Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
తలనొప్పికి కారణాలు... తీసుకోవల్సిన జాగ్రత్తలు...
సాధారణంగా మనకు వచ్చే శారీరక నొప్పులలో తలనొప్పి ఒకటి. నేటిరోజులలో ఎవరికి తలనొప్పి లేని వారం లేదా నెల అనేది లేదనే చెప్పాలి. ప్రతిరోజూ కాకున్నా కనీసం వారానికోసారి లేదా నెలకు ఒక సారి చుట్టంలా తలనొప్పి ఏదో ఒక కారణంగా వచ్చే తీరుతుంది. క్షణం తీరికలేని జీవనం. నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. సమయానుకూలంగా నిద్ర, ఆహారం కరువయ్యాయి. నిలకడలేని ఆలోచనలతో యాంత్రిక జీవితం సాగిస్తున్నారు. ఫలితంగా తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి వ్యాధుల బారినపడుతున్నారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో బాధపడేవారిలో ఎక్కువ మహిళలే ఉన్నారు. అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పనిభారం ఫలితంగా వచ్చే తలనొప్పితో ఏ పనీ సరిగ్గా చేయలేక మదనపడుతున్నారు.
తలనొప్పి ఎక్కువైనప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పనిచేయడం కుదరదు. దీంతోపాటు వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. శబ్దాలు భరించలేకపోవడం, వెలుతురును సరిగ్గా చూడలేరు. కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇవీ తలనొప్పి లక్షణాలు. కొందరిలో తలనొప్పి ఒకే వైపునకు వచ్చి వేధిస్తుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపు నొప్పి (మైగ్రెయిన్) అంటారు. నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి తగ్గుముఖం పడుతుంది. నొప్పి భరించలేకుండా ఉండి తల దిమ్ముగా ఉంటుంది. ఏ తలనొప్పినైనా పెయిన్ కిల్లర్‌తో సరిపెట్టడం ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. తగిన విశ్రాంతి లేకపోవడం, ఎక్కువగా మద్యం, కెఫిన్ పదార్థాలు సేవించడం, పొగతాగడం, పని ఒత్తిడి వంటివి చిన్న కారణాలు కావచ్చు. ఇవి వారసత్వ లక్షణాలతో వచ్చేవి కావు. మన చేసే నిర్లక్ష్యం వల్లే వచ్చేవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తలనొప్పిని దూరం చేయవచ్చు....

తడి జుట్టు: తలస్నానం చేసిన తర్వాత తలను తడి బాగా అర్పకుంటే కూడా తలనొప్పికి గురికావాల్సి ఉంటుంది. తల జుట్టు తడిగా ఉండటం వల్ల తల మాడు అధికంగా చల్లగా చేస్తుంది. దాంతో తలనొప్పి వస్తుంది. తలనొప్పికి ఇదొక ముఖ్య కారణం. కాబట్టి తలస్నానం చేసిన ప్రతి సారి తలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అందుకు డ్రైయ్యర్ ను ఉపయోగించనవసరం లేదు. సహజంగా వీచే గాలిలో కొద్దిసేపు ఆరబెట్టుకొన్నా సరిపోతుంది.

ఎండలో బయట తిరగడం: తలకు హాట్ పెట్టుకొని బయట ఎండలో తిరగడం పర్వాలేదు. అయితే అతిగా వేడి తలకు తగిలినా కూడా తలనొప్పి రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఖాలీ కడుపుతో ఉండి ఎక్కువగా ఆకలి కలిగినప్పుడు, ఎండలో తిరగడం వల్ల అలసటకు గురియై తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి బాగా తిని సరైన రక్షక కవచాన్ని ధరించి బయట తిరిగాల్సి వస్తుంది.

డియోడరెంట్/ పెర్ఫ్యూమ్స్: ఉదాహరణకు ఎక్కువ సమయం పెర్ఫ్యూమ్ స్టోర్ లో నిలబడ్డా.. ఆ సువాసనలు మెదడుపై ప్రభావం చూపుతాయి. పరిమళభరితమైన సుంగధాలు ఎక్కువగా ఘాటుగా ఉండటం చేత తలనొప్పికి దారితీస్తాయి. కాబట్టి ఎక్కువ ఘాటు వాసనలున్న పెర్ఫ్యూమ్ జోలికి వెళ్ళకండి.

కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ స్ర్కీన్స్: ఎక్కువ సమయం అలాగే కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల కళ్ళకు ఒత్తిడి, అలసట ఏర్పడి తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి గంటకు ఒకసారి బ్రేక్ ఇవ్వండి. అప్పుడప్పుడు కను రెప్పలను కదిలిస్తుండాలి. యాంటీ గ్లేర్ స్ర్ర్కీన్ ఫిక్స్ సేఫ్ గార్డ్ చేయించుకోవడం వల్ల తలనొప్పిని అవాయిడ్ చేయొచ్చు.

టెలివిజెన్ స్క్రీన్: అదేవిధంగా ఎక్కువగా టీవీ చూడటం వల్ల కూడా కళ్ళు బాధిస్తాయి. కాబట్టి టీవీ చూడ్డానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. టీవికి దగ్గరగా కూర్చోకుండా ఉండాలి. టీవిలో వెలువడే కలర్ చాలా డార్క్ గా కనిపిస్తున్నట్లై వాటి రంగులను అడ్జెస్ట్ చేసుకోండి.

పడుకుని చదవడం: పడుకొని పుస్తక పఠనం చేయడం అంతి మంచిది కాదు. దాంతో మీ కళ్ళు మితిమీర అలసటకు గురివౌతుంది. కాబట్టి చదివేటప్పుడు ఎప్పుడూ కూర్చొని ఉండాలి. అలాగే చదివేటప్పుడు సరైన లైట్ వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

మరీ చల్లగా ఉండే కూల్ డ్రింక్స్/ ఐస్ క్యూబ్స్: చల్లని పదార్థాలు, అతి చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, ఐస్ క్యూబ్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ.

ఆల్కహాల్: అలాగే ఆల్కహాల్ కూడా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మెదడుపై, నాడీ వ్యవస్థపై ప్రభావం చూసి, తలనొప్పికి దారితీస్తుంది.

నిద్రలేమి: మీరు సరిగా నిద్రపోనట్లైతే, అది మిమ్మల్ని అందవిహీనంగా మార్చడమే కాదు, తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది . కాబట్టి కనీసం 7-8గంటల సేమయం గాఢంగా నిద్రపోవాలి. దాంతో నిద్ర లేవగానే మీ మైండ్ మరియు బాడీ రిలాక్స్ గా ఉండి ఏపనిచేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు.

లాంగ్ డ్రైవ్: ఎక్కువ సమయం ఎక్కువ దూరం మోటార్ సైకిల్లో ప్రయాణం చేయకపోవడం మంచిది. శీతాకాలంలో చల్లగాలులు, కఠినమైన గాలుల వల్ల, తేమ వల్ల, ఉదయాన్నే, లేట్ నైట్ లో ప్రయాణం చేయడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి అలా ప్రయాణం చేయాలన్నప్పుడు నోటినికి, ముక్కు, చెవులకు రక్షణ కవచంగా ఏదైనా ధరించి ప్రయాణానికి సిద్దం కండి.



Click it and Unblock the Notifications











