Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు -
చుక్క నూనె లేకుండా పాపడ్, చిప్స్ వేయించొచ్చు..సెలబ్రిటీ చెఫ్ సీక్రెట్ ట్రిక్! -
గుండె పదిలం, కండరాలు దృఢం.. 30 ఏళ్లు దాటిన మగవాళ్లు రోజూ తినాల్సిన అద్భుతమైన గింజలివే -
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
పొట్టలో గ్యాస్ కలిగించే ఆహారాలు!

- నూనెలు, కొవ్వులు అధికంగా వుండే పదార్ధాలు అజీర్ణం కలిగించి పొట్టలో గ్యాస్ పుట్టిస్తాయి. పొట్టలోని నూనె నిల్వలు యాసిడ్ అధికం చేస్తాయి. బర్జర్లు, ఫ్రెంచి ఫ్రై, పొటాటో చిప్స్, పకోడాలు, బటర్ కుకీలు, గ్రిల్ మీట్ లేదా స్నాక్స్ వంటివి తినకండి.
- మసాలాలు బాగా దట్టించిన పదార్ధాలు కూడా అజీర్ణం గ్యాస్ కలిగిస్తాయి. ఛాట్ మసాలా, చిల్లి పౌడర్ వంటివి వాడిన పదార్ధాలు గుండె నొప్పి వరకు సమస్యలిస్తాయి.
- కేబేజి, ముల్లంగి వంటివి ఆరోగ్య కరమైనా, అజీర్ణం, గ్యాసు పుట్టిస్తాయి. వీటిని బాగా ఉడికించాలి. అపుడు అజీర్ణం కలిగించకుండా వుంటాయి.
- తరచుగా మీరు తాగే కాఫీ, టీలు కూడా గ్యాస్ పుట్టించి గుండెమంట కలిగిస్తాయి. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో వీటిని తాగకండి.
- కూల్ డ్రింకులు, సోడాలు పొట్టను వాటిలోని గాలితో నింపి గ్యాస్ పుట్టిస్తాయి.
డైరీ ఉత్పత్తులలో పాలు అజీర్ణం తేలికగా కలిగిస్తాయి.
- పప్పులు కూడా అజీర్ణం కలిగిస్తాయి. మీ పొట్ట కనుక వీటిని జీర్ణం చేసుకోలేకుంటే, వీటిని తినటం మానండి.
మరి ఆరోగ్యకరంగా ఎల్లపుడూ తినదగిన ఆహారాలేమిటి?
అలసి పోయినట్లు, నీరసపడ్డట్లు భావిస్తూంటే, దేనిపైనా ఆసక్తి చూపకపోతే, మీ శరీరంలో కొన్ని బి విటమిన్లు లోపించాయని చెప్పాలి. ఈ విటమిన్లు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటానికే కాక కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్ గా మార్చి శరీరానికి ఇంధనం చేకూరుస్తాయి. ఉదయం వేళలో ఒక కప్పుడు ఓట్స్ తింటే అవసరమైన బి విటమిన్ శరీరానికి చేకూరుతుంది.
డార్క్ చాక్లెట్ లో గుండెకు శరీరానికి మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అవి మీ మూడ్ ను కూడా హేపీగా మార్చేస్తాయని తాజాగా పోషకాహార నిపుణులు చెపుతున్నారు. కనుక మీ శరీరంలోని రసాయనాలను ఉత్తేజపరచాలంటే ఒక డార్క్ చాక్లెట్ తినండి.
బీట్ రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాదు అధికమైన తక్షణ ఎనర్జీ కూడా ఇస్తుంది. ఇందులో షుగర్ అధికంగా వుండి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, నైట్రేట్ వంటివి కూడా వుంటాయి. బీట్ రూట్ ఏ రూపంలో తిన్నప్పటికి ఆరోగ్యమే.
అన్నిటికి మించి ప్రతిదినం శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవటం కూడా అజీర్ణానికి దోవతీసే అవకాశం వుంది. కనుక ఆరోగ్యకర ఆహారాలు తీసుకుంటూ తగినంత వ్యాయామం ప్రతిదినం చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications