Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మీరు ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
సాధారణంగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా వారు కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.
కూర్చుంటే రెస్ట్ తీసుకున్నట్లే కదా అనుకోకండి. నిలబడినప్పటి కంటే కూర్చున్నప్పుడే మీ వెన్నెముక మీద ఎక్కువ భారం పడుతుంది. కూర్చొనే భంగిమ సరిగా లేకపోతే మీ వెన్నెముకకు క ష్టాలు తప్పవు. అందుకే కూర్చొనే కుర్చీ సక్రమంగా ఉందో లేదో చూసుకోండి. వెన్నెముక దిగువ భాగానికి సపోర్ట్ ఉండేలా, నిటారుగా కూర్చొనేందు అనువైన కుర్చీని ఎంచుకోండి. మీరు ఏమి పని చేస్తున్నా మీ వెన్నెముక బలంగా మరియు మీ దేహ భంగిమ సరిగ్గా ఉండటానికి కొన్ని సరళమైన మార్గాలు.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీరు ఒక పని చేస్తే..ప్రతిరోజూ మీ ప్రతి కండరాల సమూహాన్ని 15-30 సెకండ్ల పాటు సంకోచింప చేసుకోగలిగితే మీ వెన్నెముకను రక్షించటంలో గల తేడాను చూడవొచ్చు. మీరు వంగి మీ పాదాల మొనలను తాకగలిగితే మీరు చాలా అనువుగా ఉన్నారని చెప్పనక్కర లేదు. మీరు ఆరు దిక్కులకు కదలండి. ముందరికి మరియు వెనుకకి కదల్తూ, కుడికి మరియు ఎడమకు తిరుగుతూ ఉండండి మరియు పక్కలకు కూడా కదులుతూ ఉండండి- మరియు ఇలా మీరు కూర్చుని,పడుకొని మరియు నిలబడి అయినా చేయవొచ్చు.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు
మీరు మీ తలను సరి అయిన ఎత్తులో ఉండేట్లు చూసుకోండి, లేకుంటే మీ మెడ బెణుకు పట్టవొచ్చు. మీ వెనుక వ్యూ అద్దం ఉంచండి,దానిమూలంగా మీరు నేరుగా కూర్చుని ఉన్నారో, లేదో దానిలో చూడవొచ్చు. మీరు ట్రాఫిక్ లైట్లు వద్ద ఆపినప్పుడు, మీరు కడుపులోకి ఊపిరి పీల్చండి. ఒక బలమైన కేంద్రభాగం మీ వెన్నెముకను రక్షిస్తుంది.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు
మీరు ఆఫీసులో ఉన్నప్పుడు, నిలబడటం మరియు ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు లేదా తీసుకుంటున్నప్పుడు మీ వెన్నెముక విల్లులాగా వంగుతుంది. ఎప్పుడు మీరు ఫోన్ క్రడిల్ ను చెవి మరియు భుజం మధ్యలో ఉంచుకోవొద్దు మరియు అదే సమయంలో టైపు చేయవొద్దు. ఇలా చేయటం వలన మెడ మరియు భుజం గట్టిగా అవుతాయి.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీ కంప్యూటర్ ను వాడుతున్నప్పుడు
భూమి మీద మీ పాదాలను సమంగా ఉంచండి మరియు కంప్యూటర్ స్క్రీన్ మీ కండ్ల ఎత్తుకు సమంగా ఉంచటంవలన, మీరు ఎత్తి చూడటం ఉండదు. మళ్లీ మళ్లీ మౌస్ తో పని చెయ్యకుండా, ఉదయం మరియు మధ్యాహ్నం కొంత సేపు మీ చేతులను ఒడిలో పెట్టుకొని కూర్చోండి. నెమ్మదిగా భుజాలను పైకి, క్రిందికి కదపండి. ఇలా 10 సెకండ్లు చేయండి. 10 సార్లు తిరిగి చేయండి.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీ పని వొద్ద
మీ పని వొద్ద కూర్చోవటం-మరియు కంప్యూటర్ కీబోర్డుల పైన వంగటం-ఎక్కువ బరువులు ఎత్తటం మరియు మోయటం కన్నా ఎక్కువగా నడుము నొప్పి సమస్యలకు కారణమవుతున్నది. కుర్చీలో వెనకాల దిండ్లను ఉంచండి. దీనివలన మీరు కూర్చునే భంగిమ సరిగా ఉంటుంది. 'c ' లాగా వంగటం ఉండదు. ఫోమ్ సీట్ మీయొక్క తొడలను మీ మోకాళ్ళ కంటే ఎత్తైన స్థితిలో ఉంచుతుంది.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
టీవీ చూస్తున్నప్పుడు
మీరు అదేపనిగా ఒక మెత్తని దిండు ఆధారిత మృదువైన సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు, మీ వెన్నెముక భాగం మీద ఒత్తిడి పడుతుంది. మీ డైనింగ్ రూంలో ఉన్నటువంటి కుర్చీ మీద కూర్చుని టీవీ చూడటంవలన, మీ మోకాళ్ళ కన్నా మీ తొడలు ఎత్తులో ఉండటంవలన మీ మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది- మీ వెన్నెముకకు ఇది మంచి స్థితి.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
రాత్రుళ్ళు మెలకువ ఉండవలసి వొస్తే
అధిక ఎత్తుగల బూట్లు, ప్రత్యేకంగా స్టిలేత్తోస్, మీ మొత్తం శరీర బరువు ఫోర్సు అంటా మీ ముందరి పాదం మీద పడటంవలన మీ శరీరభంగిమ మారటం, మీ పొత్తికడుపు మరియు వెన్నెముక క్రింది భాగం మీద ఒత్తిడి పడటం వంటివి జరుగుతాయి. లోపలి అడుగు భాగంలో స్పాంజి వంటి మెత్తటి భాగం ఉన్నవాటిని ధరించటం వలన కొంతవరకు ఒత్తిడిని అవి గ్రహిస్తాయి.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీకు జలుబుగా ఉన్నప్పుడు
తుమ్ము వెన్నునొప్పికి మొదటి ఐదు కారణాలలో ఒకటిగా, ఒస్టియోపత్స్ చెపుతున్నారు. మెడ బెణుకు మీద ఆకస్మిక ఫోర్స్ ప్రభావం ఉండటం వలన, వెన్నెముక మరియు మెడ నొప్పికి కారణమవుతున్నది. మీకు తుమ్ము వొస్తున్న అనుభూతి ఉన్నట్లయితే, మీ మోకాళ్లను వంచండి. ఇందువలన ఈ ఫోర్సుని మీ వెన్నెముక బదులు మీ మోకాళ్ళు తీసుకుంటాయి.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
ఇంటిపని చేస్తున్నప్పుడు
గృహకార్యాలు ఒక వ్యాయామంలాగా చేయాలి. మీరు ఇంట్లో వాక్యూమ్ చేస్తున్నప్పుడు నిటారుగా నిలబకూడదు మరియు సరళంగా మషీన్ ను ముందుకు,వెనక్కు తోయండి. మీ కడుపు కండరాలను కదిలించండి, వాక్యూంతో కదలండి మరియు మీ మోకాళ్లను వంచండి-నడుమును ఎప్పుడు వంచకూడదు.

ఏపనిచేస్తున్నా కూర్చొనే భంగిమ సరిగా ఉందా?
మీరు నిద్ర పోతున్నప్పుడు
తల క్రింద చాలా దిండ్లు పెట్టుకోవటం-లేదా ఎక్కువ మెత్తగా ఉన్న ఆధారం లేకుండా ఉన్నదాని మీద నిద్రపోవటం-ఇలా చేయటం వలన మీ మెడ మరియు వెన్నెముక ఒత్తిడికి గురి అయి సమస్యలు రావొచ్చు. మీ తలకు తప్పనిసరిగా మంచి ఆధారం ఉండాలి కాని మీ వెన్నెముకకి సరిగా క్రమంలో మీ తలను ఉంచుకోవాలి అని నిపుణులు చెపుతున్నారు.



Click it and Unblock the Notifications











