Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
వర్షాకాలం వేడిగా ....తినేస్తే?
వర్షాకాలం వచ్చిందంటే మరి వానలు బాగా పడతాయి. వర్షాలు ఎక్కడ చూసినా నీటి నిల్వలు, మురుగు వంటివి వాతావరణంలో అధిక బాక్టీరియాను పెంచి ప్రతి వారికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. ఈ కాలంలో మీరు తినే ఆహారాలపై ఎంతో శ్రధ్ధ పెట్టాలి. అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా ఆహారం లేదా నీటితో వస్తాయి. ఎండల వేడి కొంచెం వెనుక పడిందనుకుంటే చాలు ఇక ఆహార పరంగా జాగ్రత్త పడాలి. కనుక వర్షాకాలంలో ఆరోగ్యం కొరకు మీరు ఆహారం పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలించండి.

నీరు - మీరు తాగే నీటిపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాక, మీ ఇంటిలో లేదా ఇంటి పరిసరాలలో నీరు ఎక్కడా నిలువ ఉండకుండా, దోమలు చేరకుండా చూడండి. నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు చేరి కలరా, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కలిగిస్తాయి. అంతేకాక మీరు పొందే తాగు నీరు కూడా పూర్తిగా శుభ్రమైనదని భావించటానికి వీలు లేదు. నీటి గొట్టాలు లీక్ అయి కలుషితం కావచ్చు. కనుక ఈ కాలంలో సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన నీటిని తాగండి
బయటి ఆహారాలు - హోటళ్ళు, రెస్టరెంట్లలో ఆహార శుభ్రత సరిగా ఉండకపోవచ్చు. ప్రధానంగా సరిగా ఉడకని పదార్ధాలు, చట్నీలవంటివి బయట తినకండి. వాటిలోనే అధిక బాక్టీరియా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ కు అవకాశముంటుంది. హోటళ్ళలో తయారు చేసిన ఆహారాలపై క్రిమి కీటకాలు కూడా వాలి హాని కలిగించవచ్చు. మీకు హోటళ్ళలో ఆహారాలు అందించే వారి శుభ్రత కూడా ప్రశ్నించదగినదే. ఇక ఆహారాల తయారీ ప్రదేశం ఎలా ఉంటుందనేది అంచనా వేయలేము. కనుక మీ ఆరోగ్య భధ్రత కారణంగా ఈ కాలంలో బయటి తిండ్లు తినకండి.
ఇంటి ఆహారాలు - ఇంటిలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంట అవగానే తయారు చేసిన పదార్ధాలపై మూతలు పెట్టండి. పండ్లు, కూరలు వంటివి బాగా కడిగి తినండి. ఈ కాలంలో కూరగాయలు అధికంగా తింటే మీలో రోగనిరోధకత పెరుగుతుంది. నీరు బాగా తాగండి. ఆహారం పెట్టే షెల్ఫ్ లు శుభ్రంగా ఉంచండి. వంట అవగానే వంటగది తప్పక శుభ్రం చేయాలి. తినేముందు మీ చేతులు, ఉపయోగించే ప్లేట్లు, ఇతర వస్తువులు బాగా శుభ్రపరచండి.
అవసరమైన ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను రక్షించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications