Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్ర గురించిన ఆసక్తికర అంశాలు!

నిద్రలోని అన్ని దశలలోను కలలు వస్తాయి-
మొదటిలో రీసెర్చర్లు ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ లేదా రెమ్ అనబడే నిద్రా దశలోనే కలలు వస్తాయనుకునేవారు. కాని తర్వాత వారు రీసెర్చి మేరకు నిద్రలోని అన్ని దశలలోను మానవులు కలలు కంటారని తెలిపారు. ఈ రెమ్ దశలో, మనం దినచర్యలో అనుభవించిన ఆలోచనలు, భావనలు, ఉద్రేకాలు మొదలైనవి వస్తాయి.
అలారం అందరకు అవసరంలేదు-
కొంతమందికి ఉదయమే లేవాలంటే అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారి శరీరంలో అంతర్గతంగా ఒక అలారం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు సాధారణంగా అడ్రినోకోర్టిసోటోఫిన్ అనే ఒత్తిడి హార్మోన్ కారణంగా లేస్తారట. రేపు ఒక మీటింగ్ ఉదయమే ఉన్నది అంటే చాలు, వీరి శరీరం ఈ హార్మోన్ సహాయంతో ఎన్ని గంటలకు లేవాలంటే అన్ని గంటలకు నిద్ర లేస్తుంది.
పిల్లలు, యుక్తవయసువారు ఒకే సమయం నిద్రించాలి-
టీనేజర్లను నిద్రలేపటం ఎందుకు కష్టం? ఎందుకంటే, వారికి కూడా పిల్లలవలే 10 గంటల నిద్ర అవసరం. కాని పెద్దలు 8 గంటలు నిద్రిస్తే చాలు ఫిట్ గా వున్నట్లే.
బ్రెయిన్ అసలు నిద్రపోదు -
శరీరం అలసట చెందవచ్చు, నిద్రపోవచ్చు. కాని బ్రెయిన్ మాత్రం పనిచేయటం ఆపదు. మనం నిద్రిస్తున్నంత సమయం బ్రెయిన్ మన శరీరంలోని అవయవాలను అంటే, శ్వాస సంబంధిత అవయవాలను పనిచేసేలా చూస్తూంటుంది.
అవిశ్రాంతిగా నిద్రిస్తే ప్రమాదం-
నిద్రించేసమయంలో కొంతమంది హాయిగా పడుకోలేరు. నిద్రలో కూడా వారు అటు ఇటు పొర్లుతారు. వారిని వీరిని తంతూంటారు. రీసెర్చి మేరకు ఇటువంటి వారికి నరాల సంబంధిత జబ్బులు అంటే పార్కిన్ సన్ వ్యాధి వంటివి ముసలితనంలో వస్తాయట.
నిద్ర సరిగా లేకుంటే ఏకాగ్రత దెబ్బతింటుంది -
నిద్ర తగినంత సమయం పోవాలి లేదంటే ఏకాగ్రత దెబ్బతినటం, సమస్యలను వారు సరిగా పరిష్కరించలేకపోవటం జరుగుతుంది. విషయాలను తేలికగా మరచిపోతూంటారు. నిద్రించే భంగిమ సరిలేకుంటే అందాన్ని పాడు చేస్తుంది. ముఖాన్ని దిండుపై పెట్టుకొని పడుకుంటే, ముఖానికి గీతలు పడి త్వరలో ముడుతలు వచ్చే అవకాశం ఉంటుంది.
నిద్రలేమి, రోడ్లపై యాక్సిడెంట్లు కలిగిస్తుంది, అధిక రక్తపోటు, డయాబెటీస్, డిప్రెషన్, ఊబకాయం వంటి వ్యాధులను పెంచుతుంది. నిద్ర లేమి పురుషులకంటే కూడా స్త్రీలను బాగా ప్రభావితం చేస్తుంది. మరి ఇన్ని రకాలుగా చెడు కలిగించే నిద్ర లేమినుండి దూరం అవ్వాలంటే, ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రకు తగిన సమయం కల్పించి, సరైన భంగిమలో, సరైన ప్రదేశంలో నిద్రించి శారీరక, మానసిక ప్రయోజనాలు పొందటం ఎంతో ప్రాధాన్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications