Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మానసిక ఒత్తిడిని దూరం చేసే ఐస్ థెరఫీ...

ఐస్ క్యూబ్స్ తో చల్లచల్లని పానీయాలు తాగడమే కాదు..హట్‌హాట్‌గా ఇంటికి వచ్చిన వారి మానసిక స్థితిని కూల్‌గా చేసే థెరపీ ఐస్ లో దాగి ఉంది. ఇలా చేసి చూడండి..మీరు కూడా ఐస్ అయ్యిపోతారు.ఈ ప్రక్రియనే ఐస్ థెరపీ అంటారు. అయితే పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సేపు ఈథెరపీని చేయకూడదు.
1. ఐస్ ప్యాక్: తలనొప్పి తగ్గడానికి ఐస్ ప్యాక్ కూడా ఉపకరిస్తుంది. ఒక శుభ్రమైన టవల్ లో చల్లగా ఉండే ఏదైనా వస్తువును చుట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ కాసేపు పెట్టుకుంటే సరి. నొప్పి మాయమవుతుంది.
2. పని ఒత్తిడితో తలనొప్పిగా ఉన్నప్పుడు ఐస్‌ను ముక్కలుగా చేసి వస్త్త్రంలో వేసి నుదురుమీద ఉంచితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
3. ఐస్ ముక్కలను కనురెప్పల మీద కాసేపు ఉంచితే మన శరీరం, మనసు ఉత్తేజిత మవుతాయి.
4. చర్మానికి ఇది మంచి యాంటీ ఏజింగ్ కారకంలా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఐస్‌ను రుద్దడంవల్ల ముఖం శుభ్రపడి కాంతి వంతంగా కనిపిస్తుంది. ముటిమలకు వాటి మచ్చలకు ఒత్తిడికి ఐస్ థెరపీ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
5. ఐస్‌ను శుభ్రమైన వస్త్త్రంలో తీసుకోవాలి. చుబుకం మీద వలయాకారంలో రుద్దుతూ నెమ్మదిగా ముఖమంతా అప్లై చేయాలి. మొటిమలున్న ప్రాంతంలో నెమ్మదిగా ఒత్తిపెడుతూ ఐస్ ఉంచాలి. ఇలా ఓ క్రమ పద్ధతిలో చేస్తేకొన్ని రోజులకు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
6. ఐస్ క్యూబ్స్ డైరెక్ట్ గా ఉపయోగించడం ఇబ్బందికరమైతే, ఐస్ బ్యాగ్ లేదా ఒక కటాన్ క్లాత్ లో ఐస్ క్యూబ్ ను పెట్టి మసాజ్ చేసుకోవచ్చు.
7. ఐస్ క్యూబ్స్ చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఐస్ క్యూబ్ మసాజ్ చేయడం వల్ల చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. ముఖంలో, కళ్ళ క్రింద ముడుతలను పోగొడుతుంది. చర్మంలో నున్న రంధ్రాలను పూడ్చివేస్తుంది. ఐస్ క్యూబ్స్ మొటిమలు, మచ్చలను పోగట్టడమే కాకుండా ఎండ వేడిమి నుండి రక్షణ కల్పిస్తుంది. బయట నుండి ఇంటికి రాంగానే ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకొంటే ఎంతో హాయిగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
