Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
రాత్రులందు ఆరోగ్యంగా తినాలంటే ఎలా?

1. డ్రైఫ్రూట్స్: వండటం లేదా తయారు చేయటం వుండదు. అన్నీ రెడీమేడ్ గా వుంటాయి. నోటిలో వేసుకుని తినేయడమే. జీడిపప్పు, వాల్ నట్స్, పీనట్స్, పప్పులన్నీ అర్ధరాత్రి తినే తిండే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. వీటిలో షుగర్ కంటెంట్ అధికంగా లేకపోయినప్పటికి మంచి ఎనర్జీనిస్తాయి. నిద్రను ఏ మాత్రం డిస్టర్బ్ చేయవు.
2. పాప్ కార్న్: ఇందులో అధికంగా వుండేది కార్బోహైడ్రేట్లు. కేలరీలు అతి తక్కువ. తేలికగా జీర్ణం అయిపోతుంది.
3. ఓట్స్: వేడిగా ఒక కప్పుడు ఓట్స్ తినేయండి. మంచి నిద్ర పడుతుంది. వీటిలో కొద్దిపాటి కూరలు కలిపితే మరింత రుచిగా వుంటుంది. కడుపు నిండుతుంది. లేదా, చల్లని పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపి తినవచ్చు.
4. క్లబ్ శాండ్ విచ్: ఇంటిలో రెడీగా ఉడికించిన చికెన్ లేదా ఎగ్స్ వుంటే కొన్ని కూరలు కోసి క్లబ్ శాండ్ విచ్ చేసి తినేయండి. అయితే దీనికి బ్రౌన్ బ్రెడ్ మాత్రమే కలపండి. బటర్ ఏ మాత్రం వద్దు. లేదంటే కొద్దిపాటి సాస్ వినియోగించండి.
5. చల్లటి పాలు: చల్లటి బీరు కంటే కూడా చాలా మంచిది. పాలు గ్యాస్ కలిగిస్తాయా? చల్లటి పాలు కలిగించవు. వాస్తవం చెప్పాలంటే చల్లటి పాలు ఎసిడిటీ తగ్గేటందుకు వైద్యులు తాగమంటారు. పాలల్లో ఐస్ పీసులు వేసి షేక్ చేసి కూల్ డ్రింక్ లాతాగేయండి. ఆరోగ్యమే కాక మంచి నిద్ర కూడా వస్తుంది.
6. సలాడ్లు: బోర్ కొట్టే సలాడ్లు పగలే తినం, రాత్రి ఎలా అంటారా? తినాల్సిందే! మీరు ఎంతో ఆకలితో వున్నారు కనుక. కేరట్లు, బీట్ రూట్, కార్న్, కొత్తిమీర, మిరియం, ఫ్రిజ్ లో వున్న కొన్ని ఉల్లి రింగులు అన్ని కలిపి అందులో సాస్ లేదా మంచి పెరుగు వెసుకుని తినేయవచ్చు.
ఏదో ఒకటి అనుకుంటూ జంక్ ఫుడ్ తినేసేకంటే, ఈ తిండి పదార్ధాల చిట్కాలు పాటించటం అర్ధరాత్రి సైతం ఆరోగ్యకరమే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications