Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
ఉప్పుకు బదులు బిపిని కంట్రోల్ చేసే ఆరు వస్తువులు
సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో రుచికి తగ్గ ఉప్పు లేకపోతే ఆహారాన్ని తినలేం. అందుకే కొన్ని సార్లు సలాడ్స్, సూప్స్, డింక్స్ మరియు ఆహారంలో ఉప్పు తక్కువైతే వెంటనే కొద్దిగా చిలకరించేస్తుంటాం. అయితే అటువంటప్పుడు ఎంత మొత్తంలో వేస్తున్నాం అన్నది తెలియకుండానే వేసి రుచిగా లాగించేస్తుంటారు. దాంతో ఒత్తిడి మొదలవుతుంది. అవన్నీ తెలియకనే హైపర్ టెన్షన్ కు గురికావాల్సి వస్తుంది. మనలో హై బ్లడ్ ప్రెజర్ లేకపోయినప్పటికీ ఎక్కువ సోడియంను తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనంతట మనం హై బీపీని కొనితెచ్చుకొన్న వాళ్ళం అవుతాం.
కాబట్టి సోడియం(ఉప్పు)కు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేటటువంటి అలాంటివి కొన్ని వస్తువులు వంటచేసేటప్పుడు లేదా తినేటప్పుడు ఉపయోగించవచ్చు. మరి అవేంటో చూద్దాం...

మిరియాలు రుచికి ఘాటుగానూ, కారంగానూ వుంటాయి. మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుంది. ఆహారంలో ఉప్పుకు బదులుగా వీటిని ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు.. మరెన్నో విధాల మేలుచేస్తాయి మిరియాలు. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది.

నిమ్మరసం కొద్దగా ఉప్పు రుచినే కలిగి ఉంటుంది. అయితే ఇది ఉప్పు ఇచ్చినంత రుచిని ఇవ్వకపోయినా దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరం. నిమ్మరసాన్ని గ్రిల్డ్ ఫుడ్ మరియు సలాడ్స్ లో ఉపయోగించడం వల్ల ఉప్పు లేకుండానే మంచి టేస్ట్ ను ఇస్తాయి.

సోయా సాస్ లో హై సోడియం కంటెంట్ కలిగి ఉంటుంది. సోయా సాస్ ను ఇప్పుడు ప్యూర్ సాల్ట్ కు బదులుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని ఓరియంటల్ కర్రీస్ లో ఉప్పుకు బదులు సోయా సాస్ ను ఉపయోగించవచ్చు. హై బ్లెడ్ ప్రెజర్ ఉన్న వారి కోసం ‘లో సోడియం' సోయా సాస్ మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నది.

వెల్లుల్లి పౌడర్ ను మార్కెట్లో తీసుకొవచ్చు లేదా ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను పాన్ లో వేసి రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పొడిని ఎండలో రెండు రోజుల పాటు బాగా ఎండ బెట్టాలి. ఇలా చేయడం వల్ల మంచి రుచిని, వాసన ఇస్తుంది.

ఇండియన్ మసాలాలతో తయారు చేసినటువంటిది చాట్ మసాలా. దీన్ని వివిధ సలాడ్స్, సూప్స్ లలో వినియోగిస్తుంటారు. చాట్ తయారు చేసుకొన్నప్పుడు లేదా బేల్ పూరీకి ఉప్పుకు బదులుగా ఛాట్ మసాలాను వినియోగిస్తే సరిపోతుంది.

సలాడ్స్, సూప్స్ లో ఉప్పుకు బదులుగా వెనిగర్ ను వేయడం ఆరోగ్యకరం. ఆహారం పుల్లగా రుచిగా టేస్టీగా మార్చుతుంది. కాబట్టి సాల్టెడ్ వెనిగర్ కాకుండా సాదా వెనిగర్ మాత్రమే ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటిని ఉప్పుకు ప్రత్యామ్నాయాలుగా వంటకాల్లో, ఇతర సలాడ్స్, సూప్ ల్లో ఉపయోగించి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి....



Click it and Unblock the Notifications