Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
ధూమపానం మీకు పెద్ద శత్రువు అని చెప్పటానికి 10 కారణాలు
ధూమపానం చేసేవారు సాధారణంగా వివిధ రకాల వ్యాధులకు గురిఅవుతుంటారు మరియు అదేకాదు, వారు మీ దృష్టిలో ఏహ్యంగా కనబడతారు. మేము మీరు పూర్తిగా ధూమపానం ఎందుకు మానేయలేకపోతున్నారో పది కారణాలు చెపుతున్నాము.
పతనం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంటే మీరు మీ చెడు అలవాట్లపట్ల జాగ్రత్తగా ఉండాలి. సిగరెట్టు ప్రభావం మీ ముఖం మీద కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నప్పుడు, ఈరోజునుండే ఆ అలవాటుకు స్వస్తి పలకాలి.
మీకు ధూమపానం యెంత పెద్ద శత్రువో 10 కారణాలలో ఇక్కడ ఇస్తున్నాము.

ఎప్పటికీ అలసట:
మీరు ఎప్పటికీ అలిసినట్లుగా కనపడుతుంటారు ఎందుకంటే మీ కళ్ళ క్రింద ముడుతలు బాగా ఉంటాయి. ధూమపానానికి కృతజ్ఞతలు తెలపండి. ఎవరైతే రోజుకు నాలుగుసార్లు ధూమపానం చేస్తారో నిద్రకు దూరమవుతారు మరియు చిన్నవయసులోనే కళ్ళ క్రింద ముడుతలు వొస్తాయి.

ఎల్లో దంతాలు:
ధూమపానం చేసేవారి దంతాలు పసుపు రంగుకు మారతాయి,ఎనుకంటే సిగరెట్ లో ఉన్న నికోటిన్ కారణం. మీ దంతాలు తెల్లగా ముత్యాల్లా ఉండాలంటే, మీరు ధూమపానం మానేయాలి. ఒకసారి పసుపు రంగుకు మీ దంతాలు మారాయంటే, వాటిని మీరు క్లీనింగ్ చేయించుకున్నా మరియు తెల్లగా కావటానికి ఏ పద్ధతిని అనుసరించాలన్న కుదరదు. మీరు ఆ పచ్చటి దంతాలతోనే జీవితం గడపాలి.

ముడుతలు:
మీరు అన్నివేళలా ధూమపానం చేసినట్లయితే, మీ చర్మ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచే రక్త సరఫరా పొగతో రక్తసరఫరా సరిగా జరగక చర్మం ముడుతలు పడతాయి. దీనివలన మీ వయస్సుకన్నా ఎక్కువ పెద్దవారుగా కనపడతారు.

పసుపుపచ్చ వేళ్ళు మరియు చేతులు:
నికోటిన్ మీ దంతాలనే కాదు, మీ చేతివేళ్ళను కూడా పసుపుపచ్చగా మారుస్తుంది. ఈ పసుపుపచ్చ మరకలు పోవటానికి కొన్ని గృహవైద్యాలు ఉన్నా, ఈ అలవాటు మానేస్తే బాగుంటుంది కదా!

మీ జుట్టుకు చెడ్డ రోజులు:
ధూమపానం వలన కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మీ జుట్టులోని DNA ను దెబ్బ తీస్తుంది మరియు దీనివలన జుట్టు రాలిపోవటం మరియు చిట్లిపోవటం జరుగుతుంది.ఈ అలవాటు లేనివారికన్నా,ధూమపానం చేసేవారిలో జుట్టు రాలిపోవటం ఎక్కువగా ఉంటుంది.

మచ్చలు:
సిగరెట్ లో నికోటిన్, వాసోకాన్స్ట్రిక్షన్ అనే పరిస్థితికి అనగా రక్తనాళాలు సన్నగా అవటానికి దారితీస్తుంది. సన్నగా తయారయిన రక్త నాళాలు మీ ముఖానికి ఆమ్లజని అధికంగా ఉన్న రక్తాన్ని సరఫరా చేసే ప్రక్రియను పరిమితం చేస్తుంది. అందువలన మీ ముఖాన్ని అందవికారంగా చేసునేదానికన్నా, ఈ అలవాటు ఎప్పటికి మానివేయటం మంచిది.

ధూమపానం చేసేవారి ముఖం:
సిగరెట్ పొగలోని కార్బన్ మోనాక్సైడ్ మీ చర్మంలో ఆక్సిజన్ భర్తీ చేస్తుంది అయితే, నికోటిన్ రక్త ప్రవాహంలో అడ్డంకులిని సృష్టిస్తుంది, అందువలన మీ ముఖం పొడిగా, జీవకళ లేకుండా తయారయి చూడగానే మీరు దూమపానంచేసేవారుగా గుర్తింపపడతారు.

స్ట్రెచ్ గుర్తులు:
నికోటిన్ చర్మ కణజాలం మరియు తంతువులకు నాశనం చేకూరుస్తుందని మనందరికి తెలుసు. ఇది చర్మానికి సాగే గుణాన్ని కూడా తగ్గిస్తుంది. అధికంగా బరువు పెరగటం లేదా నష్టపోవటం వంటివి జరుగుతాయి. నికోటిన్ చర్మానికి తనంత తాను హీల్ అయే గుణాన్ని నివారిస్తుంది అందువలన ఈ గుర్తులు పోవు.

దంతాలు ఊడటం:
ధూమపానం అధికంగా చేయటం వలన మీ దంతాలు పూర్తిగా పాడవుతాయి. దంతాలు పసుపుపచ్చగా మారటం ప్రారంభం మాత్రమే;తరువాత మీ దంతాలు చాలా సున్నితంగా తయారవుతాయి మరియు ఊడిపోతాయి.

కళ్ళు :
ఎవరికి కంటిచూపు అద్భుతంగా ఉండాలని ఉండదు? ధూమపానం అధికంగా చేయటంవలన సిగరెట పొగ వలన కాటరాక్ట్ ఏర్పడి చిన్నతనంలోనే వొచ్చే అవకాశం ఉన్నది.
అందువలన, చర్మం ముడుతలు,మచ్చలు,జుట్టు మరియు దంతాలు రాలిపోవటం, ఇన్నింటికి కారణమైన ధూమపానాన్ని వదిలివేయటానికి సమయం కాదా?



Click it and Unblock the Notifications
