Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
ఉప్పు తొలగిస్తే.. ఆరోగ్యం అద్భుతం..?

ఉప్పు అధికంగా మానదగిన ఆహారాలు -
సాస్ - అది సోయా సాస్ లేదా చింతపండు సాస్ లేదా మరో సాస్ కావచ్చు, ఈ సాస్ లలో ఉప్పు కావలసినదానికంటే కూడా అధికంగా ఉంటుంది. కనుక మీరు సాస్ లు వదిలివేయండి. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది.
నిలవ పచ్చళ్ళు - ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, చింతకాయ వంటి పచ్చళ్ళు సవంత్సరం అంతా ఉండాలంటూ వాటిలో అధిక ఉప్పు చేర్చి తయారు చేస్తారు.కనుక వీటిలో ఉప్పు అధికమే. అంటే, సోడియం కావలసినదానికంటే అధికంగా వాటిలో వుండి మీకు హాని కలిగిస్తాయి. కనుక ఈ నిలవ పచ్చళ్ళను ఎపుడైనా తినాలి. అపుడు కూడా అతి తక్కువ మొత్తంలో తినాలి. వీటిలో ఉండే అధిక ఉప్పు మీరు కొంచెం తిన్నా సరే ఎంతో హానికలిగిస్తుంది.
ఛీజ్ - కాటేజ్ ఛీజ్ చాలా ఉప్పగా ఉంటుంది దీని వినియోగం నియంత్రించండి. శరీరంలో సోడియం స్ధాయిలను ఇది అధికం చేస్తుంది.
స్నాక్స్ - ఉప్పు, కారం చేర్చిన వివిధ చిరుతిండ్లు తినటానికి ఎంతో రుచి. కాని అవి హాని. పాప్ కార్న్, ఛీజ్ బాల్స్, వంటి వాటిలో సోడియం అధికం. కనుక, ఈ ఆహారాలు వదిలేయండి. తినాలనుకున్నపుడు వాటిలో అతి తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోండి.
ప్రాసెస్ చేసిన మాంసం - బేకన్, డెలి మీట్, సాసేజ్, సలామి వంటి మాంసాలు అధిక ఉప్పు కలిపి దీర్ఘకాలం నిలువ చేస్తారను. డబ్బాలలో నిలువచేసే మాంసంలో ఉప్పు ఎక్కువ కలుపుతారు. కనుక, మీరు మాంస ఉత్పత్తులు డబ్బాలలోవి కొనాలనుకుంటే, వాటిపై కల లేబుల్ చదివి కొనండి. లేదా మాంసాహార తిండ్లు, అప్పటికపుడు తయారు చేసి ఉప్పు తక్కువగా తినండి.
డబ్బాల ఆహారం - చాలామంది బిజీగా ఉండే ఉద్యోగస్తులు, వంటకు అధిక సమయం పడుతుందంటూ వండిన ఆహారాలను రెడీగా డబ్బాలు అంటే టిన్ లలో వుండేదానిని కొంటారు. ఇవి కొనేటపుడు వాటిలోని ప్రొటీన్లు, పోషకాలు లేబుల్ చదివి పరిశీలించండి. ఈ రకంగా డబ్బాలలోని ఆహారం ప్రతిరోజూ తినరాదు. కార్న్, కూరగాయలు వంటి వాటిలో కూడా సోడియం అధికం. కనుక కేన్ డు ఆహారాలు రోజూ తినవద్దు.
ఆహారంలో సోడియం అధికమైతే అది శరీరానికి హాని. తక్కువైతే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కనుక సోడియం ఆహారంలో తగినంత మాత్రమే తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
