Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
తలనొప్పి కలిగించే పొట్ట కొవ్వు!
ఒత్తిడి అనేది మన జీవితాలలో ఒక భాగం అనేది అంగీకరించాలి.అందతేకాదు, ఈ ఒత్తిడి మనకు అధిక బరువును కలిగించే ఒక దొంగగా కూడా గుర్తించండి. మీరు ఎంత సరిగా తిన్నా, ఎంత బాగా వ్యాయామం చేసినా, ఒత్తిడి కనుక కలిగి ఉంటే, బరువు తగ్గరు. మరి ఒత్తిడికి మన బరువుకు లింకు ఎక్కడంటారా? శరీరం మానసికంగా లేక శారీరకంగా ఒత్తిడిలో వేరుగా స్పందిస్తోందా? ఆందోళన మిమ్మల్ని బరువు తగ్గకుండా చేసేస్తోందా? ఒత్తిడి, బరువు పొందటం ఎలా లింక్ చేయాలి?

మీరు ఒత్తిడితో వ్యవహరిస్తున్నపుడు, మీ మైండ్ శారీరక ప్రనమాదం వస్తున్నట్లు స్పందిస్తుంది. మీ శరీరంలో కొన్ని హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఇది సడన్ గా ఎడ్రినాలిన్ స్ధాయి పెంచుతుంది. ఇక మీరు దానితో పోరాటం లేదా పారిపోవటం అనే భావన కలిగించుకుంటారు. అదే విధంగా, రిలీజ్ చేసిన కార్టిసోల్స్ మీ శరీరాన్ని శక్తి నిలువచేసుకునేలా చేస్తాయి. ఇది చివరకు ఆకలికి దోవతీస్తుంది. ఒత్తిడి కొనసాగేటంతవరకు మీ శరీరం కార్టిసోల్ పంప్ చేస్తూనే ఉంటుంది. మీకు మరింత ఆకలి పుడుతుంది.
సైన్స్ డైలీ పేర్కొన్న ఒక రిపోర్టు మేరకు, సమాజ ఒత్తిడి శరీరంలో కొవ్వు నిల్వలను చేర్చి హాని కలిగిస్తుంది మరియు గుండె జబ్బులు తెప్పిస్తుంది. ఈ స్టడీ ఈ స్టడీ గుండె జబ్బులకు ఒత్తిడే కారణమని రుజువు చేస్తోంది. కొవ్వును శరీరంలో నిలువ చేస్తుందని, ప్రధానంగా పొట్ట భాగంలో కొవ్వు నిల్వ చేస్తుందని తెలుపుతోంది.
మరో స్టడీ మేరకు, కోతులకు అమెరికన్ డైట్ ఇస్తే అవి బాగా లావు ఎక్కిపోయాయట. కాని ఒత్తిడి అధికంగా కలిగిన కోతులు పొట్ట వద్ద మరింత కొవ్వును నిలువ చేశాయట. ఈ స్టడీ షుమారు రెండు సంవత్సరాలు సాగింది. శరీరంలో కొవ్వు స్ధాయి అధికంగా ఉన్నవారు అపసవ్య జీవప్రక్రియ కలిగి, వారి రక్తనాళాలు బ్లాక్ అవటం, పొట్ట ఉబ్బటం వంటివి కలుగుతాయని స్టడీ వెల్లడించింది.
ఒత్తిడి మరియు బరువు పెరగటాలపై నిపుణులు తెలిపేదేమిటి?
ముక్తా వశిష్ట, సీనియర్ పోషకాహార నిపుణుడు, సర్ గంగారామ్ హాస్పిటల్, న్యూఢిల్లీ మేరకు, ఒత్తిడి కార్టిసోల్ హార్మోన్ పెంచుతుంది. ఆకలిని పెంచి, పొట్ట కొవ్వు పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తే చాలు, పొట్టకూడా తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన సంతులిత ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామాలు ప్రతిరోజూ చేయడం ఎంతో ప్రధానం. అవి ఒత్తిడిలేని మైండ్ తోనే సాధ్యం. పొట్ట కొవ్వు ఈ రిస్కులను తగ్గిస్తుంది సైటోరైన్స్ కొవ్వు కణాల సైజు, సంఖ్యలతో పెరుగుతాయి. ఈ సోటోకైన్స్ అధిక మంట కలిగిస్తాయి.
సునితా రాయ్ చౌదరి, సీనియర్ పోషకాహార నిపుణులు, రాక్ లాండ్ హాస్పిటల్ మేరకు పొట్ట కొవ్వు వివిధ జీవన విధాన అనారోగ్యాలను కలిగిస్తుంది. పొట్టలో పెరిగే కొవ్వు, ఇన్సులిన్ పవరు తగ్గిస్తుంది. దీనికారణంగా రక్తంలో బ్లడ్ షుగర్, కొలెస్టరాల్ స్ధాయిలు పెరుగుతాయి. ఈ కారణంగానే వ్యక్తిలో టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు మొదలైనవి వస్తాయి. పొట్టకు పెరిగే కొవ్వు, తలనొప్పి ని కూడా కలిగిస్తుంది. పొట్టకొవ్వు పెరగటానికి మైగ్రేన్ లేదా మతిమరుపు వ్యాధి రావటానికి కూడా దగ్గర సంబంధాలున్నట్లు స్టడీలు చెపుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications