For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యక్తుల్లో ఈవిధమైన ప్రవర్తన, వారి స్వభావం కాదు, ఒక వ్యాధి.!

|

ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. మౌలికంగా మీ ధారణ శక్తి చాలా తక్కువగా వుంది అది మిమ్మల్ని చాలా అసహనంగా తయారుచేస్తున్నదని అర్ధం. వినడానికి సింపుల్ గానే ఉన్నా, ఈ వ్యాధికి చాలా దీర్ఘ కాల పరిణామాలే వున్నాయి. తరచుగా తమ పిల్లలను గమనిస్తూ వుండే తల్లిదండ్రులు వారిలో ADHD సంకేతాలు యిట్టె గుర్తించగలుగుతారు. పైగా ADHD చిన్నతనంలో వచ్చే వ్యాధి. అయితే ADHD సంకేతాలు తరచుగా పెద్దయ్యాక కూడా కొన్ని ప్రభావాలను చూపిస్తుంది.

కొన్నిసార్లు, చిన్నతనంలో గుర్తించలేని ADHD సంకేతాలు పెద్దయ్యాక చాలా ప్రమాదాలు కలిగిస్తాయి. పెద్దవారిలో ADHD ని పరిష్కరించడం కొద్దిగా కష్టమే. ముందుగా పెద్దవారిలో ADHD సంకేతాలు గమనించడమే వుండదు. రెండోది, చిన్నప్పటి ఒక వ్యాధితో వారు బాధ పడుతున్నారని పెద్ద వారిని నమ్మించడం కూడా చాలా కష్టం.

అయితే ADHD తో బాధ పడేవారి చుట్టూ వుండే మనుషులు ప్రయత్నిస్తే ఈ పరిస్తినిన్ గుర్తించగలరు. అసాధారణంగా తక్కువ ధారణా కాలం ఈ వ్యాధికి వుండే లక్షణాలలో ఒకటి. ADHD సంకేతాలు అస్తమానూ పైకి కనపడవు. కానీ సంకేతాలన్నిటినీ మీరు కలిపి చూస్తె, ఖచ్చితంగా ఒక అంచనాకు రావచ్చు.

తక్కువ వినికిడి శక్తి

తక్కువ వినికిడి శక్తి

ADHD వున్న వారు ఎప్పటికీ ఒక మంచి శ్రోత కాలేరు. అతడు లేదా ఆమె అవతలివారిని మాట్లాడుతుంటే మధ్యలో ఆపుతారు, దీంతో వారికి చాలా కోపం వస్తుంది.

రాష్ డ్రైవింగ్

రాష్ డ్రైవింగ్

ADHD వున్న వ్యక్తుల్లో చాలా మంది రాష్ గా వాహనాలు నడుపుతారు. ట్రాఫిక్ రూల్స్ అంటే వారికి గౌరవం వుండదు, ఈ లక్షణం వల్ల తరచుగా ప్రాణ౦ మీదికి వచ్చే చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు.

అవరోదాలకు తలొగ్గడం :

అవరోదాలకు తలొగ్గడం :

చెప్పుకోదగ్గ ADHD సంకేతాలలో ఒకటి తేలిగ్గా ఏకాగ్రత కోల్పోవడం. ADHD సంకేతాలతో బాధ పడే వ్యక్తీ డోర్ బెల్స్, ఫోన్ కాల్స్ లేదా ట్రాఫిక్ చప్పుళ్ళకు కూడా తన ధ్యాస కోల్పోతూ ఉంటాడు.

నిర్వహణా సామర్ధ్యం లేకపోవడం :

నిర్వహణా సామర్ధ్యం లేకపోవడం :

ADHD తో బాధ పడే వ్యక్తీ వ్యవస్థీకృతంగా ఉండలేడు. వారి ఇల్లు గందరగోళం గానూ, వారి అపాయింట్మెంట్ డెయిరీ కలగాపులగం గానూ వుంటాయి.

సమయపాలన లేకపోవడం :

సమయపాలన లేకపోవడం :

అటెన్షన్ డెఫిసిట్ వున్నవారు వివరాల పట్ల ధ్యాస పెట్టలేరు. అందుకని ఒక అప్పాయింట్మెంట్ లేదా డిన్నర్ కు అనుకున్న టైం వారి మనసుకు పట్టదు. కొన్నిసార్లు ఆ పనికి చాలా ఆలస్యంగా రావడం వారికి అలవాటుగా మారిపోతుంది.

అసహనం :

అసహనం :

ADHD తో బాధ పడే వ్యక్తీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. వారు ఒక కప్పు కాఫి తాగుతూ హాయిగా కూర్చోవడం మనం చూడం. వాళ్ళు తమ కాళ్ళని ఊపుతూనో, వేళ్ళను కడుపుతూనో లేదా ఒక కాగితం మీద పిచ్చి గీతాలు గీస్తూనో కనపడతారు.

వైవాహిక సమస్యలు :

వైవాహిక సమస్యలు :

మంచి శ్రోత కాలేక పొతే వైవాహిక జీవితం కూడా దెబ్బ తింటుంది. ADHD వున్న వ్యక్తీ భాగస్వామి వారి వినికిడి శక్తి లోపాన్ని స్పందనశీలత లేకపోవడంగా భావించి, వారు కావాలనే పట్టించుకోవడం లేదని అనుకునే అవకాశం వుంది.

కొత్త పని ప్రారంభించడం లో ఆలస్యం :

కొత్త పని ప్రారంభించడం లో ఆలస్యం :

ADHD వున్న వారిలో మంచి ఆలోచనలే వుంటాయి గానీ వారు ఎప్పటికీ ఒక పని మొదలు పెట్టలేరు. ఏ కారణం లేకుండా వారు ప్రతి పనినీ రోజుల పాటు వాయిదా వేస్తూ వుంటారు.

కోపంతో విరుచుకుపడడం :

కోపంతో విరుచుకుపడడం :

ADHD సంకేతాలను ప్రపంచం అంత త్వరగా గుర్తించాడు కనుక దీంతో బాధ పడే వారు అవతలి వారు తమను అపార్ధ౦ చేసుకుంటున్నారని భావిస్తారు. వారికి హటాత్తుగా కోపం వచ్చి విరుచుకు పడతారు.

నిరంతర అసహనం :

నిరంతర అసహనం :

అటెన్షన్ లోపం వ్యాధితో బాధ పడే వారికి సూపర్ మార్కెట్ లో బిల్లింగ్ కోసం క్యూ లో నిలబడడం, ఒక మీటింగ్ లో మాట్లాడడానికి వారి వంతు వచ్చే దాకా ఆగడం లాంటి వాటికి అవసరమైనంత సహనం కూడా వుండదు.

మాట నిలబెట్టుకోలేక పోవడం :

మాట నిలబెట్టుకోలేక పోవడం :

ఈ వ్యాధి వున్న వ్యక్తులు వారి మాట నిలబెట్టుకోలేరు. మాట మీద నిలబడలేని వారిగా తరచుగా వీరు అపఖ్యాతి మూటగట్టుకుంటారు.

అస్తమానూ వస్తువులు పోగొట్టుకోవడం :

అస్తమానూ వస్తువులు పోగొట్టుకోవడం :

ఏ వస్తువు మీదా సరైన ధ్యాస లేకపోవడం వల్ల, ADHD వున్న వారు అస్తమానూ ఏదో ఒక వస్తువు పోగొట్టు కుంటూ వుంటారు. ఒక పర్సో, మొబైల్ ఫోనో లేక తాళాలో ఏవో ఒకటి పోతూనే వుంటాయి.

English summary

ADHD Symptoms That You Shouldn't Miss

The full form of ADHD is Attention Deficit Hyperactivity Disorder. It basically means that your attention span is abnormally low and that makes you extremely restless. Although it sounds simple, this disorder can have far reaching consequences.
Desktop Bottom Promotion