Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
ఈ ఆహారాలను ఫ్రై చేయడం కంటే ఉడికించి తినడం ఆరోగ్యకరం...
సాధారణంగా మనం అనేక రకాల కూరగాయలను ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటాం. అందులో ఆరోగ్యకరమైన ఆహారాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు.
1. పచ్చిగా ఉండి.. తినగలిగినటువంటి ఆహారాలు: క్యారెట్, క్యాబేజ్, కీరదోసకాయ మొ...ఆహారాలను పచ్చివి అలాగే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
2. ఉడికించి తినేటువంటి ఆహారాలు: బియ్యం, గోధుమ, బంగాళదుంప, సూప్ ఇటువంటి ఆహారాలను ఉడికించి తింటే మాత్రమే ఆరోగ్యం. వీటిని ఉడికించకుండా అలాగే తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మరియు ఇతర ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉడికించడంలో కాస్త మెళుకువగా ఉండాలి. కొన్ని కూరగాయలను హాఫ్ బాయిల్ చేయవచ్చు. అలా చేసినప్పుడు అందులో నిల్వ ఉన్న పోషకాంశాలు నష్టపోవు.
ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారాల పట్టీకలో ఫ్రై చేసిన వస్తువులను చేర్చడానికి సాధ్యం కాదు. ఫ్రైచేసిన లేదా వేపుళ్ళను తినడం వల్ల శరీరం బరువు పెరగడం తప్ప మరే ఇతర ప్రయోజనం లేదు. నోటికి రుచిగా ఉండటం కోసం వీటిని వేపుళ్ళుగా తయారు చేసి తింటుంటాము. అయితే ఫ్రై చేయడం వల్ల ఆ తాజా కూరగాయల్లో ఉండే పోషకాలు పూర్తిగా కోల్పాతాయి.
అపురూపంగా ఎప్పుడో ఒకసారి ఫ్రై చేసిన ఆహారాలను తినడం వల్ల శరీర బరువు పెరగదు. వారంలో మూడు సార్లు ఎక్కువ నూనె ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి ఫ్రైచేసిన లేదా గ్రిల్డ్ చేసిన వాటికంటే ఉడికించినవి ఆరోగ్యకరం. ఇక్కడ కొన్ని ఆహారాలను మీకోసం వాటి గుణాలను తెలుపుతున్నాం. ఆ ఆహారాలను ఫ్రై చేసి తింటే నోటికి రుచి అదే ఉడికించి తింటే ఆరోగ్య వృద్ధి. ఈ రెండింటిలో ఏ ఆహారాన్ని తినవచ్చో మీరే డిసైడ్ చేసుకోండి.

బంగాళదుంప: బంగాళదుంపను ఫ్రై చేసి తినడం కంటే ఉడికించి తినడం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం.

గుడ్డు: గుడ్డును ఎగ్ బుర్జి లేదా ఆమ్లెట్ చేసి తినడం కంటే హాఫ్ బాయిల్ చేసి తినడం ఆరోగ్యం కరం.

పాస్తా లేదా నూడిల్స్: నూడిల్స్, పాస్తా వంటివి సన్నని మంట మీద ఉడికించి తినడం వల్ల ఆరోగ్యకరం. రెడీ టు కుక్ నూడిల్స్, పాస్తా వంటివి ఆరోగ్యకరమైనవి కావు.

బీన్స్: బీన్స్, బఠానీ వంటివి ఫ్రైచేసే బదులు, ఉడికించి కూర వండుకుతింటే మరింత ఆరోగ్యకరం.

అన్నం: అన్నం తయారు చేసిన తర్వాత, పోషకాంశాలు కలిగిన కూరగాయలు ఉడికించి రెండింటి మిశ్రమంతో తినడం ఆరోగ్యకరం.

ఉడికించిన రొయ్యలు: రొయ్యలను ఫ్రై చేసి తింటే నోటికి రుచికరంగా ఉంటుంది. అదే కర్రీ చేసి తింటే ఆరోగ్యాన్ని పెంచుంతుంది.

ఉడికించిన మొక్కజొన్న: మొక్కజొన్నలను పాప్ కార్న్ తయారు చేసి తినడం కంటే ఉడికించి లేదా నిప్పుల మీద కాల్చి తినడం ఆరోగ్యకరం.

ఉడికించిన పాలకూర: పాలక్ సూప్ లేదా పాలక్ ఫై తినడానికి బదులు కర్రీ చేసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

చికెన్: చికెన్ ను ఉడికించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కుక్ చేయడకూడదు. కొద్దిగా నీళ్ళు పోసి చికెన్ ఉడికించి, ఆ నీటిని సూప్ గా తయారు చేసుకోవచ్చు.

రెడ్ మీట్: రెడ్ మీట్ అధిక కొవ్వును కలిగి ఉంటుంది. ఫ్రై చేసి తినడం వల్ల మరింత కొవ్వు శరీరానికి చేరుతుంది కాబట్టి రెడ్ మీట్ ను కూడా ఉడికించి తినడం ఉత్తమం.

బ్రొకోలీ: బ్రొకోలీ మరియు ఇతర కాలీఫ్లవర్ జాతికి చెందిన గ్రీన్ వెజిటేబుల్స్ ను తినడానికి ముందు ఖచ్చితంగా ఉడికించాలి.



Click it and Unblock the Notifications