Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు!
మీ కొరకు మీరు సంతోషంగా వుండాలంటే ఎలా?

సంతోషం అనేది మీ మనసు లోతులలోనుండి వస్తుంది. అది మీలోపలనుండే రావాలి. కాని మనమంతా మనలను సంతోషపెట్టటానికి బయటి మార్గాలే ఆలోచిస్తాము. ఇతరులు మనలనుసంతోష పెట్టాలని, లేదా ధరించే దుస్తులు, ఖరీదైన చెప్పులు, ఐ ఫోన్లు, ఐ ప్యాడ్లు, కొత్త ల్యాప్ టాప్ లు వంటివి వుంటే సంతోషం ఇస్తాయని అనుకుంటాం. కాని ఈ వస్తువులు మీకు తాత్కాలిక సంతోషమే ఇస్తాయనేది మీకు తెలియదు. మీరు శాశ్వతంగా సంతోషంగా వుండాలంటే, అది కూడా మీ మనసు లోతులలోనుండి వుండాలంటే మొదటగా మీరు బలవంతంగానైనా సరే మీకు మీరు సంతోషంగా వుండటం నేర్చుకోవాలి. అది ఒక అలవాటు చేసుకోవాలి.
విషయాలు తేలికగా భావించండి !
మీ జీవితంలో చేసిన తప్పులన్నీ క్షమించేయండి. సోదరులతో తగవులు, తల్లితండ్రుల నిర్లక్ష్యం, మీ స్నేహితుడి వద్ద దొంగతనం, టీచర్లకు అబద్ధాలు చెపటం, ఏ అంశమైనప్పటికి చిన్నదైనా, పెద్దదైనా సరే మీకు మీరు క్షమించుకోండి. అదంతా సరి అని మీరు మానవ మాత్రులని నిర్ణయించుకోండి. సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ ప్రధాన విషయం ఏమంటే, తప్పు చేశానని మీరు గ్రహించాలి, పశ్చాత్తాప పడాలి. ఒకసారి మీరు ఈ పనిచేస్తే, చాలా తేలికగా మీకు అనిపిస్తుంది.
క్షమించండి...మరిచిపోండి
ఇతరులు మీ పట్ల తప్పుచేశారా, వారినిక్షమించేయండి. అది మీ గుండెలోనే వుండనీయండి. అంతకు మించిన శాంతి మీకు లేదు. పగలు వద్దు. పగ అంటే మీ తలపై ఎంతో భారంతో ఒక కొండమీద వున్నట్లే. బరువు అంతా దింపుకుంటే మీరు కొండ ఎక్కటం తేలిక. ముందుచూపు చూడండి. గతంలోకి చూడకండి.
విమర్శ చాలు...నిర్ణయించేది చాలు
నిర్ణయాలు చేయటం, విమర్శించటంఆపండి. ఈపనిచేస్తే బహుశ మీకు కొత్త స్నేహితులు కూడా ఏర్పడతారు. మీ సంతోషం పెంచుతారు. ఇది తప్పక ప్రయత్నించండి.
ఇవ్వండి !
మీదైన సమయాన్ని ఇతరులకివ్వండి.అనాధలకు సేవ చేయండి. మీ ఇంటిలో మీరు పనులు చేసుకున్నట్లే తేలికగా వారికి చేయండి. ఇతరులకు పనులు చేయటం చాలా సంతోషంగాను, సంతృప్తిగాను వుంటుంది.
సమస్యలు పరిష్కరించటంలో ఇబ్బందా?
సమస్యలు వున్నాయంటూ భావిస్తే అవి అధికమవుతాయి. ఇంకా పెద్దవిగా కనపడతాయి. అధికంగా ఆలోచిస్తూ కూర్చోకండి. సమస్యలున్నప్పటికి బిజీగా వుంటూ వాటి పరిష్కారం చేయండి. మీకుగల ఆస్తులైన మీ కుటుంబం, చుట్టుపక్కల వారికి మీపై గల ప్రేమ, ప్రస్తుతం మీకు గల వస్తువులు, మీ జీవిత విజయాలు గురించి ఆలోచించండి. వాటికి కృతజ్ఞులుగా వుండండి.
చిరునవ్వును ఆహ్వానించండి
ఏ పని చేస్తే మీకు చిరునవ్వు కలుగుతుందో ఆ పనులు ప్రతిరోజూ చేయండి. స్విమ్మింగ్, స్కేటింగ్, స్టాంప్ కలెక్షన్, రీడింగ్ వంటివి చేయండి. ఇతరులు చెప్పే దానికి అధిక శ్రద్ధ పెట్టకండి.
మీ పట్ల ఇతరుల అభిప్రాయాలకు అధిక విలువనివ్వకండి. వారు చెప్పేది వినండి. వాటిలో విలువ వుంటే గ్రహించండి. విమర్శలు, పక్షపాతాలు వద్దు. అవసరమైన మేరకు విని బయటకు వచ్చేయండి.
మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. ఒక సారే మీరు జీవిస్తారు. దానిని పూర్తిగా వినియోగించండి. మీ కలలు వాస్తవాలు చేసుకోండి. ఇక మీరెప్పటికి పశ్చాత్తాపపడరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications