Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మీ పెట్ నుండి మీరు ఏం నేర్చుకుంటున్నారు?

పెంపుడు కుక్కలనుండి నేర్చుకోవలసిన అంశాలు....
రెగ్యులర్ వ్యాయామం - కుక్కలకు ఇది ఒక ప్రత్యేకత. అవి ఎపుడూ ఎంతో శక్తివంతంగా వుంటాయి. మిమ్మల్ని రెగ్యులర్ గా బయటకు తీసుకు వెళ్ళమని కోరతాయి. హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల మేరకు, మీరు ఎంత ఎక్కువ దూరం నడిస్తే, అంత అధికంగా జీవిస్తారట. కనుక ప్రతిరోజూ మీ కుక్కతో పాటు నడవండి. బయటి ప్రదేశంలో నడిస్తే, మంచి గాలి, వెలుతురు వంటి వాటివి మీకు ఆహ్లాదానన్నిస్తాయి.
చిన్నపాటి నిద్రలు - పది లేదా పదిహేను నిమిషాలు చిన్న కునుకు తీస్తే అది ఎన్నో గంటల నిద్రకు సమానమని రీసెర్చర్లు రుజువు చేశారు. కనుక మీ పెట్ నుండి ఇది కూడా నేర్చుకోండి. చేయటానికి ఏ పని లేనపుడు, పది లేదా పదిహేను నిమిషాలు నిద్రించండి. అది ఆరోగ్యంగా వుంచుతుంది. తర్వాతి పని తేలికగా చేసుకోగలుగుతారు. బిజీగా వుంటూ 8 లేదా 9 గంటల నిద్రను రోజుకు ఆచరించలేనివారికి ఇది బాగా పనిచేస్తుంది. కనుక మీ పెట్ నుండి ఈ అలవాటు నేర్చుకుంటే, మీకు ఎంతో లబ్ది చేకూరుతుంది.
ఆరోగ్యకర ఆహారం - మీరు ఏ కు్కను పెంచుతున్నప్పటికి, బాగా గమనిస్తే, అది ఏదో ఒక ఆహారానికి అలవాటుపడి తినే విధానంగూడా సమర్ధవంతంగా వుంటుంది. ఆహారాన్ని బాగా నములుతుంది. ఒకే ఆహారం తింటుంది. సరైన సమయానికి తింటుంది. కనుక మీరు కూడా ఒక సమయానికి ఒకే రకమైన ఆహారాన్ని బాగా నములుతూ తింటే, మీకు ఆరోగ్యానకి ఎంతో లాభం.
మానసిక ఆరోగ్యం - దూసుకుపోయే స్వభావం ఆరోగ్యానికి సంతోషానికి ఎంతో మంచిది. మీ పెంపుడు కుక్క పిలిస్తే చాలు పరుగెట్టుకొస్తుంది. ఏ రకమైన ఆలస్యం చేయదు. పది నిమిషాల కిందట మీరు దానిని తిట్టిన లేదా కొట్టిన సంగతి కూడా మరచిపోతుంది. మీ పెట్ మీకు విశ్వాసం ప్రేమ చూపుతుంది. ఇవి మనిషిలోని మంచి సుగుణాలు. ఏదేని అంశంలో మీరు వేదన చెందితే, దీనిని నేర్చుకోండి. దయ చూపండి మీ మానసిక ఆరోగ్యం బాగు చేసుకోండి.
గాఢ శ్వాస తీయండి - చాలా కుక్కలు గాఢ శ్వాస తీయటం మీరు గమనించే వుంటారు. ఇది మంచి అలవాటే. దానినుండి మీరు తప్పక నేర్చుకోవచ్చు. గాఢ శ్వాస మీ శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెంచి, ఆరోగ్యం చేకూరుస్తుంది. గాఢ శ్వాస మన శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడి తగ్గించి, మానసిక సమస్యలు, నొప్పి దూరం చేస్తుంది.
ఈ పాఠాలు మీ ఇంటి పెంపుడు జంతువునుండి నేర్చుకోండి. మీరు గతంలో కంటే కూడా ఎంత ఆరోగ్యంగా వుంటారో గమనించండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
