Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
అధిక బరువును తగ్గించే 8 లోక్యాలరీ ఆహారాలు
మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో లోక్యాలరీస్ కలిగినటువంటి ఆహారం చాలా రకాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోనే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం వండే విధానం కూడా తెలుసుండాలి. అప్పుడు ఆహారంలో శరీరానికి కావలసిన క్యాలరీలు అందుతాయి. మన అందరం సాధారణంగా బరువు గురించి, బరువు తగ్గడం గురించి డైయట్ లో చాలా మార్పులు చేసుకుంటుంటాం. అయితే వాటి వల్ల బరువు తగ్గడం అటుంచితే.. అవసరమైన ఫుడ్ తీసుకోక పోవడం వల్ల శరీరంలోని కొన్ని కేలరీలను కోల్పోవలిసి వస్తుంది.

లో క్యాలరీస్, ఫ్యాట్స్ అతి తక్కువగా కలిగినటువంటి ఆరోగ్యకరమైన నూనె ఆలివ్ ఆయిల్. ప్రతి రోజూ వండే వంటల్లో ఇతర నూనెల వాడకం కంటే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఆరోగ్యకరం.

ఇండియన్ మసాలాలు అంటే తరచూ మనం వంటకు ఉపయోగించే పసుపు, చెక్క, లవంగం, మిరియాలు, రెడ్ చిల్లీ, మరియు ఇతర మసాలా దినుసుల వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. మసాలాలను తీసుకోవడం వల్ల ఉప్పు శాతాన్ని తగ్గిస్తుంది. దాంతో క్యాలరీలను తగ్గించుకోవచ్చు.

ఇది చాలా ఉపయోగకరమైనటువంటి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియా. అయితే ఓట్స్ తో తయారు చేసే వంటలు మనం రుచిగా ఉండటం కోసం ఎక్కువ క్రీమీగా లేదా తియ్యగా ఉండేట్లు చేసుకొన్నట్లైతే అందులో ఎక్కువ క్యాలరీలు వచ్చి చేరుతాయి . వీటిని మీగడ తీసేసిన పెరుగు, లేదా ఫ్రెష్ ప్రూట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం...

వీటిని నేచురల్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే వీటిలో కొవ్వును కరిగించే ఫైబర్, సిట్రస్ యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. నిమ్మ, ఆరెంజ్, జామ వంటివి సిట్రస్ జాతికి చెందినవిగా పిలుస్తుంటారు. ఇవి లోక్యాలరీస్ ను కలిగి ఉంటాయి. వీటిని అలాగే తాజా పండ్లను తీసుకోవచ్చు లేదా జ్యూసులను చేసుకొని సేవించవచ్చు.

బెర్రీస్ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. పుల్లగా తియ్యగా ఉండే ఈ బెర్రీస్ ను ఏ వంటనైనా సరే రుచిగా మార్చేస్తాయి. వీటిని వంటల్లో గార్నిష్ చేసి తినడం కంటే, తాజావి అలాగే తినడం వల్ల కొవ్వును కరిగించేస్తాయి.

వెల్లుల్లిలో లో కొలొస్ట్రాల్ లెవల్స్ ఉండటం చేతి, ఇవి గుండె సంబంధిత రోగులకు బాగా పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టకుండా కాపాడి, రక్తప్రసరణను బాగా మెరుగు పరుస్తుంది. వీటిని ఆహారంతో పాటు చేర్చడం వల్ల ఆహారం రుచికరంగాను, ఆరోగ్యకరంగాను ఉంటుంది.

రెడ్ చిల్లి చాలా కారంగా ఉండటం వల్ల కొంత మంది మాత్రమే తినడానికి ఇష్టపడుతారు. అయితే చిల్లీ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. ఇవి లోక్యాలరీస్ ను కలిగి ఉంటుంది.

నట్స్ చూడగానే తినేయాలనిపిస్తుంది. అయితే చాలా మంది నట్స్ అధిక క్యాలరీలున్న ఆహారంగా భావిస్తారు. బాదం, పిస్తా వంటి వాటిలో లోక్యాలరీస్ ను కలిగి ఉంటాయి. అధికంగా ఫైబర్ ను కలిగి ఉంటాయి.
కాబట్టి లోక్యాలరీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్నికి చాలా మంచిది బరువు తగ్గాలనుకొనే వారు కూడా ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్స్ అధికంగా కలిగినటు వంటి మంచి ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోవాలి. మీరు కనుక లో క్యాలరీ ఫుడ్ తీసుకొన్నట్లైతే బరువు గురించి భయపడాల్సిన అవసరం లేదు. లో క్యాలరీ ఫుడ్ ఆరోగ్యకరం మరియు లో క్యాలరీ ఆహారం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి హార్ట్ అటాక్, బ్లడ్ ప్రెజర్, వంటివి రాకుండా కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఊబకాయన్ని తగ్గిస్తుంది.
అటువంటి లో క్యాలరీలు ఉన్నటువంటి ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి ఆహారం గురించి మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఇక్కడ ఇస్తున్న ఆహారాలు చూడండి. ఎటువంటి న్యూట్రియట్స్, ఆయిల్స్, బటర్ వంటివి లేకుండానే ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని వస్తువులు ప్రతి రోజూ మీరు మీ ఆహారంలో తీసుకొనే వస్తువులు మీ వంట గదిలో విరివిగా లభించే వస్తువులే. వంటకాల్లో వీటిని ఉపయోగించడం వల్ల రుచికి ఏమీ ఢోకా ఉండదు... అయితే ఆరోగ్యానికి మాత్రం బేషుగ్గా పనిచేస్తాయి... మరి ఆ లోక్యాలరీ వస్తువులేంటో చూద్దామా....



Click it and Unblock the Notifications