Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్‌కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
ఇవి తినండి.. నోటి దుర్వాసనను దూరం చేసుకోండి..
సాధారణంగా మనం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వంటివి తిన్నప్పుడు ఆ వాసన నోట్లో అలాగే నిలిచి ఉండి ఇబ్బంది కలిగిస్తుంది. అలా దుర్వాసన రాకుండా వెంటనే నోట్లో ఏదైనా వేసుకొని నోరు ఫ్రెష్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసం చాలా రకాల మౌత్ ఫ్రెష్ నర్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. అయితే ఓరల్ మౌత్ స్ప్రేస్ దగ్గర నుండి రకరకాల చూయింగ్ గమ్స్ వరకూ.
వాటిలో ఏవో ఒకటి దగ్గరుంచుకోవడం చాలా మంచిది. అయితే కొన్ని మౌత్ ఫ్రెష్ నర్స్ తో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించే కృత్రిమమైనటువంటి మౌత్ ఫ్రెష్ నర్స్ ను తినడం కంటే నేచురల్ గా సహజంగా మన ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలతోనే నోటిని ఫ్రెష్ చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ కొన్ని మౌత్ ఫ్రెష్ ఉపయోగించే కొన్ని పదర్ధాలను మీకోసం అందిస్తున్నాం...

యాలకులు
ఉల్లిపాయలు, వెల్లుల్లి, తిన్నప్పుడు లేదా మాంసాహారం తిన్నప్పుడు, భోజనం తర్వాత, ఒకటి రెండు యాలకులను...

కొత్తిమీర ఆకులు
సాధారణంగా మనం కొత్తిమీరను కూరల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం.

లవంగాలు
లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. వీటిలో వాసనేకాడు..

పుదీనా
ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. పుదీనా సలాడ్స్ లోనూ, కర్రీస్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు.

సోంపు గింజలు
మనలో చాలామందికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంప్. హొటళ్లలో అల్పాహారం, భోజనం, కాఫీ, టీ మొదలైనవి సేవించిన తరువాత...

జామకాయ
పోషకవిలువలు జామపళ్లను 'మేలైన ఫలాలుగా' పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్ 'ఏ' మరియు విటమిన్...

దానిమ్మ
గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి...

క్రేన్ బెర్రీస్
సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో లాభాలను కలిగిస్తాయి. క్రేన్ బెర్రీస్ తినడం వల్ల బరువును తగ్గడానికి బాగా సహాయ పడుతుంది.
1. యాలకులు: ఉల్లిపాయలు, వెల్లుల్లి, తిన్నప్పుడు లేదా మాంసాహారం తిన్నప్పుడు, భోజనం తర్వాత, ఒకటి రెండు యాలకులను నోట్లో వేసుకొని పది నుండి ఇరవై నిముషాల పాటు నమలడం లేదా నోట్లో పెట్టుకోవడం ద్వారా నోరు ఎప్పుడు ఫ్రెష్ గా తాజాగా మంచి వాసువసన కలిగినటువంటి శ్వాసనందిస్తుంది.
2. కొత్తిమీర ఆకులు: సాధారణంగా మనం కొత్తిమీరను కూరల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. ఎందుకంటే కూరలు కమ్మని రుచితో పాటు మంచి సువాసనందిస్తుందని. అయితే కొంతమీరలో శరీరంలోని కొన్ని చిన్న చిన్న ఆనారోగ్యాలకు ఉపయోగపడే ఔషద గుణాలు అధికంగా కలిగి ఉన్నాయి. అంతే కాదు రకరకాల వంటకాల్లో వీటిని గార్నిష్ (అలంకరణ)గా ఉపయోగిస్తారు. మంచి సువాసన కలిగినటువంటి కొత్తిమీర ఆకులను కొన్నింటిని భోజనం తర్వాత నోట్లో వేసుకొని నమలడం ద్వారా నోట్లో బాడ్ స్మెల్ ను పోగొడుతుంది.
3. లవంగాలు: లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి . పోషకాలు మాత్రమే కాదు వైద్య పరంగా ఔషద గుణం కలిగినటువంటింది. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీ లో శొంఠి కి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది. మొటిమలు, రాష్‌లు, దద్దుర్లు... వంటి చర్మ సమస్యలకూ లవంగనూనె ఉపయోగపడుతుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్, ఆర్త్థ్రెటిస్, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.
4. పుదీనా: ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. పుదీనా సలాడ్స్ లోనూ, కర్రీస్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. పుదీనాను చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.
5. సోంపు గింజలు: మనలో చాలామందికి తెలిసిన సుగంధ ద్రవ్యం సోంప్. హొటళ్లలో అల్పాహారం, భోజనం, కాఫీ, టీ మొదలైనవి సేవించిన తరువాత మన దృష్టి మరలేది సోంప్ మీదకే. కొంతమంది ఇళ్లలోనూ భోజనానం తరం సోంప్‌ను ఉపయోగిస్తుంటారు. సోంప్ ఔషధ గుణాలు చాలామందికి తెలియవు. ఇవి పరిమాణంలో జీలకర్ర కంటే కొంచెం పెద్దగా ఉండటం వలన స్థూలజీరకమనే పేరుతోపాటు, గింజలు తీపిదనాన్ని కలిగి ఉన్నందున మధురిక అనే పేరు కూడా వీటికి ఉంది. సౌమ్యంగా, సమర్థవంతంగా పని చేసే సోంప్‌తో అనేక ఆరోగ్య సమస్యలను మనం సులభమార్గాల ద్వారా ఎదుర్కొనవచ్చు. వీటిని నోట్లో వేసుకొంటే చాలు వెంటనే నోరంతా ఫ్రెష్ అయిపోతుంది.
6. జామకాయ: .పోషకవిలువలు జామపళ్లను 'మేలైన ఫలాలుగా' పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్ 'ఏ' మరియు విటమిన్ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామపండు లేదా అందులోని గింజలు నోట్లో వాసను అతి సులభంగా వదలగొడుతుంది. ఎప్పుడైనా బయట భోజనం చేసిన తర్వాత ఒక జామ పండును తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. భోజనం తర్వాత తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను అభివృద్ధి చేస్తుంది.
7. దానిమ్మ: గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ "ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది. ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్ తగ్గిపోతుంది. అంతే కాదు గుండె సంబంధిత వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది. ఒక్క గుండె, చర్మ సంరక్షనకే కాకుండా దానిమ్మ గింజలు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ మీరు మౌత్ ఫ్రెషనర్స్ కొనే ముందు ఒక సారి ఆలోచించండి. పండ్లను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసను పోగొట్టడమే కాకుండా.. ఆరోగ్యానికి క్షేమం.
8. క్రేన్ బెర్రీస్: సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో లాభాలను కలిగిస్తాయి. క్రేన్ బెర్రీస్ తినడం వల్ల బరువును తగ్గడానికి బాగా సహాయ పడుతుంది. అంతే కాదు నోటి దుర్వాసనను పోగొట్టే శక్తి ఈ క్రేన్ బ్రెర్రీస్ కలిగి వుంది. అంతే కాదు సందసంబంధ వ్యాదుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నోటి పూతా, చిగుళ్ళు వాపులను పోగొట్టి చిగుళ్ళు బలపడేలా చేస్తుంది. దంతాలు తెల్లగా మారుడానికి సహాయపడుతుంది. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు.



Click it and Unblock the Notifications
