ సాండ్విచ్ ఫర్ ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. బ్రెడ్ ను ఆమ్లెట్ గా వేసి, మల్టీ గ్రేయిన్ తో తయారు చేసిన రెండు బ్రెడ్ పీసుల మద్య ఆమ్లెట్ స్టఫ్ చేసి తినడంతో శరీరానికి కావలసిన శక్తిని, బలాన్ని అందిస్తుంది.

అధిక ప్రోటీనులున్న గుడ్డుకు మరింత ఫోషకాలు జోడించి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మరింత శక్తిని పొందవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగు పడుతుంది. అందులో ఆకుకూరలు తిననివాళ్ళు ఈవిధంగా చేసి తినొచ్చు. ఆకుకూరను బాగా శుభ్రం చేసి మెత్తగా ఉడికించి లోఫాట్ చీజ్ ను లేయర్ గాపరచి దాని మీద ఆకుకూర దాని మీద ఎగ్ వైట్ వేసి బేక్ చేసి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలి.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ తీసుకోవడం చాలా ఆరోగ్యం. అదీ ఆయిల్, ఫ్యాట్స్ ఏమీ లేకుండా తయారు చేసుకొనే ఈ వంట ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలా అంటే పాన్ లో నీళ్ళు పోసి బాగా మరుగుతున్నప్పుడు గుడ్డును పగులగొట్టి అందులో పోయడం వల్ల అది అలాగే ఉడకుతుంది. దీన్ని ప్లేట్ లోనికి తీసుకొని దానికి కొద్దిగా ఉప్పు, పెప్పర్ చేర్చి బ్రౌన్ బ్రెడ్ తో తినొచ్చు.



Click it and Unblock the Notifications