Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
మగమహారాజులు... రోడ్ సైడ్ రోమియోలు మేల్కోండి...!
మగమహారాజులు...రోడ్ సైడ్ రోమియోలు... రోడ్లలో ఎక్కడబడితే అక్కడ పొగత్రాగుతుంటారు. వారిని చూసి మనం చాలా అసహ్యించుకుంటుంటాం. ఎందుకంటే వారు వారి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే కాకుండా...ఇతరుల ఆరోగ్యాన్ని పాడుచేస్తూ.. వాతావరణ కాలుష్యానికి కారకులు అవుతుంటారు కాబట్టి. అయితే అదే సమయంలో అదే పబ్లిక్ లో మహిళలు స్మోక్ చేస్తూ కనబడితే? మనకు ఒక రకమైన జీర్ణించుకోలేటువంటి ఒక అనుభూతి చెందుతాం. ఒక్క క్షణం మనస్సు నిశ్శబ్దానికి గురివౌతుంది. ‘ఆమె ఆడదేనా లేదా త్రాగుబోతా'?. ఆ విధంగా ధూమపానం పురుషుల కంటే స్త్రీల కోసం సామాజిక నిషేధం కలిగి ఉండాలి.
ఇన్ని అనర్ధాలకు గురిచేసే అటువంటి వారిని చీదలించుకోవడానికి ముందు... పురుషుల కంటే స్త్రీలు పొగత్రాగడం వల్ల ఎటువంటి అనర్థాలు ఎదుర్కోవల్సి వస్తుందో.. వాటికి సంబంధించిన వాస్తవాలను కొన్నింటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. పురుషులకు లేదా మహిళలకు పొగ త్రాగడం వల్ల ఎంత హానికరమైందో.. శరీరానికి ఎలా హానీ చేస్తుందో తెలియజేసి సామాజిక నిషేధం పాటించి ఆ అలవాటును మాన్పించేలా చేయాలి? మరి అనర్థాలకు దారితీసే వాటిగురించి తెలుసుకుందాం...

ఊపిరితిత్తులకు నష్టం: పొగత్రాగడం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. మరీ ఎక్కువగా త్రాగేవారైతే లివర్ పాడయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. లివర్ పాడైనా కూడా మీరు జీవించడానికి అవకాశం ఉంది ఎందుకంటే లివర్ తనంతటతాను తిరిగి పునఃసృష్టించుకోగలదు. అయితే ఒక్కసారి దెబ్బతిన్న ఊపిరితిత్తులు డ్యామేజ్ అయితే వాటిని ఎప్పటికీ బాగు చేయలేం. కాబట్టి లివర్ డ్యామేజ్ అనేదే స్త్రీ పురుషులనే లింగనిర్ధారణ మీద ఆధారపడి ఉండుదు. ఎవ్వరికైనా ప్రమాదమే...
క్యాన్సర్: పొగాకు క్యాన్సర్ కు గురిచేస్తుంది. పొగాకు ఆరోగ్యానికి హానికరం..అని పెద్ద అక్షరాలతో సిగరెట్ ప్యాకెట్స్ మీద రాసుండటం గమనించే ఉంటారు. అయినా కూడా స్త్రీ, పురుషులు వాటిని లెక్క చేయకుండా ధూమపానాన్ని కొనసాగిస్తుంటారు. పొగాకులో ఉన్న క్యాన్సర్ ఉత్ప్రేరకాలైటువంటి నికోటిన్ అనేది శరీరం అంతటా వ్యాపించి క్యాన్సర్ ను వృద్ధి చేసి నోటికి, గొంతు, ఊపిరితిత్తులను క్యాన్సర్ బారీన పడేట్లు చేస్తుంది.
పొగత్రాగడం-గర్భాధారణ: గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు. పక్కనుండే వాళ్లు పొగత్రాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది.దీని వల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగత్రాగడం వల్ల త్రాగేవారికి అనారోగ్యం కలుగుతుంది. అంతేకాదు, వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు ప్రక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు, వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలలాంటివి వస్తాయి.
ధూమపానం మరియు స్పెర్మ్ కౌంట్: పురుషుల వీర్యకణాలు తగ్గడానికి ముఖ్యకారణం పొగత్రాగడం. పొగత్రాగడం వల్ల వీర్యకణాలు జీవం కోల్పోవడం లేదా చురుకుగా ఉండకపోవటం జరగుతుంది. దాంతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అంతుంది. కాబట్టి స్మోకింగ్ కూడా మనిషిని నపుంసకుడుని చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలకు కలగడానికి స్త్రీలైనా పురుషులైనా పొగత్రాగడం మానేయం చాలా మంచిది.
స్మోకింగ్-హర్మోనుల అసమతుల్యత: పొగత్రాగడం వల్ల స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ హార్మోనుల అసమతుల్యతకు కారణం అవుతుంది. దాంతో పురుషులు అందవిహీనంగా మారడం, జుట్టును కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. స్త్రీలలో హార్మోనల్ సమస్య వల్ల బురుక్రమంలో తేడాలు సంభవిస్తాయి. నిద్రలేమితో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి స్త్రీలకైనా పురుషులకైనా స్మోకింగ్ చేయడం వల్ల ఇన్ని అనార్థాలు దారితీస్తుందని గమనించి పొగత్రాడానికి ఈ రోజే చెక్ పెట్టండి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించండి...
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications