Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
పోషకాంశాలు పూర్తిగా అందాలంటే చేపలను ఏ రకంగా వండాలి..!
మాంసాహార ప్రియులకు చేపలు తినడం అంటే చాలా ఇష్టం. కానీ చేపలు వంటలు వండటం చాలా కష్టం. చేపలతో చేసే వంటకాలను వండేందుకు ఆ వంట గురించి పూర్తిగా తెలుసుండాలి . చేపలతో తయారు చేసే వంటలు అతి జాగ్రత్త వండాలి ఎందుకంటే చేపలు మటన్ లేదాచికెన్ కంటే చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ సేపు ఉడికించనవసరం లేదు. అతి సున్నితంగా ఉండే చేపలను ఎక్కువ సేపు ఉడికించడం వల్ల అందులో ఉండే పోషకాలు తొలగిపోతాయి. కాబట్టి చేపలు వండటంలో రుచితో పాటు పోషక విలువలు కూడా చూడాలి.
చేపలను ఎక్కువగా ఉడికించడం వల్ల అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు కోల్పోతుంది. అంతే కాకుండా చేపల్లో ఉండే ఒమేగా 3ఫ్యాటీయాసిడ్స్ కూడా కోల్పోతాయి. ఇంకా సముద్రచేపలు ఎక్కువగా ఉడికించడం వల్ల ఈ అంశాలతో పాటు అందులో ఉండే ఖనిజాలను కూడా కోల్పోతాయి. మాంసకృత్తులను కోల్పోతాయి. కాబట్టి మన ఆరోగ్యానికి అందాల్సిన ఖనిజలవణాలు, మాంసకృత్తులు, పోషకాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందాలంటే చేపలను వండే విధానంలో సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.
చేపలను వండడానికి మంచి మార్గం ఉడికించడంలో ఉంది. అయితే చాలా మంది ఉడికించిన చేపలను వాటి వాసన బట్టి తినరు. కాబట్టి ఆరోగ్యానికి,రుచి రెండు పొందాంటే బేక్ చేసి తినడం మంచిది లేదా గ్రిల్లింగ్ చేసి తినడం మరింత ఆరోగ్యకరం. ఇంకా మైక్రోవోవెన్ లో వండే వంటలు మరింత ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. అందుకు కొన్ని ఆరోగ్యకరమైన పోషకాలు పొందడానికి వండే విధానంలో కొన్ని మార్గాలు మీకోసం...

ఉడికించిన చేపలతో సాస్: చేపలు ఉడికించే సమయంలో సాస్ తో పాటు మిక్స్ చేసి ఉడికించడం వల్ల అందులో ఉండే ప్రోటీనులు, మినిరల్స్ నష్టపోవు. ఆరోగ్యానికి మంచిది.

బేక్డ్ ఫిష్: బేక్డ్ ఫిష్ మైక్రోవోవెన్ లో తయారు చేసుకోవచ్చు. ఐతే సరైన ఉష్ణోగ్రతను సెట్ చేయడంలోనే ఉంది. ఉడికించిన, ఫ్రై చేసిన వాటికంటే బేక్ చేసి వాటిలో పోషకాంశాలు అధికం.

పాతూరీ లేదా ఆవిరిలో ఉడికించిన చేపలు: స్టీమింగ్ ఫిష్ అంటే ఉడికించడం కాదు ఆవిరిలో ఉడికించడం. దీన్ని ఇండియన్ కుషన్ లో పాతూరి అంటారు. ఫిష్ ఫిల్లెట్ ను అరటి ఆకులో చుట్టి ప్రెజర్ కుక్కర్ లో ఉడికిస్తారు.

ఫిష్ కర్రీ: చేపల కూర వాసనను ఇష్టపడే వారు, ఈ చేపలకు కూరకు కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి, తక్కువ నూనె ఉపయోగించి వండం వల్ల తగినన్ని పోషకాలను పొందవచ్చు. అయితే వండే సమయంలో చేపలను ఎక్కువగా ఉడకనివ్వకూడదు.

స్మోక్డ్ ఫిష్: చేపలను భోజనంతో తినాలనుకొనే వారు, వివిధ రకాల చేపలతో తయారు చేసే కొన్ని పులుసులు ఉన్నాయి. సూప్ ఉపయోగించి, లేదా ఉడకబెట్టి, లేదా స్మోక్డ్ ఫిష్ ను భోజనంలో తీసుకోవాలి. కాల్చిన చేప చాలా అద్భుతమైన టేస్ట్ తో పాటు వాసన కూడా కలిగి ఉంటుంది. అయితే కాల్చే విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్రిల్డ్ ఫిష్: చేపలను గ్రిల్ చేసి ఓపెన్ ఫ్రై (పొయ్యి లేదా నిప్పుల మీద కాల్చడం)లేదా మైక్రోవోవెన్ లో కాల్చడం, ఇలా చేయడం వల్ల బయట స్కిన్ మాత్రమే కాలుతుంది. గ్రిల్డ్ ఫిష్ మినిమమ్ ఫ్యాట్ కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

నూనె లేకుండా వేయించాలి: చేపలచర్మంలో కొవ్వులు, మరియు ఆయిల్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ లేకుండానూ చేపలను ఫ్రై చేయవచ్చు. పాన్ వేడి చేసి ఫ్యాటీ ఫిష్ (సాల్మన్ ఫిష్ ను) ఫ్రై చేసుకోవచ్చు. వీటిల్లో మంచి కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది . ఇలా తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యకరమే.



Click it and Unblock the Notifications
