Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
నిద్రలేమి సమస్యా ...? ఐతే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
సరైన నిద్ర లేకపోవటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటా యి. పడుకొన్న వెంటనే నిద్రపోయే వారు చాలా భాగ్యవంతులు..! ఎందుకంటే చాలా మంది పడుకొన్న వెంటనే నిద్ర రాక కష్టపడుతుంటారు. అది మానసికంగా అనారోగ్యానికి గురిచేస్తుంది. చెడు ఆలోచనలు, చెడు కళలు వంటివి తలలో మెదులుతుండటం వల్ల నిద్రలేమి ఏర్పడి తెల్లవారి నిద్రలేవగానే ముఖం నిర్జీవంగా కనబడుతుంది. నిద్రలేకపోతే మనిషి జీవితం నరకప్రాయమే. మంచి నిద్ర వల్ల మనిషి ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. నిద్రపోవాలనుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఎప్పుడు పడితే అప్పడు నిద్ర పోకూడదు. నిద్రకు కూడా ఒక సమయం నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకోవాలి. ప్రతిరోజూ పడుకునే సమయంతో పాటు మెలకువ తెచ్చుకునే సమయం ఒకటిగా పాటించాలి. దీనివల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది.
సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు

కెఫిన్ ఆధారిత ఆహారపానీయాలు: కెఫిన్ ఉపయోగించడం మన ప్రస్తుత దినచర్యలో ఒక భాగమై పోయింది. నిద్రలేవగాని కాఫీ త్రాగందే పని మొదలవుదు. అయితే నిద్రలేమితో బాధపడేవారు ఈ కెఫిన్ ఆహారాలు(కాఫీ, టీ, చాక్లెట్స్, మరియు ఎనర్జీ డ్రింక్స్)కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా కెఫిన్ వాడబడిఉంటుంది.

మద్యపానం: మద్యం శరీరంలో ఉండే నీరును తగ్గిస్తుంది. శరీరాన్ని డీహైడ్రేట్ కు గురిచేస్తుంది. అంతే కాదు ఇది శరీరంలో ఉండే సెరోటిన్(serotonin)స్థాయిని తగ్గించి నిద్రలేమికి గురిచేస్తుంది.

మాంసాహారం(హై ప్రోటీన్ ఫుడ్): ప్రోటీను అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యంగా రెడ్ మీట్ జీర్ణం అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఇది నిద్రలేమికి కారణమవ్వడమే కాకుండా శరీరంలో సెరోటినిన్ ఉత్పత్తి చేసి నిద్రలేమికి దారితీస్తుంది.

గ్రీన్ పీస్ /గ్యాస్ ఆధారిత ఆహారాలు: మనిషికి ముఖ్యంగా అసౌకర్యం కలిగించేవి గ్యాస్ట్రిక్ మరియు గుండెలో మంట. ఈ సమస్యలకు కారణమయ్యే ఆహారాలు అంటే గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలు బీన్స్, బ్రొకోలీ, పచ్చిబఠానీ వంటివాటికి దూరంగా ఉంటే మంచి నిద్ర పడుతుంది.

హై షుగర్ ఫుడ్స్/స్వీట్స్: పంచదార ఎనర్జీని పెంచుతుంది, అదే సమయంలో నిద్రలో అసమతుల్యతలు ఏర్పడుతాయి. కాబట్టి షుగర్ ఫుడ్స్ కేక్స్, చాక్లెట్స్, మరియు డిజర్ట్స్ వంటి నిద్రలేమికి కారణం అయ్యే వీటికి దూరంగా ఉండటం వల్ల నిద్రబాగా పడుతుంది.

డైరీప్రొడక్ట్/పాలు: ఆహారాలు అంటే అధిక కొవ్వున్న పాలు, పెరుగు, వెన్న మరియు జున్ను వంటివి రాత్రి సమయంలో జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. అంతే కాదు వీటిని తినడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాంతో గుండెలో మంటగా అనిపిస్తుంది. నిద్రసరిగా పట్టకుండా చేస్తుంది.

ఫాస్ట్ ఫుడ్స్/బర్గర్: ఈ రకమైన ఆహారాలు సందేహం లేకుండా నిద్రలేమికి గురిచేస్తాయి. ఇవి కొవ్వులను మాత్రం కలిగి ఉండటమే కాక, ఎక్కువగా కారంగా ఉంటాయి. దాంతో కడుపులో మంట, గ్యాస్ కు కారణం నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ కు చెక్ పెట్టి సుఖనిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.

పొగత్రాగడం: టుబాకో మరియు నికోటిన్ ఆధారిత ఆహారాలు మూడ్ ను మార్చేస్తుంది. ఒత్తిడిని తక్షణ ఉపశమనం కలిగించే టుబాకో, నికోటిన్ ఆరోగ్యానికి హానికరమే కాదు, నిద్రలేమికి దూరం చేస్తుంది.

లిక్విడ్స్/ద్రవాలు: ఎక్కువగా నీరు తీసుకోవడం మంచిదే, అయితే రాత్రిసమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు నీటిని మితంగా త్రాగాలి. లేదంటే కడుపునిండుగా ఉన్నట్లు అనిపించి మాటమాటికీ బాత్ రూమ్ ను వినియోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.

ప్యాకేజ్డ్ ఫుడ్స్: ముందుగా తయారు చేసి నిల్వచేసిన ఆహారాలు లేదా ప్యాక్ చేసిన ఆహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. అటువంటి వాటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల అధిక ఫ్యాట్ పొంది, హార్ట్ బర్న్ కారణం అయ్యి, నిద్రలేమికి దారితీస్తుంది.
ఒక్కో సందర్భంలో జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్ర పట్టదు. రాత్రి పడుకొన్న తర్వాత విశ్రాంతి సమయంలో జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. రాత్రిల్లో భోజ నం మితంగా తినాలి. ఉదయం కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకో బోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది.
ప్రతి మనిషికి ఒక రోజుకు కనీసం 8గంటల నిద్ర అవసరం. ఇది వారి జీవిత కాలాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక అరగంట ఇటు అటు అయినా కూడా ఆ రోజంతా వారికి కష్టంగా ఉంటుంది. కారణం ఏదైతేనేం..కొంత మంది నిద్రలేమికి కారణాలు తెలియక నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు అందకు కారణం తెలుసుకుని, పరిష్కారం తీసుకోవడం చాలా అవసరం. అంతే కాదు మనం తీసుకొనే ఆహారం కూడా ఒక కారణమే, నిద్రలేమికి ఆహారం కూడా కారణం అవుతుందాని గుర్తించాలి.
నిద్రలేమికి కారణం అయ్యే కొన్ని ముఖ్య ఆహారాలు కెఫిన్ ఆధారిత ఆహారాలు లేదా డ్రింక్స్, ఫుడ్ అలెర్జీ మరియు ఫుడ్ సెన్సివిటీ. తినే సమయంలో లేదా ఏదైనా ఆహారం తినే ముందు అది మన శరీరానికి వంటుతుందా లేదా అన్న విషయాన్ని గుర్తించాలి. అటువంటి కొన్ని ఆహారాలు నిద్రలేమికి ప్రధానకారణంగా చెప్పవచ్చు. అందుకు నిద్రలేమికి కారణమయ్యే ఆహారాలను తెలుసుకొని మంచి నిద్రను పొందడానికి ప్రయత్నించండి. రాత్రి సమయంలో సుఖంగా నిద్రపోవాలంటే ఈ క్రింది ఇచ్చిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.



Click it and Unblock the Notifications











