Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అద్భుత ఆరోగ్యాన్నిచ్చే పుదీనా ఆకులు!

ఎంతో ఆనందంగా భావిస్తారు. పుదీనా ఆకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన కాలంనుండి ఎంతోమంది ప్రజలు ఒక ఔషధంగా వాడుతున్నారు. పుదీనాలో అనేక రకాలున్నాయి. ప్రతి రకం పుదీనాకి ఒకో రకమైన మంచి రుచి, వాసనలున్నాయి. మన ఇండ్లలో చేసుకునే అనేక వంటకాలకు రుచి, వాసన, దాని ఔషధ ప్రయోజనాలకు గాను పుదీనాను చేరుస్తాము. చిరుతిండ్లు, పండ్ల రసాల, సలాడ్లు, ఏవైనా సరే పుదీనా ఆకు పడాల్సిందే.
పుదీనా ఆకులను వంటకాలలో ప్రధాన సుగంధంగా భారతీయులు, మధ్య ప్రాచ్చ దేశాలవారు అధికంగా వాడతారు. రుచికరమైన పెరుగుకు పుదీనా జోడించి తింటారు లేదా వీరు తాగే టీని పుదీనా ఆకులు వేసి తయారు చేసి తాగుతారు. పుదీనా చాయ్ మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో బాగా పేరుపడింది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్ లలోను ఇతర కూరలలోను వాడతారు. యూరప్ దేశాలలోని పుదీనా మొక్క కంటే ఆసియా దేశపు పుదీనా మొక్క మంచి వాసన, రుచి కలిగి వుంటాయి.
పుదీనా ఆకు ప్రయోజనాలు పరిశీలిస్తే...
- పొట్ట నొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.
- పుదీనా చాయ్ తాగితే, మలబద్ధకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడతాయి.
- పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడతాయి.
- పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది.
- పుదీనా ఆకులను పేస్ట్ చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడు శ్వాస నివారించబడుతుంది.
- పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది.
ఇన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకు ఆరోగ్యం బాగుండాలంటే తప్పక మన వంటకాలలో చేర్చాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications