Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
పొట్టలో గ్యాస్ రాకుండా...పండ్లు తినటం ఎలా?
పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఇతర ప్రధాన పోషకాలు పుష్కలంగా వుంటాయి. పోషకాలు బాగా వుంటాయి కదా అని రోజులో పండ్లు అధికంగా తింటే, అది అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కొన్ని పండ్లులో వుండే సార్బిటాల్ అనే షుగర్ మరియు కరిగే పీచులు మీకు గ్యాస్ సమస్య తెస్తాయి. ఇవి త్వరగా జీర్ణం కావు కనుక పేగులలో గ్యాస్ ఏర్పడుతుంది.
ప్రస్తుతం మామిడిపండ్ల సీజన్ కొనసాగుతోంది. మరి మామిడి పండుకూడా అజీర్ణం కలిగిస్తుంది. మామిడిపండుతోపాటుగా ఆపిల్, రేగిపండు, అరటిపండు వంటివి కూడా అజీర్ణం చేస్తాయి. ఈ గ్యాస్ కలిగించే పండ్లను తినేందుకు వాటిని ఏ రకమైన హాని కలగకుండా తేలికగా తినే పద్ధతులు కొన్ని చూద్దాం.

ఆపిల్స్ - రోజూ ఒక ఆపిల్ తింటే, రోగాలు దూరం అంటారు. కాని అది కలిగించే గుండె మంట వుంటుంది. ఆపిల్స్ అధికంగా తిన్నా జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. దానిలో పెక్టిన్ రూపంలో పీచు వుంటుంది. పెక్టిన్ ఒక పిండిపదార్ధం. తేలికగా ఇది జీర్ణ వ్యవస్ధలోకి వెళ్ళదు.
మరి ఆపిల్ తినాలంటే ఏం చేయాలి? ఆపిల్ పండును నీటిలో బాగా ఉడక పెట్టాలి. ఇక అది మీకు ఏ అజీర్ణ సమస్య కలిగించదు. మీరు అజీర్ణం భావిస్తే ఆపిల్ తప్పక ఉడకపెట్టి తినండి. ఉడకపెట్టినందువలన వీటిలోని పోషకాలు కూడా చెక్కు చెదరక అలానే వుంటాయి.
రేగుపండు, జామకాయ - వీటిలో సహజ తీసి వుంటుంది. పెక్టిన్, నీటిలో కరిగే పీచు వుంటాయి. ఇవి కూడా గ్యాస్ కలిగిస్తాయి. త్వరగా జీర్ణం కావు.
గ్యాస్ కలిగించే పండ్లను నీటిలో బాగా ఉడికించి తినండి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా వుంటాయి. ఈ పండ్లు తినేముందు నీరు బాగా తాగండి. ఇక సమస్యలుండవు. ఇంత జాగ్రతత్త పడిన తర్వాత కూడా గ్యాస్ ఏర్పడుతూంటే, జీర్ణక్రియకు సంబంధించిన టాబ్లెట్ లు వాడండి. పండ్లను రుచిగా తినండి.
కొంతమంది రాత్రివేళ పండ్లు తింటే కూడా గ్యాస్ కలిగిస్తుందని భావిస్తారు. కనుక గ్యాస్ సమస్య లేకుండా వుండాలంటే, హాని కలగని విధంగా, వాటిని సూర్యుడు అస్తమించే లోపుగానే తినేయండి. ఆరోగ్యాన్ని అద్భుతంగా పండ్లు తింటూ కాపాడుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
