Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కాంటాక్ట్ లెన్సులతో వచ్చే సమస్యలు!

కాంటాక్ట్ లెన్స్ ల వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఎలా వుంటుందంటే......
ఆరోగ్యం - కళ్ళు చాలా సున్నితం. లెన్సులు కనుక శుభ్రంగా లేకుంటే, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. కనుక లెన్సులకు శుభ్రత చాలా అవసరం. నిర్దేశిత సొల్యూషన్ తో ప్రతిసారి మీరు ధరించేముందర, తర్వాత వాటిని శుభ్రం చేయాలి. అంతేకాదు వాటిని ప్రతి ఆరు నెలలకు మార్చాలి.
కంటి మంటలు - ప్లాస్టిక్ సిలికాన్ తో చేసిన ఈ లెన్స్ మీ కళ్ళలో పెట్టుకుంటే, వెంటనే కొంత మంట పెడుతుంది. కళ్ళు చాలా సున్నితం. చిన్న దుమ్ము కణం పడినా సరే, అది ఎర్రగా అయిపోతుంది. మరి లెన్స్ పెడితే ఏం జరుగుతుంది. మంట పెడుతుంది. కాని అది తాత్కాలికం. కను రెప్పలు కొద్దిగా ఉబ్బి నొప్పి పెడతాయి కూడాను. వాటికి అలవాటు పడేంతవరకు ఈ ఉబ్బటం, నొప్పి వుంటూనే వుంటాయి.
కళ్ళు పొడిబారటం - కళ్ళు పొడిబారి దురదలు పెడతాయి. దీర్ఘకాలం కనుక కాంటాక్ట్ లెన్సులు పెడితే దురదలు తప్పవు. లెన్స్ లు కంటి తడిని పొడి చేసి కంటిలో మంట కలిగేలా చేస్తాయి.
ద్రవాలు నిలువ - లెన్స్ లో వుండే కొన్ని ద్రవాలు రెటీనాపై డిపాజిట్ అవుతాయి. ఈ ద్రవం కంటి వ్యాధులు కలిగిస్తుంది. ప్రతిరోజూ పెట్టుకుంటే ఈ సమస్య మరింత ఉంటుంది. లెన్స్ లు సొల్యూషన్ తో కడిగి తుడిచి నప్పటికి దాని ప్రభావం కంటిపై వుంటుంది.
అలర్జీ - కంటి అలర్జీల వస్తుంది. కొంతమందికి కాంటాక్ట్ లెన్సు పెడితే చాలు అలర్జీ. అయినా వారు అది గ్రహించలేరు. కళ్ళు ఎర్రబడతాయి. దీనికి కారణం లెన్స్ శుభ్రం చేసే ద్రవాలు. ఇవి అధిక సెన్సిటివిటీ కలిగిస్తాయి. కళ్ళను దీర్ఘకాలంలో నష్టపరుస్తాయి.
కాంటాక్ట్ లెన్సులు ధరిస్తే వచ్చే సమస్యలు ఇవి. మీరు కనుక కాంటాక్ట్ లెన్సులు ధరిస్తూ మరిన్ని సమస్యలకు గురవుతుంటే, మాకు వ్రాయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications