Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీలో శక్తిని పెంచే పాటలు?

ఈ రకమైన వ్యాయామాలు లేదా యోగా చేసేటపుడు మీలోని ఎనర్జీ స్ధాయిలను పెంచటానికి ఈ రకమైన మ్యూజిక్ ఉపయోగపడుతుంది. వ్యాయామాలపై దీని ప్రభావం తప్పక ఉంటుంది. మీరు తాజాదనం భావించటమే కాక, పోయిన శక్తిని తిరిగి పొందుతారు. అందకనే యోగా, జిమ్ చేసేవారు మ్యూజిక్ తప్పక వింటారు. మరి మీరు కూడా వర్కవుట్లు చేయాలనుకుంటే, కొన్ని రకాల మ్యూజిక్ లేదా పాటలు సూచిస్తున్నాము, ఇవి మీలోని ఎనర్జీ స్ధాయిలు తప్పక పెంచుతాయి. ప్రయత్నించండి.
రైస్ అప్ - ఈ పాట మంచి మ్యూజిక్ బీట్ కలిగి మీ శక్తిని అధికం చేస్తుంది. ఉదయంవేళ వర్కవుట్లంటే కొంచెం బద్ధకంగా వుంటుంది. కనుక రైస్ అప్ సాంగ్ ను మీ స్టిరీయోలో పెట్టి, వ్యాయామం మొదలు పెట్టండి. వీడియో మీరు చూసి వున్నట్లయితే, ప్రత్యేకించి వేసవి ఉదయాలు, సాయంకాలాలు ఈ పాటను బాగా ఆనందిస్తారు.
లివ్ మై లైఫ్ - ఈ పాట వింటూ జాగింగ్ లేదా రన్నింగ్ వంటివి చేస్తే, మీకు ఎంతో తాజా అనుభూతి కలుగుతుంది. మీ వ్యాయామం అయినట్లూ వుంటుంది. ఇది కొత్తగా వచ్చిన పాటలలో ఒకటి. బీట్ అధికంగా వున్నా పాట వింటూంటే సంతోషంగా వుంటుంది. అది మీ జీవితం గురించే. ఈ పాట వినటం ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా జీవిస్తున్నట్లు ప్రతిక్షణం ఆనందిస్తున్నట్లు భావిస్తారు.
బర్న్ ఇట్ డవున్ - జిమ్ లో బరువు తగ్గించే వ్యాయామాలు చేసేటపుడు ఈ పాట ఎంతో బాగుంటుంది. మీకు తెలియకుండానే మీ వర్కవుట్ పూర్తయిపోయి ఆనందిస్తారు.
వుయ్ ఫౌండ్ లవ్ - గత రాత్రి మీ పార్టనర్ తో గొడవపడి పొద్దునే జిమ్ కు వచ్చారా? ఈ పాట వింటూ వర్కవుట్లు చేయండి. మానసికంగా ఎంతో బలం వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీలోని ఎడ్రినాలిన్ పరుగులు పెడుతుంది. మీరు ఉరకలు వేస్తారు.
వాయిద్యాలు - యోగా చేసేటపుడు మెత్తటి మ్యూజిక్ వింటే మైండ్ రిలాక్స్ అవుతుంది. యోగాకు ఇవే సరైనవి. వీటిలో పాటలతో కూడిన వాయిద్యాలైతే మరింత బాగుంటాయి. యోగా అనేది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా రిలాక్స్ చేస్తుంది. మెత్తటి, హాయి అయిన మ్యూజిక్ మీ యోగా తరగతిని ఎంతో ప్రశాంతంగా, సమర్ధవంతంగా చేస్తుంది.
ఈ రకమైన ఇంగ్లీష్ పాటలు, వాయిద్యాలే కాక, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అప్ బీట్ పాటలు, లేదా మ్యూజిక్ పెట్టుకొని వర్కవుట్లు చేస్తే, ఎంతో ఫలితం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications