Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
ఆరోగ్యాన్ని... సౌందర్యాన్ని బేషుగ్గా ఉంచే జ్యూస్ థెరపి
ముఖ్యంగా మనిషి, శరీర సంరక్ష, చర్మ సంరక్షణలో ఎన్నెఎన్నోపద్దతులను వాడతుంటారు. అందులో బాగాలే వాటర్, అరోమా, ఆయిల్ థెరపిల్లాంటిది మరొకటుంది. అదేంటంటే జ్యూస్ థెరపి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఎంత ఒత్తిడినైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. అయితే, ప్రతినెలా మూడు రోజుల చొప్పున దీన్ని ఆచరించాలి. జ్యూస్ థెరపి శరీరంలోని కణాల్ని శుభ్రపరుస్తుంది. కణాల్లో లోపాలుంటే వాటిని సరిదిద్దుకునే శక్తినిస్తుంది. జ్యూస్ థెరపిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనినే ‘డి టాక్స్ జ్యూస్ ఫాస్టింగ్' అని కూడా అంటారు. ఆరోగ్యకమరైన శీరానికి మరియు ప్రకాశించే చర్మానిక భరోసా పండ్లు మరియు కూరగాయలే...
ముఖ్యంగా నగరాల్లో జీవించే వారిలో చాలామందికి ఒత్తిడిలో కూడిన జీవన విధానం వల్ల సరిపడా నిద్ర ఉండదు. అలాగే జంక్‌ఫుడ్స్, నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ వాడకం వంటివి పెరిగాయి. జంక్‌ఫుడ్స్ ద్వారా విషపదార్థాలు శరీరంలోకి చేరతాయి. వీటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. అందుకే నెలలో మూడు రోజులపాటు జ్యూస్ థెరపీ చేయాలి. ఈ థెరపిలో మనం చేయవలసింది ఈ మూడు రోజులు ఘనాహారాన్ని తీసుకోకుండా అన్ని రకాల జ్యూస్‌లను తీసుకోవడమే. దీన్ని ప్రతి నెలా ఒక క్రమంగా ఆచరిస్తే మంచి ఫలితాలిస్తాయి.
అసలు జ్యూస్ థెరపికి ముందు ఆచరించేవారు మానసికంగా సిద్ధపడాలి. అప్పుడు ఆకలివేస్తున్న భావన మిమ్మల్ని వేధించదు. ఇది ప్రారంభించే వారం ముందునుంచి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. జంక్‌ఫుడ్స్, అధిక కాలరీలున్న ఆహారాన్ని మానేయాలి. పిండి, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాలు, సిగరెట్లు, కాఫీ, చాక్‌లెట్లు, నొప్పి నివారణులు, మత్తుమందులు, యాంటీ బయాటిక్స్ వంటివి వాడకూడదు. మూడు రోజులు డీటాక్స్ జ్యూస్ ఫాస్టింగ్‌కు పని ఒత్తిడి ఎక్కువగా ఉండని నెలలో ప్లాన్ చేసుకోవాలి.

యాపిల్ జ్యూస్: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్‌లు రాకుండా నివారిస్తుంది.

గ్రేప్ జ్యూస్ (ద్రాక్షరసం): ఇది అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. ధమనుల గోడలకు విశ్రాంతినిచ్చి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కార్డియోవాస్కులార్‌ను సంరక్షిస్తుంది.

బొప్పాయి జ్యూస్: జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని తగ్గిస్తుంది. యాంటి బయాటిక్ మందులు వాడిన తర్వాత శరీరంలోని మంచి బాక్టీరియా నశిస్తుంది. దాన్ని తిరిగి ఏర్పరిచేందుకు బొప్పాయి జ్యూస్ ఉపయోగపడుతుంది.

లెమన్ జ్యూస్ (నిమ్మరసం): బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మలబద్ధకాన్ని, డయేరియాను అదుపులో ఉంచుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండటంవల్ల రక్తపరిశుభ్రతకు పనిచేస్తుంది. కడుపులో వాయువు, మంటను తగ్గిస్తుంది. ఆకలిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కీళ్ళనొప్పులకు, వాతానికి, రక్తపోటుకు, శరీరంలోని వేడిని తగ్గించడానికి నిమ్మరసం దోహదపడుతుంది.

క్యారెట్ జ్యూస్: దీనిలోని ప్రొ విటమిన్-ఎ, కెరొటిన్‌లు కాలేయానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. పొట్టలో అల్సర్లను నివారిస్తుంది. ప్రధానంగా కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

కుకుంబర్ జ్యూస్: అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. దోసకాయ రసం ఇది కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

టొమాటో జ్యూస్: గుండె జబ్బులకు కారణమయ్యే హైపరాక్టివ్ ప్లేట్‌లెట్లను తగ్గిస్తుంది.

బీట్ రూట్ జ్యూస్: రక్తాన్ని వృద్ధిపరుస్తుంది. మంచి శక్తినిస్తుంది. దీనిలో ఉన్న బీటా పొట్టను, పేగులను శుభ్రం చేస్తుంది.

తోటకూర రసం: పచ్చి తోటకూర జ్యూస్‌ను అన్నం తినడానికి ముందు రోజుకి రెండుసార్లు తీసుకుంటే రక్తంలో చక్కెర మోతాదు అధికంగా ఉంటే తగ్గిస్తుంది.

ఉసిరి రసం: ఉసిరి జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమపరుస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
జ్యూస్ థెరపి వల్ల శరీరంలో పెరుకొన్న అనవసరమైన కొవ్వు, వ్యర్థ పదార్థాలను, శరీరం నుండి బయటకు పంపబడుతుంది. శరీరంలోని వివిధ అవయవాలకు విశ్రాంతిని కలిగిస్తుంది. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చూసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసినంత శ్రేయస్సు మరియు శక్తి నిస్తుంది. జ్యూస్ థెరపి ఆరోగ్యాన్ని మెరుగు పచడానికి మాత్రమే కాదు, ఇది రోగనిరోధక శక్తిని పెంచి నాడీ వ్యవస్థ బాగా మెరుగు పడేలా చేస్తుంది. లివర్ కు సంబంధించిన రక్తాన్ని సుద్ది చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను రాయనియ్యకుండా అందుకు కారణం అయ్యే రాడికల్ డ్యామేజ్ ను తగ్గింస్తుంది.
థెరపిలో భాగంగా రోజుకి ఐదారుసార్లు రకరకాల జ్యూస్‌లు తాగాలి. నిమ్మరసంతో మొదలుపెట్టాలి. రెండు గ్లాసుల నిమ్మరసం తాగిన తర్వాత కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. తరువాత బత్తాయి రసం తాగాలి. టమాటో, కారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లను మధ్యాహ్నం భోజనానికి రెండు, మూడు గంటల ముందు ఇవి తీసుకోవాలి. మధ్యాహ్నం పుచ్చకాయ, సాయంత్రం తోటకూర లేదా దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు బత్తాయి, యాపిల్, ద్రాక్షలను కలిపి జ్యూస్ చేసి తాగాలి. ఇలా మూడు రోజుల పాటు ఆచరించాలి. తర్వాత రోజుల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంతో పాటు జ్యూస్‌లు కూడా రోజుకు ఒకటి, రెండు సార్లు తాగాలి. తర్వాత అలవాటు పడ్డ ఆహారం తీసుకున్నా, శరీరంలోకి విషపదార్థాలు మాత్రం చేరకుండా జాగ్రత్తపడాలి. పౌష్టికాహారం తినడంవల్ల శక్తి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ థెరపీలో ఏయే జ్యూస్‌లు ఎలాంటి ఆరోగ్యాన్ని యిస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.



Click it and Unblock the Notifications