Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
జబ్బుల నుండి త్వరగా కోలుకోవటం ఎలా?

జబ్బు పడినపుడు త్వరగా కోలుకోవటానికి చర్యలు 1. బాగా విశ్రాంతి తీసుకోండి - మీరు జబ్బుగా వున్నపుడు అధికంగా పని చేయాల్సిన అవసరం లేదు. ఎంత విశ్రాంతి తీసుకోగలిగితే అంత బాగా తీసుకోండి. విశ్రాంతి తీసుకుంటేనే గాని మీ శరీరం బలం పుంజుకోదు. కనుక, బలం పుంజుకునేటంతవరకు బయటి ప్రదేశాలు తిరగకండి.
2. బలానికి విటమిన్లు తీసుకోండి - పెద్ద జబ్బు తర్వాత శరీరంలో విటమిన్ల కొరత వుంటుంది. సరిగా ఆహారం మీరు తినలేరు. అది మీలోని విటమిన్లు లవణాలు ఖర్చు చేస్తుంది. మలేరియా వంటి వ్యాధులు మీ శరీరంలోని హేమోగ్లోబిన్ ను పూర్తిగా ఖర్చు చేస్తాయి. కనుక మీరు ఐరన్ మాత్రలు తీసుకోవాలి. మీ సాధారణ ఆరోగ్యం రావాలంటే విటమిన్లు తప్పని సరిగా తీసుకోవాలి.
3. బలంకల ఆహారం తీసుకోండి - చికెన్ సూప్, గుడ్లు, పాలు, వంటి ఆహారాలు మీకు బలాన్నిస్తాయి.
ప్రొటీన్ పౌడర్ లేదా ఫైబర్ బిస్కట్లు వంటివి కూడా తిని త్వరగా బలం పొందవచ్చు. ఆహారం పూర్తిగా ప్రొటీన్లు అధికంగా వుండేదిగా వుండాలి. ఇవి తింటే త్వరగా కోలుకుంటారు.
4. జీర్ణక్రియ సమస్యలు లేకుండా చేసుకోండి. జబ్బు పడినపుడు జీర్ణక్రియ మందగిస్తుంది. జబ్బునుండి కోలుకొన్న తర్వాత, ముందుగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తినాలి. మసాలాలు తినరాదు. కొద్ది కొద్దిగా తక్కువ వ్యవధిలో తినండి. మీరు జబ్బు కొరకు వేసుకున్న మందులు ఘాటైనవి అవి మీ పొట్టలోని జీర్ణ వ్యవస్ధను బలహీన పరుస్తాయి. పెరుగులో మంచి బాక్టీరియా వుంటుంది. అది మీ ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. కనుక తగినంత పెరుగు తినండి. మీ పొట్టలో మరోమారు మంచి బాక్టీరియా పుడుతుంది.
5. సోమరిగా వుండకండి. చాలా రోజులు ఇంటిలో వుంటారు కనుక సోమరి అయ్యే అవకాశం వుంది. త్వరగా మరోమారు చురుకు పుట్టాలంటే, చురుకుగా వ్యవహరించండి. విశ్రాంతి తగినంత మాత్రమే తీసుకోవాలి. సాధారణ పనులైన మీ దుస్తులు మీరు మార్చుకోవడం వంటివి చేస్తూ ఉత్సాహం ప్రదర్శించాలి.
మీకు కనుక మరిన్ని ఇతర కోలుకొనే చిట్కాలు తెలిస్తే మాకు వ్రాయండి. మీ భావాలు మాతో పంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
