Latest Updates
-
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా!
నోటి పూతను పోగొట్టే సులభమైన చిట్కాలు...
నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది. అది ఏమిటి అంటారా? చూడండి.... అపుడప్పుడు కొందరికీ నోటి పూత వస్తుంటుంది. నోటి పూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు, ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. నాలిక పైనఅంతా చిన్ని చిన్ని పుండ్లు కూడా వస్తాయి.
నోటి పూతకు కారణాలు: ముఖ్యంగా నోటి అపరిశుభ్రత. ధూమపానం, మద్యపానం అలవాటు. నోటి అపరిశుభ్రత. సరిగ్గా పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం. వ్యాధి నిరోధకశక్తి క్షీణించి నోట్లో వుండే సూక్ష్మక్రిములు బాగా అభివృద్ధి చెందినప్పుడు. కొన్ని దీర్ఘకాల వ్యాధులు. ఫంగల్, బ్యాక్టిరియల్, వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల. జీర్ణాశయ, పేగుల వ్యాధుల వల్ల. మరికొందరిలో మలబద్ధకం వల్ల. ఎక్కువ ఆందోళన చెందడం. ఆడవారిలో నెల సరి వచ్చే ముందు రోజుల్లో. మధుమేహం, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌లలో ఎక్కువ కార్టిజోన్ మందులు వాడేవారిలో. జీర్ణవ్యవస్థ లోపం వల్ల బి-కాంప్లెక్స్ (నియాసిన్, రిబోఫ్లేవిన్ పోలిక్ యాసిడ్, బి-12 ఐరన్ జింకు) శరీరానికి సరిపాళ్ళలో అందకపోడం వల్ల ఈ నోటి పూత ఏర్పడుతాయి. కనుక ఎంతైనా మన నోరును మన జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా.

తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. విటమిన్లు, పోషకపదార్థాలు సరిగ్గా లేక నీరసించి వున్నవాళ్ళు బి-కాంప్లెక్స్ (నియాసిన్, ఫోలిక్ ఆమ్లం, రిబోఫ్లేవిన్ బి12 జింకు, ఐరన్ కలిగిన) మాత్రలు వాడాలి.
2. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వుంటే మెట్రోనిడియోజాల్ 200 మిల్లీగ్రాములు రోజుకు మూడేసి, ఫంగస్ వుంటే నిస్టాంటిన్ లాజెంజెస్, క్యాడిడ్ లోషన్ లేక జెల్లి అంటించాలి.
3. నోటిని పరిశుభ్రతగా వుంచాలి. చిగుళ్ళ వ్యాధికి తగు చికిత్స చేయించాలి.
4. క్లోర్‌హెక్సిడిన్ మౌత్ పెయింటు వాడాలి.
5. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి.
6. ఆందోళనను నియంత్రించుకొని ప్రశాంత జీవన శైలి అలవర్చుకోవాలి.
7. జీర్ణాశయప్రక్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలి.
8. ధూమపానం, మద్యపానం మానాలి. కిళ్లీ, జర్దా, పాన్ పరాగ్ వాడకం మానాలి.
9. అవసరాన్ని బట్టి హైడ్రోకార్టిజోన్ లాజెంజెస్ గాని, బిళ్లలుగాని డాక్టరు సలహా మేరకు కొద్ది రోజులే వాడాలి. కొన్ని వ్యాధులు (ఎయిడ్స్, మధుమేహం వంటివి) కొన్ని మందుల వల్ల కల్గితే, రక్తంలో దోషముంటే వాటికి తగిన చికిత్స చేయించాలి.
10. ప్రతి రోజు ఉదయం పరకడుపున ఉప్పు కలపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కలించండి.
11. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి.
12. బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి. దీంతో మంచి ఫలితముంటుందంటున్నారు వైద్యులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
