ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్ కు మహాభాగ్యం...

సాధారణంగా మన శరీరంలోని ఏ ఇతర భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం. అయితే లివర్(కాలేయం)విషయంలో చాలా సార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం. లివర్ సిర్రోసిస్ వంటి ఏ తీవ్ర సమస్యో మొదలయ్యాక గుండెలు బాదుకునే కాన్నీ ముందే జాగ్రత్త పడితే ఆ సమస్యలను చాలా వరకు దరిచేరవు. శరీరంలో అతి కీలకమైన కాలేయాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. అందుకు మనం ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్ కు మహాభాగ్యం.

తీసుకొనే ఆహారం ఎంత తాజాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారం కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే మీ లివర్ పదిలం. వేపుళ్ళు ఫ్రిజర్వేటివ్స్ వేసి నిల్వ చేసిన పదార్థాలు మీ లివర్ కు శత్రువులు. ఇంట్లో వండుకున్న తాజా ఆహారం ఉత్తమం. సొంత వైద్యం ఎంత మాత్రం మంచిది కాదు. శరీరంలో పేరుకు పోయిన మాలిన్యాలను వ్యాయమం, మసాజ్ ల ద్వారా తరచు తొలగిస్తూ పోతే మీ లివర్ కు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యపానం హద్దు మీరితే మొదట కూలిపోయేది మీ లివర్ అని గుర్తుంచుకోండి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం...

వెల్లుల్లి

వెల్లుల్లి

ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు.

సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్)

సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్)

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది.

వేరు దుంపలు

వేరు దుంపలు

బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి.

ఆకు కూరలు

ఆకు కూరలు

శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ...

గ్రీన్ టీ

గ్రీన్ టీ

టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది...

అవోకాడో

అవోకాడో

ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి.

యాపిల్స్

యాపిల్స్

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ...

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది.

బ్రొకోలి

బ్రొకోలి

ఇది క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం.

1. వెల్లుల్లి: ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది. సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది .. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

2. సిట్రస్ పండ్లు(ద్రాక్ష, ఆరెంజ్): సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది. ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు..ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది.

3. వేరు దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. డయాబెటిక్ లివర్ ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

4. ఆకు కూరలు: శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకుకూరలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.

5. గ్రీన్ టీ: టీ అన్నింటిలో గ్రీన్ టీ మాత్రమే అత్యంత శక్తివంతమైనది. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది గ్రీన్‌ టీ తాగే అలవాటు. ముఖ్యంగా ఇందులోని ''ఇజీసీజి '' ," కాటెచిన్స్ " అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్, యాంటి ప్రొలిఫరేటివ్ గుణాలే ఇందుకు కారణం. రోజువారీగా గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి.

6. అవోకాడో: ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్ నోటి క్యాన్సర్ ను నివారిస్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.

7. యాపిల్స్ : యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్ యాసిడ్ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లో ప్రోటీన్ పదార్థం విచ్ఛిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

8. ఆలివ్ ఆయిల్: ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి . దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. ఈ నూనెలోని మోనో ఆన్ శాచ్యరేటెడ్ కొవ్వు పదార్థం కండర కణజాలాన్ని కాపాడుతుంది.

9. తృణధాన్యాలు: తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

10. బ్రొకోలి: ఇది క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.

Story first published: Saturday, September 29, 2012, 17:30 [IST]
Desktop Bottom Promotion