Latest Updates
-
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో..
నిమ్మ-తేనె జ్యూస్ లో దాగున్న బోలెడు ఆరోగ్యప్రయోజనాలు...
సాధారణంగా మనం వినే ఉంటాం నిమ్మరసం, తేనెలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో అని. అధ్భుతమైన ఈ రెండింటి కాంబినేషన్ కొద్దిగా ఉప్పగా, రుచిగా, తియ్యగా, కమ్మగా ఉండే ఈ కలయిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది. డైటేరియన్ నుండి ఫిట్ నెస్ వరకూ ఇది అద్భుతమైన ఫలితాలను అంధిస్తుంది. డైయట్ ఫాలో అయ్యే వారు కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క గ్లాస్ ఈ కాంబినేష్ డ్రింక్ ను తాగాల్సిందే అంటున్నారు.
ఎందుకంటే అతి త్వరగా సహజంగా బరువును తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అంతే కాదు తేనె-నిమ్మరసం కాంబినేషన్ లో ఇంకా బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అవి మీరు తెలుసుకోవాలంటే ఈ నిమ్మ-తెనె కాంబినేషన్ లోని డ్రింక్ తాగాల్సిందే. మరీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం...

1. బరువు తగ్గించడానికి: ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మరియు తేనెలోని యాంటిఆక్సిడెంట్స్ వేడి నీళ్ళలో కలపడం వల్ల అద్భుతమైనటువంటి జ్యూస్ గా తయారై మంచి ఫలితాలనందిస్తుంది. ఎవరైతే బరువు తగ్గించుకోవడానికి అధికంగా వర్కౌట్స్ చేస్తున్నారో వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: నిమ్మరసంతో మరొకో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం. జీర్ణవ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను నివారిస్తుంది. మీరు కనుక కడుపులో ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లైతే నిమ్మరసం, తెనె మిశ్రమాన్ని కలిపిన జ్యూస్ ను సేవించండి.
3. శరీరాన్ని శుభ్రపరచడానికి: ఇది మరొక ఆరోగ్య ప్రయోజం. నిమ్మరసం, తేనెతో మిశ్రమంతో తీసుకొనే ఈ జ్యూస్ ను వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయబడుతుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గి, మెరిసే చర్మాన్ని సొతం చేసుకోవాలనుకొంటే ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగాలి. తేనె, నిమ్మరసం వేడినీళ్ళతో మిక్స్ చేసి తాడం వల్ల మలబద్దకాన్ని పోగొట్టి, ప్రేగును శుభ్రం చేస్తుంది.
4. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది: ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.
5. గొంతు నొప్పిని నివారిస్తుంది: గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది . వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.
6. పెద్దప్రేగు క్యాన్సర్ ను అడ్డుకొంటుంది: తేనెలోని యాంటీఆక్సిడెంట్స్ అనామ్లజనకాలతో పోరడాకలిగే శక్తి ఉండి, పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
