Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
మీ ఆరోగ్యానికి భరోసా.. ఈ టాప్ టెన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు...!
సాధారణంగా ఏదైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మండుతూ నొప్పిగా అనిపించడాన్ని ఇంగ్లిష్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటారు. కొన్నిసార్లు గాయాల కారణంగా ఇన్‌ఫ్లమేషన్ వస్తే మరికొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సందర్భాల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ కనిపించవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో ఉపశమనం కోసం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తారు. కొన్ని నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడితే వ్యాధినిరోధకశక్తి తగ్గడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అయితే దీనికి బదులు పరిమితంగా మందులు వాడుతూ ఆహారంతో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడమూ సాధ్యనంటున్నారు ఆహార నిపుణులు. వీటివల్ల రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు, శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలను సమకూర్చుకోవచ్చు

సాల్మన్ చేపలు: చేపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ప్రత్యేకంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3-ఫ్యాటీ యాసిడ్స్‌తో చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. అలర్జీలను, గాయాలను మాన్పుతుంది.

క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్‌గా పేర్కొంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. దాంతోపాటు స్వాభావికంగానే మన శరీరంలోని విషాలను హరించే శక్తి క్రూసిఫెరస్ వెజిటబుల్స్‌లో ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి వల్లనే ఇది ప్రభావవంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారంగా రూపొందింది.

ఆలివ్ ఆయిల్: ఆలివ్‌నూనెలో కొవ్వులు తగుమోతాదులో ఉండటంతోబాటు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం ఉంది. ఇది ఆస్థమా, ఆర్థరైటిస్‌లను తగ్గిస్తుంది, గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేస్తుంది.

బ్లూ బెర్రీస్: ఇవి స్వాభావికంగా ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రభావవంతంగా తగ్గించడమే కాదు... మనలో వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతో పాటు అన్ని అవయవాల్లో కలిగే అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను అరికడతాయి. బ్లూబెర్రీస్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి.

పసుపు: మన పసుపుకు ఉన్న స్వాభావికమైన వైద్యగుణాలు ప్రపంచానికి తెలిసినవే. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది. నొప్పి నివారణ మందులు వాడదలచుకుంటే దానికి బదులు పసుపును ఎంచుకోవాలి. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్‌తో కౌంటర్ మీద దొరికే మందులు ఎలాంటి ప్రభావం చూపుతాయో, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పసుపు వేసి వండిన ఆహారమూ అదే ప్రభావాన్ని చూపుతుంది.

అల్లం: అల్లానికీ ఎన్నో వైద్యప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం. ఒక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా దీనికి రక్తంలో చక్కెరను తగ్గించే గుణం కూడా ఉంది.

వెల్లుల్లి: దీనిలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాల విషయంలో పరిశోధన జరుగుతూనే ఉన్నా ఇది సమర్థమైన నొప్పి నివారిణి అని తెలిసింది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది.

గ్రీన్‌టీ: ఫ్లేవనాయిడ్స్ అనే పదార్థాల వల్ల గ్రీన్-టీ కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం సంక్రమించింది. అంతేకాదు... చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్-టీ మంచి విరుగుడు.

చిలగడదుంప (మోరంగడ్డ, గెణుసుగడ్డ): ఇందులోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, సి గుణాల వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ను త్వరగా మానేలా చేసే గుణం చిలగడదుంపకు ఉంది.

కెల్ప్: ఇది ఒక రకం ఆల్గే ప్రజాతికి చెందిన ఆహారం. ప్రస్తుతం మన దగ్గర అంతగా లభ్యత లేదు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాల్లో చేపల తర్వాత అంత సమర్థమైనది.



Click it and Unblock the Notifications
