మీ ‘స్టామినా’ ఇలా కూడా పెంచుకోవచ్చు...

సాధారణంగా మనం తరచూ తీసుకొనే ఆహారంలో కొన్ని ఆహారపద్దార్థాలు మన స్టామినాను(సామర్థ్యాన్ని) తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన స్టామినాను పెంచుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారలుకు ఆరోగ్యకరమైన శక్తి, సామర్థ్యాలను అందించే ఆహారాలు ఎంతనైనా అవసరం. కాబట్టి కీడాకారులకు న్యూట్రిషియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ సి వంటి అందించే ఆహారాలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, శరీరానికి కావల్సినంత శక్తి సామర్థ్యాలను అందిస్తుంది.

ఇక క్రీడాకారులు కాకుండా.. సాధారణ వ్యక్తుల విషయానికొస్తే.. కొంతమంది వయస్సు ఎంత ఉన్నప్పటికీ మూడు పదులు దాటనట్లే కనిపిస్తారు. అంతేకాదు యువతకంటే ఎంతో చురుకుగా పనిచేస్తుంటారు. అదే మరికొందరూ ఎంత తిన్నప్పటికీ నీరసం, అలసట వంటివాటితో బాధపడుతుంటారు. ఆఫీసుకు వెళ్లినప్పటికీ కూనికిపాట్లు పడుతుంటారు. నిస్సత్తువుగా ఉంటారు. ఇది ఏ ఒక్క మహిళ సమస్యో కాదు చాలామంది మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి వయస్సుతో సంబంధం లేదు. ఎంత తిన్నప్పటికీ అలసట, నీరసంగా అనిపిస్తే మీ శారీరక శక్తి తగ్గుతోందన్నమాట.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

బీన్స్: బీన్స్ లో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

కాఫీ: కాఫీని తక్షణ శక్తిని అంధించే ప్రదాతగా పిలుస్తారు. ఇది కేంద్రనాడీవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి బాగా పనిచేస్తుంది. ఇంకా అలసటకు వ్యతిరేకంగా పోరాడే శక్తి కాఫీలో అధికంగా ఉంది. కాఫీ మిమ్మల్ని శక్తివంతులుగాను, చురుకుగాను ఉండేలా చేస్తుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉన్నటువంటి పోషకాలు, న్యూట్రీషియలన్లు, మనిషికి కావల్సిన శక్తి సామర్థ్యాలను రెట్టింపుచేస్తుంది. ఇంకా ఆర్ బిసి కౌంట్ ను పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా జీర్ణం నిధానంగా అయ్యి, ఆకలి పెంచదు. దాంతో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచుతుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

అరటి పండు: పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు: మీ తీసుకొనే డైయట్ ఫుడ్ లో తప్పని సరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి అత్యధికంగా శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అంధిస్తుంది. ఇంకా చేసే పనిలో ఏకాగ్రత పెంచడానికి దృష్టి సారించడానికి కావల్సిన డొపమైన్ అనే రసాయనాలను ఇది విడుదల చేస్తుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

వేరుశెనగ వెన్న: వేరుశెనగలో ఓమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉండి ఎటువంటి నొప్పినైన తగ్గించడంలో బాగా సహాపయడుతుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి మెదడు చురుగ్గా ఉండడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా శరీరానికి కావల్సిన శక్తి సామర్థ్యానికి పెంచడంలో బాగా సహాయకారిగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు అధికంగా ఉండటం చేత స్లోగా జీర్ణం అవుతుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

మాంసాహారం: చేపలు, చికెన్, లీన్ మీట్ మరియు గుడ్లు వీటిలో అధిక శాతంలో ప్రోటీనులు కలిగి ఉంటాయి. ఇవి కండర పుష్టికి మరియు కండరాలు ఆరోగ్యంగా పెరుగుదలకు ఈ ప్రోటీనులు సహాయపడుతాయి కాబట్టి ఆహారంలో వీటిని చేర్చుకోవడం కూడా ముఖ్యమే. మాంసాహరం జీర్ణ అవ్వడానికి చాలా సమయం పడుతు కాబట్టి వీటిన తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తూ.. రోజంతా చురుకుగా ఉండగలుగుతారు.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

ఎర్ర ద్రాక్ష: తక్షణ శక్తిని అందించే resveratol ఎర్రద్రాక్షలో పుష్కలంగా ఉంటుంది. ఈ ఎర్ర ద్రాక్షలో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని అందించడంలోనూ మరియు సత్తువ రూపొందించడానికి సహాయపడుతుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

బీట్ రూట్ జ్యూస్: బీట్ రూట్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు అధికంగా ఉన్నాయి. ఇవి అలసటను తగ్గించి స్టామినాను పెంచుతుంది. వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఎక్కువ సమయం అలసిపోనీకుండా చేసి పనిచేసే శక్తిని అందిస్తుంది.

ఇవి తింటే.. మీ స్టామినా రెట్టింపు...!

సజ్జలు: వీటిలో తగినన్ని మెగ్నీషియం, పొటాషియం, అమినో ఆసిడ్స్, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైవర్ అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇంకా చురుకుగా ఉండేందుకు సహాయం చేస్తాయి.

శక్తికి తీసుకునే ఆహారం ఒక్కటే సరిపోదు ఆహారంతో పాటు. కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. వ్యాయామంతో పాటు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం. కార్బోహైడ్రెడ్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని తినాలి. రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసులు నీరు తప్పనిసరిగా తాగాలి. ఫిజికల్‌ ఎక్సర్‌సైజులు చేసేవారి శరీరంలోని ద్రవాలు చెమట రూపంలో బయటకు పోతాయి. అందుకే వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు, నీరు తీసుకోవాలి. దీనివల్ల శరీరం నుంచి బయటకు వెళ్లిన నీరు తిరిగి చేరుతుంది.

Desktop Bottom Promotion