Latest Updates
-
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
మైగ్రేన్ తలనొప్పిని నివారించే 9 సూపర్ ఫుడ్స్
ప్రస్తుత కాలంలో తలనొప్పి ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దాదాపు ప్రతి ఒక్కరూ తలనొప్పితో ఏదో ఒక సందర్భలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. చాలా వరకూ ఒక వారంలో ఒకటి లేదా రెండు రోజలు మైగ్రేన్ తలనొప్పితో భాదపడుతుంటారు. ఎప్పుడైతే ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుందో అప్పుడు ఒక మైగ్రేన్ పిల్స్(టాబ్లెట్)వేసుకొని ప్రస్తుతానికి ఉపశమనం పొందుతారు. ఈ తలనొప్పి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారికి ఒక పక్క మొదలై తలమొత్తం వ్యాప్తిస్తుంది. మొదటి కొద్దిగా నొప్పి ఉన్న పోనుపోను తీవ్రత పెరుగుతంది. కొందరిలో కడుపులో వికారం, వాంతులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ నొప్పి వచ్చిన సమయంలో వారు సరిగా వెలుతురు చూడలేకపోవడం వల్ల శబ్దం వల్ల చికాకు కలుగుతుంది.. ఒకసారి తలనొప్పి మెదలైతే ఇది ఎక్కువ సమయం అంటే 12 నుండి 24 వరకు ఉంటుంది. చాలా సందర్భాలో ఈ తలనొప్పికి కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు కారణాన్ని గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటుంది. మెగ్నీషయంలోని కెమికల్స్ మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో బాగా సహాపడుతుంది. ఆకుకూరల్లోనే కాకుండా గోధుముల, సీఫుడ్ వంటి వాటిలో మైగ్రేన్ తలనొప్పి తగ్గించే మెగ్నీషియం అధికంగా ఉంటుంది.

సీ ఫుడ్ చేపల్లో ఓమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. మైగ్రేన్ కు కారణమయ్యే వాటిని తగ్గించడంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా పనిచేస్తాయి.

లోఫ్యాట్ డైరీ ఉత్పత్తి అయిన పాలు. బాగా కాచీ మీగడ తీసేసిన పాలు మైగ్రేన్ తగ్గిస్తుంది. పాలలో విటమిన్ బి(రెబొఫ్లెవిన్)కణాల శక్తిని పెంచి మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.

మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్. అవిసెలో ఒమెగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడే ఈ అవిసె గింజలు మైగ్రేన్ తలనొప్పిని కూడా నివారిస్తుంది.

ఇది నిజం ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. తరచూ మైగ్రేన్ తో బాధపడుతున్నట్లైతే ఒక కప్పు వేడి కాఫీ తాగాలి. కాఫీలో ఉన్న కెఫిన్ మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.

టైరమిన్ (యాంటి ఆసిడ్) ను చాలా బెవరేజెస్ లో వినియోగిస్తారు. కాబట్టి ఒక గ్లాస్ వైన్ లేదా బీర్ తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

చిరు ధాన్యాలు వీటిలో కూడా ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఫ్రైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఈ ధాన్యాలు తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోచ్చు.

గ్రీన్ వెజిటెబుల్స్ లో అధిక శాతంలో మెగ్నీషియం కలిగి ఉంటుంది. ఉడికించిన బ్రొకోలీ కేయాన్ పెప్పర్ చేర్చి తినడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నివారించవచ్చు.

యాంటిబ్యాక్టీరియల్ స్పైసీ, ఆయుర్వేద ఔషదంలా పనిచేసి మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. ప్రతి రోజూ మీరు తినే ఆహారంలో అల్లం చేర్చడం వల్ల మైగ్రేన్ ను నివారించవచ్చు.
మైగ్రేన్ ఉన్నవారిలో ఆ తలనొప్పి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రలేమి, హఠాత్తుగా నిద్రలో నుండి లేవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, ఆందోళన, ప్రయాణం చేయడం వంటి కారణాలు ప్రభావం చూపుతాయి. కొందరిలో సెంట్లు, ఘాటైన వాసనలు కూడా ప్రభావం కలిగిస్తాయి. ఆహారపు అలవాట్లు కూడా మైగ్రేన్‌ను కలిగిస్తాయి. చైనీస్ ఫుడ్స్‌లో ఉండే అజినామోటా ఉప్పు ముఖ్యంగా మైగ్రేన్ కలిగిస్తుంది. పన్నీర్, జున్ను, చల్లటి పదార్థాలు, పుల్లటి వస్తువులు మైగ్రేన్ కలగజేస్తాయి.
మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారిలో ఆ తలనొప్పి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎక్కువగా కనిపిస్తుంది. నిద్రలేమి, హఠాత్తుగా నిద్రలో నుండి మోల్కోవడం, సరైన సమయంలో భోజనం చేయకపోవడం, ఆందోళన, ప్రయాణం చేయడం వంటి కారణాలు ప్రభావం చూపుతాయి. కొందరిలో సెంట్లు, ఘాటైన వాసనలు కూడా తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. ఆహారపు అలవాట్లు కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతాయి. చైనీస్ ఫుడ్స్‌లో ఉండే అజినామోటా ఉప్పు ముఖ్యంగా మైగ్రేన్ కలిగిస్తుంది. పన్నీర్, జున్ను, చల్లటి పదార్థాలు, పుల్లటి వస్తువులు మైగ్రేన్ కలగజేస్తాయి.
మైగ్రేన్ తలనొప్పిని నివారించాలంటే జీవనశైలి మార్పులతో పాటు వేళకు ఆహారం తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, మంచి నిద్ర మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది, ధూమపానం, మద్యపానం మానడం వంటి చర్యల వల్ల మైగ్రేన్‌ను నివారించే అవకాశం ఉంది. కొన్ని ఆహారాలు తరచూ తీసుకొంటుంటే మైగ్రేన్ తలనొప్పిని ఉపశమనం కలిగించవచ్చు.



Click it and Unblock the Notifications
