Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
రెడ్ మీట్ అనారోగ్యకరమా?
మాంసాహారులు మంచి జ్యూసీ గా ఉండే మాంసం స్టిక్ లు తినేందుకు ఇష్టపడతారు. కాని రెడ్ మీట్ అనేది తరచుగా అనారోగ్యకరమైన ఆహారంగా భావిస్తూ ఉంటాం.
కొంతమంది రెడ్ మీట్ ను శరీరానికి మంచిదిగా భావించినప్పటికి చాలామంది దీనిని అనారోగ్యకర తిండిగానే భావిస్తారు. రెడ్ మీట్ లో ప్రొటీన్లు, మినరల్స్ బాగా ఉంటాయి. కాని ఒక తాజా స్టడీ మేరకు రెడ్ మీట్ అధికంగా తింటే అది మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుందని తేలింది. అయితే, కోడి సంబంధిత ఉత్పత్తులు తింటే అది మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుందని కూడా తేలింది. కనుక రెడ్ మీట్ అనేది ఏ రకంగా మనకు అనారోగ్యం కలిగిస్తుందనేది పరిశీలించండి.

గుండె జబ్బుల వెనుక గల కారణాలు - రెడ్ మీట్ అధికంగా తింటే గుండె జబ్బులు వస్తాయి. వాటిలో శాట్యురేటెడ్ కొవ్వు ఉంటుంది అది మీ గుండె ఆర్టరీలను బ్లాక్ చేస్తుంది. మొండి జబ్బులను కలిగిస్తుంది. రెడ్ మీట్ పూర్తిగా తినేసి వుండటం జరుగరాదు. అన్నం, వెన్న, ఛీజ్ వంటివి కూడా శాట్యురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటాయి. కాని వాటిని మనం తింటూనే ఉంటాము. అదే విధంగా, ఎపుడైనా మనం రెడ్ మీట్ కూడా తినవచ్చు. అయితే తక్కువ మొత్తాలలో తినాలి. రెడ్ మీట్ అధికంగా తింటే ఎధిరోస్లెరోసిస్ అనే వ్యాధి వస్తుంది. అంటే ఈ వ్యాధిలో జంతు సంబంధిత కొవ్వులు రక్తనాళాలలోని గోడలకు పట్టి బ్లాకేజీ ఏర్పడి గుండెపోటు కలిగిస్తాయి. రెడ్ మీట్ లో వుండే కొవ్వులు మాంసాహారులకు అనారోగ్యం కలిగిస్తాయి.
కేన్సర్ - రెడ్ మీట్ తింటే మీకు పేగు సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సైంటిఫిక్ గా ఇది ఇంతవరకు రుజువు కాలేదు. అయినప్పటికి ఒక స్టడీ మేరకు రెడ్ మీట్ అధికంగా తిన్నవారు కేన్సర్ వ్యాధికి గురయ్యారు.
ఊబకాయం - రెడ్ మీట్ లో కేలరీలు అధికం. కనుక మీరు దానిని అధికంగా తింటే బరువెక్కుతారు. అయితే దీనిని తిన్న తర్వాత తగిన శారీరక శ్రమ తీసుకుంటే, ఊబకాయం అంతగా ఉండకపోవచ్చు. రెడ్ మీట్ అనారోగ్యం అని చెప్పేటందుకు ఈ కారణాలు చెప్పవచ్చు. రెడ్ మీట్ లో బి12, జింక్, ఐరన్, మరియు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మీ అవసరానికంటే అధికంగా తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. గొర్రె మాంసం, పందిమాంసం, దున్నపోతు మాంసం వంటివి మాంసాలలో అనారోగ్యం కలిగిస్తాయి. అధికంగా ఏది తిన్నప్పటికి శరీరానికి అనారోగ్యమే. రెడ్ మీట్ నుండి వచ్చే ప్రొటీన్లు విటమిన్లు శరీరానికి ఆరోగ్యమే. మాంసం యొక్క చెడు ప్రభావాలు నశించాలంటే తగినంత పోషకాహారం తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications